(ఆజ్ఞ) మిట్స్‌వా: భోజన అనంతర దీవెన
పరాషా ఎకెవ్ లోని అత్యంత ప్రధానమైన మిట్స్‌వోత్ లో ఒకటి ఇశ్రాయేలియులు ఇశ్రాయేలు భూమిలోనికి ప్రవేశించబోతున్నారు అనే వాస్తవంతో సంబంధం కలిగివుంది. అది గోధుమ మరియు బార్లీ, ద్రాక్షలు, అంజూరాలు, దానిమ్మకాయలు, మొదలగు పండ్లతో నిండిన సారవంతమైన భూమియని తోరా వాగ్ధానం చేస్తుంది. వీటన్నిటిగురించి ఇలా చెప్పబడింది :
“నీవు తిని, తృప్తి పొంది నీ దేవుడైన అదోనాయ్ ను దీవింపవలెను.”
ఈ ఆజ్ఞ, ఇశ్రాయేలు ప్రజలు ఆ భూమిలోనికి ప్రవేశించే సంధర్భంలో చెప్పబడినప్పటికీ, ఈ దీవెన సార్వజనీనమైనది. మిద్రాష్ లోని కథలలో, అబ్రహాము తన గుడారములో అతిధులను ఆహ్వానించేప్పుడు, ఏ జాతికి చెందిన ప్రజలైనా, వారికి భోజనం ఏర్పాటుచేసి, ఆతరువాత భోజనము నిమిత్తము కృతజ్ఞత చెప్పమని కోరేవాడు. దానికి బదులుగా వారు అబ్రహాము మరియు తన భార్యయైన సారాకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించేవారు. అడ్డుపడి, అబ్రహాము వారిని ఆపి, విశ్వాన్ని దానిలోని సమస్తమునూ సృజించిన ఆ ఒక్కనికి కృతజ్ఞత చెప్పమని సూచించేవాడు. సృష్టికర్త పట్ల మన విశ్వాసమును కనుపరచుటకు మన ఆహారంపై దీవెన చెప్పాలి అనే మిట్స్‌వా యొక్క మూలము ఇదే.
మన పితరుడైన అబ్రహాము దేవుని ఉనికికి సంబంధించిన ఆధారాలను చూపించడానికి, భౌతికతత్వానికి బాహ్యమైన విషయాలో లేదా తాత్వికమైన ఆధారాలో చూపించలేదని గమనించాలి. దానికి బదులు తన మనుగడ బాహ్యమైన దానినుండి వెలువడిందని తన అతిధులు గుర్తెరిగే విధంగా ఒక సంధార్భాన్ని కలుగజేశాడు. భోజనం చేసేటప్పుడు జరిగేది ఇదే. మనం తినేటప్పుడు, మనము “స్వీకరించేవారము” గా ఉండాల్సి వుందని అంగీకరించాలి. అనగా మనము సృజింపబడినవారమని, మన మనుగడ మనతోనే ప్రారంభం కాలేదని గుర్తిస్తాము. అదేవిధంగా, ఎవరైతే తాము సృజింపబడినవారము అని గుర్తెరుగుతారో, వారికి సృష్టికర్త ఉన్నాడు అని అర్ధమౌతుంది. ఇదే యూదత్వము యొక్క పునాధి.
మన విశ్వాసమంతటిలో, మనం చేసే ప్రార్ధనలన్నిటిలో, కేవలము భోజనానంతరము చేసే ప్రార్ధన మాత్రమే తప్పనిసరిగా చేయాలని తోరా ఆక్షేపించింది. సీనాయి వద్ద తోరా బయల్పరచబడిన విషయం కంటే, ఆహారము గురించిన సందేశము ఇక్కడ సూచింపబడింది. దీనిలోని ప్రధానమైన సమాచారము ఏదనగా, హషేమ్ గారే సమస్త విశ్వానికి పోషకుడై ఉన్నాడు. అందరిపట్లా ఆయన దయ కలిగి ఉన్నాడు. అందవల్ల, ఆహారముకొరకు దీవెన చెప్పడం అనే మిట్స్‌వా సమస్త దేశాలపైనా భాద్యతగా ఉన్నది. దేవుని పోలిక (బెట్సెల్లెం) చొప్పున సృజింపబడిన ప్రతి జీవికి ఈ నియమము వర్తిస్తుంది. నోవహీయ విశ్వాసము చొప్పున జీవించు వ్యక్తి కూడా, బెరిత్ ఒలామ్ ప్రార్ధన పుస్తకములో వివరించిన రీతిగా భోజనానంతర దీవెన (బిర్కత్ హ మాజోన్) ఖచితముగా చెప్పాలి. ఆ గ్రంధములో సమస్త దేశాల సభ్యులందరికి సరిపదేవిధంగా, “భోజనము తరువార దీవెనలు” అను ఒక భాగాన్ని మేము పొందుపరిచాము.