Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

హ్హయే సారా - రెండుసార్లు జీవించుట

"హ్హాయే శారా" తోరా భాగం యొక్క పేరుపై దృష్టి సారించి, మరణం తర్వాత జీవితం అనే కోన్సెప్ట్ ను పరిశీలిస్తుంది. ప్రారంభంలో ఇది అసాధ్యమైనదిగా అనిపించినప్పటికీ, శారా  యొక్క నిజమైన జీవితం ఆమె మరణంతో ఖచ్చితంగా ప్రారంభమవుతుందని కథనం సూచిస్తుంది. ఈ ప్రత్యేక దృక్పథం హీబ్రూ భాష యొక్క లోతైన దృకోణాన్ని తెలియజేస్తుంది. "షెనెయ్" అనే హెబ్రీ పధానికి “సంవత్సరాలు” మరియి “రెండు” అని రెండు విధాలుగా అర్ధం చేసుకోవచనే విషయాన్ని గట్టిగా తెలియజేస్తుంది. ఈ కథనం శారా మరణం యొక్క తీవ్ర ప్రభావాన్ని నొక్కి చెబుతుంది, ఇది ఇశ్రాయేల్ దేశంలో భూమిని కొనుగోలు చేయడానికి దారితీసింది, ఇశ్రాయేల్ జాతీయ జీవితం యొక్క మూలాలను సూచిస్తుంది. షరతులతో కూడిన పొలాలు లేదా మైధానాల పరిస్థితికి మరియు మఖ్ఫెలా గుహలో పితురలను పాతిపెట్టడం ద్వారా లభించిన షరతులు లేని శాశ్వతమైన స్వాస్త్యానికి గల వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది.

ఇస్సాకును బందించుట అనే భాగంలో త్యాగం న్యాయం మరియు మానవత్వంలో దాగివున్న లోతైన పాఠాన్ని వెల్లడి చేద్దాం

ఇస్సాకును బంధించుట అనే భాగము ఒక కలవరపరిచే ప్రశ్నను వేస్తుంది:   దేవుడు అబ్రాహామును ఎందుకు పరీక్షించాడు, ఇస్సాకును ఎందుకు పరీక్షించలేదు. ఇస్సాకు కదా బలి అయ్యేడి? ఈ పరీక్షను  రబ్బీ జుడా లోయెన్ అష్కెనాజీ గారు  దీనిని , గుణ లక్షణాల సంఘర్షణగా వివరించారు. అబ్రహం గారు దయగల ప్రేమ గుణము (హ్హెసెధ్)కు  మరియు ఇస్సాకు గారు  కఠినమైన న్యాయ విధానము (గెవురా)కు ప్రతినిధులై వున్నారు. దీనిలోని లోతైన పాఠం ఏంటి? ఇస్సాకు ప్రాణాలతో ఉండాల్సిన అవసరత ఉన్నా, త్యాగం చేయడానికి ఇష్టపడడం అనేది ఇస్సాకు జీవితానికి  ప్రాముఖ్యతను కల్పించింది. ఇవ్వడం ప్రాణాన్ని రక్షించడం మరియు బలిపీఠం మీద ఇస్సాకు  స్థానంలో ఉన్న పొట్టేలుకు మధ్య సమతౌల్యంలో మానవాళికి బహుమానం దాగివుంది."

లెహ్హ్ లెహ్హా / నీవలే, నీయంతట నీవు వెళ్ళి ప్రభావితం చెయ్

ఒక వ్యక్తి అనేక జాతులకు ఎలా తండ్రి కాగలడు? క్లుప్తంగా చెప్పాలంటే తన ప్రత్యేకతను కాపాడుకోవడం ద్వారా కాగలడు. ఆశ్చర్యకరంగా, ప్రత్యేకించి సున్నతి పొందుట ద్వారా అబ్రహాము అనేక జాతులకు తండ్రి అవుతాడు అని చెప్పబడింది. సున్నతి అనేది  అతనిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మిగిలిన ప్రపంచం నుండి వేరు చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మనం నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటే, మనం కొంత ప్రత్యేకతను  మరియు నిర్ధిష్టతను  కొనసాగించాలని నేర్చుకోవచ్చు. యూదులుగా మనకున్న  ప్రత్యేకత, మన స్వంత గుర్తింపును మనం సంరక్షించునోవడం అనేదే, మనం "అనేక దేశాలకు తండ్రి"గా ఉండేలా చేస్తుంది.  ప్రపంచంలోని సంస్కృతులలో సమ్మేళనం అయ్యే విధానం ద్వారా మనం ప్రభావితం చేయవొచ్చు అనే టెంప్టేషన్‌కు ఇది వ్యతిరేకమైన విధానం. "మనలోకి మనం తిరిగి రావడం" ద్వారా మనం ప్రపంచమంతటికీ ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తామని తోరా మనకు తెలియజేస్తుంది.

Search