వయెరా అను తోరా భాగములోవున్న , ఇస్సాకును బంధించుట అను కథ మన పితరుడైన అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఉన్నత శిఖరాన్ని సూచిస్తుంది. అసలు ఈ కథలో ఏం జరుగుతుంది? "దేవుడు అబ్రాహామును పరీక్షించెను" అని చెప్పబడింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: ఇది అబ్రహాముకు పరీక్ష అని ఎందుకు వ్రాయబడింది? ఇక్కడ బలిపీఠం మీద బలి అయ్యేది ఇస్సాకె గాని అబ్రహాము కాదు కదా?.
రబ్బీ జుడా లోయెన్ అష్కెనాజీ గారి వివరణ ప్రకారం, అకేదా (బందించుట) అనే భాగంలోని సంఘటన నిజానికి అబ్రహాము గారికే పరీక్ష. ఎందుకంటే అబ్రహాము గారు హ్హెసెధ్ / దయగల ప్రేమా గుణానికి ప్రతిరూపము.
హ్హెసెధ్ అనే గుణలక్షణము ఇస్సాకును బంధించడాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే హ్హెసెధ్ అనే గుణాలక్షణము, దేవుడు జీవ ప్రాధాత అని గుర్తిస్తుంది. అలాంటప్పుడు ఒకరి ప్రాణమును వెనక్కి తీసుకోవాలని ఎలా అనుకుంతాడు? మరొక ప్రక్క, ఇస్సాకు గారు గెవురా అను గుణలక్షనమునకు ప్రాతీకగా ఉన్నారు. అనగా కఠినమైన న్యాయ విధానమునకు ప్రతీకగా ఉండడం వల్ల అకేదా అనేది ఆయనకు ఏమాత్రం కొత్త విషయం కాదు. గెవురా (కఠినమైన న్యాయ) విధానం ప్రకారం, ఒకడు తాను పొందుకున్నదానికి వెల చెల్లించాలి. కాబట్టి ఇస్సాకు గారి ఉద్దేశంలో తాను ఉచితంగా సృష్టికర్త నుండి పొందుకున్న తన జీవితానికి వెలగా తన ప్రాణమును ఆయనే తిరిగి చెల్లించాలి. కాబట్టి తాను బందింపబడటం అనే విషయం ఇస్సాకు గారికి కొత్తదేమీ కాదు. ఈ విషయం అబ్రహాము గారికి మాత్రమే నూతనమైనది.
ఈ అంశము నుండి మనం ఎటువంటి సారాంశాన్ని గ్రహించగలం ?
కథ చివరిలో ఇస్సాకు గారిని ప్రాణాలతో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇస్సాకు తనకు తాను బలిలిగా అర్పించబడడానికి సిద్దపడినా అది చేయాల్సిన అవసరత లేకపోయింది. అనుకున్నదానికి వ్యతిరేకంగా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్దపడ్డాడో ఆ క్షణమే ఆ ప్రాణం యెంతో ప్రాముఖ్యత గలదైయింది.
అందుచేత పరిశుద్దుడైన దేవుడి, అబ్రాహామును, ఆ చిన్నవానిమీద చేయి వేయకూము అని ఆజ్ఞాపించడం జరిగింది. దాని ద్వారా బలి/త్యాగము అను విషయంలోని మూల ఉద్దేశాన్ని భలపరచబడింది. మనుష్యులు తమను తాము అర్పించుకోవడానికి సిద్దపడతారు. కానీ అబ్రహాము గారు ఏవిధంగా మనిషికి బదులు ఒక పొట్టేలును అర్పించారో అదే విధంగా ఒక వ్యక్తికి బదులు జంతువును ఏర్పాటు చేయాలి అని హెబ్రీయుల హలహ్హా డిమాండ్ చేస్తుంది.
అయితే ఇంతటి గొప్ప కార్యం వల్ల ఎవరు లాభపడ్డారు? వాస్తవంగా దీనివల్ల లాభపడింది. అబ్రహాము తనతో పాటు వచ్చిన యూదుయేతర, హీబ్రూయేతర యువకులకు సరిగ్గా ఇదే తెలియజేశాడు. “తన పనివారితో – మీరు గాడిదతో అక్కడనే ఉండుడి; నేనునూ ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీయొద్దకు వచ్చెదము అని చెప్పెను” (ఆది 22:5). అనగా అధికమైన నైతిక మరియు ఆధ్యాత్మిక వికాశాన్ని తీసుకొని రావడమే దీనిలోని లక్ష్యము. ప్రపంచమంతటికి ఇస్సాకును బందించడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదే.