పరషత్ హుకత్ లో, ఎర్రని పెయ్య బూడిద ద్వారా మరణం యొక్క అపవిత్రత నుండి శుద్ధి చెందే ప్రక్రియను మనం నేర్చుకుంటాము.
మరణం ఒక వ్యక్తిని అపవిత్రం చేస్తుందనే ఆలోచనే మానవాళికి అవమానం. మనుషులు అమరులు కాకపోవడం సిగ్గుచేటు. ఇది ఎక్కడ మొదలవుతుందో మనం అర్థం చేసుకుంటాము: ఇది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంతో ప్రారంభమవుతుంది మరియు దానిని సరిదిద్దాలి. మానవులపై మరణ యొక్క విజయ స్థానం శాశ్వతంగా ఉండదు. అందువలన, తోరా ఎర్ర పెయ్య యొక్క ప్రత్యేక నియమాల ద్వారా మరణం అనేది చివరికి ప్రపంచం నుండి నిర్మూలించబడుతుందని మరియు మరణం యొక్క మలినాలు/అపవిత్రత మాయమవుతాయని సూచిస్తుంది. ఎలా?
ఇది చాలా సులభం. ఎర్రని పెయ్య యొక్క నియమాలు మరణం మరియు చనిపోయిన వారి పునరుత్థానం యొక్క మొత్తం ప్రక్రియను ప్రతీకాత్మకంగా పునర్నిర్మించే చర్యలను కలిగి ఉంటాయి. పురాతన కాలంలో మానవులతో సన్నిహితంగా ఉన్న అతిపెద్ద జంతువు ఆవు. ఎద్దు కంటే ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఎద్దు బలంగా ఉన్నప్పటికీ, ఇది దాని లోపల పిండాన్ని మోయదు; ఆవు సంతానోత్పత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నిర్ధిష్టంగా ఎర్ర ఆవు ఎందుకు? ఎరుపు అనేది భౌతిక ప్రపంచం యొక్క రంగు. అదనంగా, ఆవు పరిపూర్ణంగా ఉండాలి, ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి, ఎప్పుడూ కాడిని మోయకూడదు; ఇది సంపూర్ణమైనది.
అదనంగా, ఎరుపు ఆవు బూడిద ద్వారా శుద్దీకరణ ప్రక్రియకు అవసరమైన ఇతర వస్తువులుకూడా ఉన్నాయి: పురాతన కాలంలో మధ్యప్రాచ్యంలో అతిపెద్ద చెట్టు అయిన దేవదారు, జీవసంబంధమైన ప్రాణులన్నిటిలో అత్యల్ప రూపమైన ఒక పురుగు, మరియు హిస్సోప్, అతి చిన్న మొక్కగా పిలువబడుతుంది.
ఎర్ర ఆవు నుండి ఎర్రటి పురుగు వరకు మరియు సెడార్/దేవదారు వృక్షం నుండి హిస్సోపు వరకు జీవం యొక్క అన్ని హద్దులను తీసుకొని, అవి బూడిదగా మారే వరకు వాటిని కలిపి కాల్చమని తోరా మనకు ఆదేశిస్తుంది. బూడిద అనేది జీవం యొక్క అత్యల్ప రూపం; దానిని ముద్దగా తయారు చేయలేము మరియు దాని గరిష్ట శక్తి వద్ద మరణాన్ని సూచిస్తుంది.
ఈ బూడిదను, ఈ మరణమును జీవ జలంతో కలిపి ఒక పాత్రలో వేస్తారు. జీవ జలం మరియు పాత్ర అంటే ఏమిటి? అవి మనిషికి సాదృశ్యంగా వున్నాయి. మనిషి అనేవాడు జీవజాలములా, అనంతంగా ప్రవహిస్తాడు - ఇది మానవ ఆత్మ, మరియు పాత్ర అనగా శరీరం. అందువలన ఎర్ర ఆవు నియమాల ప్రకారం శరీరాన్ని ఆత్మను, ఒక పాత్రగాను జీవ జలంగాను తీసుకొని జంతువులు, మొక్కల నుంచి జీవ అవశేషమైన బూడిదతో కలుపుతాం. అప్పుడు, దీనితో, మరణం నుండి పునరుత్థానం సాధ్యమవుతుంది.
ఎర్ర ఆవు యొక్క మొత్తం ప్రక్రియ ప్రాణ నష్టానికి మరియు పునరుత్థానం ద్వారా దాని పునరుద్ధరణకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇంత స్పష్టంగా ఉంటే ఎర్రని పెయ్య రహస్యాన్ని అర్థం చేసుకోలేమని మన యూదియ జ్ఞానులు మిద్రాష్ లో ఎందుకు చెప్పారు? నేను కేవలం ఒకటిన్నర నిమిషంలో మీకు దీన్ని వివరించాను. దీనికి జవాబు, జీవం నుండి మరణానికి మరియు మరణం నుండి జీవానికి పరివర్తన ఎలా చేయబడుతుందో ఒక వ్యక్తి అర్థం చేసుకోలేడు. ఇది ఎల్లప్పుడూ స్తుతిపాత్రుడైన సృష్టికర్త యొక్క రహస్యంగా ఉంటుంది.