తోరా గ్రంధం పరషత్ బాలక్ నందు, చరిత్ర అంతటిలో అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరిని గూర్చి చెప్పబడుతుంది. అతడే ప్రపంచ దేశాలనుండి వచ్చిన బెయోరు కుమారుడైన బాలాము. ఆయన ఎంత గొప్పవాడంటే, “మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలియులలో ఇదివరకు పుట్టలేదు”(ద్వితీయ 34:10) అని చెప్పబడినప్పటికీ మన జ్ఞానులు గుర్తించిన ప్రకారం అన్యదేశాలలో అటువంటి ప్రవక్త పుట్టడం జరిగింది. అతడే బెయోరు కుమారుడైన బాలాము. అయితే, బాలాము తలరాత గోరమైనది. ఎందుకనగా అతడు ఇశ్రాయేలియులకు హాని చేయడానికి ప్రయత్నించాడు.
మనము బాలాములో అసమాన్యమైన విషయమేదో గమనిస్తాము: ఇశ్రాయేలియులను శపించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, అతడు చివరికి వారిని ఆశీర్వదిస్తాడు. అతడు ఇశ్రాయేలును ఎందుకు దీవించాడంటే, అతనిలో రెండు భిన్నమైన భావనలు ఉన్నాయి. ఒకవైపు అతడు ఇశ్రాయేలియులను కీర్తిస్తూనే మరొకప్రక్క ఈ మెచ్చుకోలు కారణంగా వారిపట్ల అసూయ పడ్డాడు. కాబట్టి అతనికి మరొక అవకాశంలేక వారిని శపించడానికి పూనుకున్నాడు. కానీ చివరికి దీవించాల్సివచ్చింది.
యూదియ ప్రజలపట్ల ఇటువంటి సంక్లిష్టమైన ధోరణి ప్రపంచప్రజలందరిలోను చరిత్ర అంతటా మనం గమనించవచ్చు. “ మరియు సమస్త భూవంశములు నీవలన ఆశీర్వదింపబడును(ఆది 12:4) – ప్రకారం సమస్త జాతులలో నుండి ఇశ్రాయేలియులు ఎన్నుకోబడినది ఆ జాతుల ఆశీర్వాధముకొరకే అనే సత్యమును కొన్నిసార్లు ఆలోచితముగాను మరికొన్నిసార్లు అనాలోచితముగాను మానవాళి గుర్తించినది. కానీ చివరికి, ఈ జ్ఞానము కలిగివున్నప్పటికి శ్వవిరుద్దముగా ఒకరకమైన యాంటీ సెమిటిజంను రేపుతుంది.
ఉదాహరణకు, ఒక కుటుంబములోనే, తల్లిదండ్రులు చేత చాలా గారాబం చేయబడిన కుమారుడే వారు చూపిన దయకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్రతి మానసిక విశ్లేషకునీకీ ఇది సుపరిచితమైన విషయమే. మనల్ని శపించడానికి పూనుకున్న బెయోరు కుమారుడైన బాలాముకు దీనిని కనెక్ట్ చేయవొచ్చు.
సినగోగ్ లోకి ప్రవేశించేటప్పుడు, ప్రత్యేకించి బాలాము మాటలను మనం స్మరించుకుంటాము – “ యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలూ నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.” (సంఖ్య 24: 5) ప్రధానంగా, అన్యాజనాంగాల మధ్య ప్రవచన ఉనికి మరియు తోరాలో దాని ప్రస్తావన ఇశ్రాయేలు పై కురిపించబడిన దైవిక ప్రేరణ ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేస్తుందనే ఆశను మానవాళికి అందిస్తుంది.
మన ప్రాచీన మిద్రాషిమ్ లో ఒకటైన, తన్నా బెదే ఎలియాహూ నందు ఇలా చెప్పబడింది: ఆకాశమును భూమిని నాకు శాక్షులుగా కలిగియున్నాను (జాతిమత వ్యత్యాసము లేకుండా), స్త్రీ పురుషులకు (లింగ భేదం లేకుండా), పనివానికి పనికత్తెలకు (సామాజిక తారతమ్యత లేకుండా), ప్రతివారికీ వారి క్రియలను అనుసరించి వారిపై దేవుని ఆత్మ క్రుమ్మరింపబడును అనే సత్యాన్ని వెల్లడిస్తున్నారు.
క్లుప్తంగా, ఏలియాహూ గారు వెల్లడించినది యేమిటంటే, ఒక వ్యక్తిపై దేవుని ఆత్మ అనేది అతని క్రియల ఆధారంగానే అతనిపై క్రుమ్మరింపబడుతుంది తప్ప, అతనికిగాల గుర్తింపు లేదా పరిస్థితులను బట్టి కాదు. కావున, పరిశుద్దాత్మ మెండుగా ఇశ్రాయేలుపైన మరియు ప్రపంచము పైనా క్రుమ్మరింపబడాలని ఆశిద్దాం.