Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, హెఫెరు కుమారుడైన సెలోపెహదు కుమార్తెల వింతైన కథను మనం నేర్చుకుంటాము. 

సెలోపెహదు అనే వ్యక్తికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, అతనికి కుమారులు లేరు, మరియు అతను మోషే కాలములో ఎడారిలో నివసించాడు. 

తోరా ప్రకారం, వారసత్వ స్వాస్థ్యం  పురుషులకు చెందుతుంది, స్త్రీలకు  కాదు, ఇది అర్ధవంతంగా ఉంటుంది. పురాతన కాలంలో, ప్రధానంగా భూమిని వారసత్వంగా పొందుకొనేవారు, దానిని సేద్యం చేయాల్సిన అవసరం ఉంది. భూమిలో ఎలా పని చేయాలో పురుషులకు తెలుసు కానీ మహిళలకు తెలీదు. అందువలన, ఒక కుటుంబం లోని వారసత్వం తరువాతి తరానికి వెళ్ళి, వారు ఆ కుటుంబాన్ని పోషించాల్సివునప్పుడు, వారసత్వం అనేది సహజంగానే పురుషులకు చెందుతుంది, స్త్రీలకు చెందదు. కానీ సెలోపెహదుకు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారు మోషే గారి వద్దకు వచ్చి తమ తండ్రి వారసత్వ స్వాస్థ్యం గురించి అడిగడం జరిగింది. 

సెలోపెహదు కుమార్తెల కథ ఫలితంగా, ఒక కొత్త చట్టం స్థాపించబడింది. ఒక వ్యక్తికి కుమారులు లేనప్పుడు, అతని కుమార్తెలు అతనికి వారసులుగా ఉండాలని తీర్పు ఇవ్వబడింది. ఇది ఈనాటి వరకు ఇశ్రాయేలు ప్రజలలో చట్టంగా ఉంది. 

ఈ కథలోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆదేశం పరిశుద్ధుడైన దేవువుని నుండి మోషేకు నేరుగా రాలేదు, కానీ సెలోపెహదు కుమార్తెలు ఈ సమస్యను లేవనెత్తిన తరువాత మాత్రమే వచ్చింది. దేశం లేదా దేశములోని  ప్రజలు చొరవ తీసుకొని ఒక సమస్యను లేవనెత్తిన తరువాత మాత్రమే మోషే గారు స్తుతి పాత్రుడైన దేవుని నుండి పరిష్కారం విన్నాడని తోరా సాక్ష్యం ఇచ్చిన అనేక సమస్యల పరంపరలో ఇది చేరుతుంది. 

సెలోపెహదు కుమార్తెల ఈ  అతి ముఖ్యమైన వ్యాజ్యము, పరాషత్ బెహలోత్కలో అపవిత్రత కలుగుట వలన పస్కా బలి సమర్పించలేని పురుషుల కథనం కోవకు చెందుతుంది. స్తుతిపాత్రుడైన దేవునిని మోషే గారు తాను ఏమి చేయాలి  అని అడిగినప్పుడు దేవుడు రెండవ పస్కా గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలియాజరు కుమారుడైన పీనెహాసు, సాలూ కుమారుడైన జిమ్రీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కథలో మోషే గారికి ఖచ్చితంగా ఏమి చేయాలో తెలియదు. కాని పీనెహాసుకు అది తెలుపబడింది. 

ప్రజల చొరవ వలన పరిష్కారం చూపబడిన ఇటువంటి ఇతర ప్రశ్నలు కూడా వున్నట్లు మనం చూస్తాము. ఆతరువాతే, పరిశుద్ధుడు స్తుతిపాత్రుడైన దేవుడు, మోషే గారికి పరిష్కారాన్ని వెల్లడించడం జరుగుతుంది. ఏదైనా విషయములో అవగాహనను కోరడంలో ప్రజల పాత్ర యొక్క విలువను మరియు వారి ప్రశ్నలకు దైవిక ప్రతిస్పందనలను ఇది నొక్కిచెబుతుంది. 

 

వీటన్నింటికీ అర్థం ఏమిటి? దీని అర్థం తోరా రెండు మార్గాల ద్వారా వెల్లడిచేయబడుతుంది. పైనుండి మోషే ద్వారా ఒక ప్రత్యక్ష మార్గం, అనగా మన గురువు, రబ్బీ అయిన మోషే గారి ద్వారా,  అలాగే దిగువన ప్రజలనుండి కూడా తోరా వెల్లడిచేయబడుతుంది.

 

మోషే గారికి వెంటనే సమాధానం తెలియని వ్యాజ్యాలన్నిటి సాధారణ సారూప్యత గురించి మనం లోతుగా పరిశోధించాము. ఈ విధానములో, వారందరూ ఒక విధంగానో మరొక విధంగానో యోసేపుతో సంబంధం కలిగిఉన్నారు. యాకోబు కుమారుడైన యోసేపు, అతని వారసులు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. దైవ సంకల్పాన్ని తెలుసుకోవాలంటే మనం రెండు దిశలలో వినాలి అని దీని నుండి అర్ధమౌతుంది: పై నుండి క్రిందికి, అలాగే ప్రజల ద్వారా క్రింది నుండి పై వరకు పనిచేసే దైవిక వాక్యాన్ని కూడా వినాలి. ప్రజలకు కొంత జ్ఞానం ఉంది, వారిలో దైవిక పరిశుద్ధాత్మ నివశిస్తుంది. ఇది కొన్నిసార్లు మనకు ధర్మన్ని విధిని బోధిస్తుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search