“నీ దేశము నుండి నీవు ముందుకు వెళ్ళుము.” “నీవు ముందుకు వెళ్లుము”, అంటే అర్ధము ఏంటి? తోరా సింపుల్ గా - "వెళ్ళు" అని చెప్పివుంటే సరిపోయేది కదా. హెబ్రీ లో గాని ఇతర భాషలలోగానీ, 'నువ్వు ముందుకి వెళ్ళు' అని అంటే దాని ఉద్దేశం నీకు నీవుగా ఒంటరిగా నీతో ఇతరులెవ్వరిని తీసుకెళ్లకుండా వెళ్ళు అని.
పరిశుద్దుడైన దేవుడు, అబ్రాహామును తనతో తీసుకువెళ్ళవద్దని సూచించిన ఇతరులు ఎవరు? దీనికి సమాధానం - అతని అనుచరులందరినీ, అనగా 'వారు హారానులో చేసిన ఆత్మలు' అని పిలవబడిన వారందరినీ. మొదట్లో, దేవుడు తనను తాను అబ్రాహాముకు బయలుపరచుకోకముందే, కేవలము ఏక దేవుని ఆరాదించు వారి సంఘాన్ని స్థాపించాడు. అందుచేత అబ్రాహాము ఈ పనిని వ్యక్తిగతంగా కొనసాగించాలని ఆశపడ్డాడు. కానీ మన పితరుడైన అబ్రహాము ఉన్నత స్థాయికి ఎదగాలని, మరి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవుడు కోరుకున్నాడు.
"నేను నిన్ను గొప్ప జనముగా చేసెదను" అని దేవుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు. అనగా నీవు రాజకీయ మరియు జాతీయ వ్యస్థలను కూడా స్థాపించాలి అని అర్ధము. అనగా నీవు ఒక దేశాన్ని స్థాపించాలి అని దేవుడు అబ్రహాముకు సూచించడం జరిగింది.
ఎందుకు? ఎందుకంటే వ్యక్తులను మాత్రమే కాక ఇతర దేశాలను కూడా సరిదిద్దడానికి వారికి ఒక స్వంత దేశం అవసరం. ఇశ్రాయేల్ ప్రజల లక్ష్యం సాహసోపేతమైనది. కేవలము వ్యక్తిని మాత్రమే కాకు రాష్ట్రాలుగా దేశాలుగా వ్తవస్థీకృతమైన సమాజాలన్నిటినీ సరిదిద్దాలని ఇశ్రాయేల్ కోరుకుంటుంది. మరియు అబ్రాహాము ఈ భాద్యతను స్వయంగా స్వీకరించాడు. "అదోనాయ్ అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళేను." తోరా ఇలా చెబుతుంది - "అబ్రహాము తన భార్యయైన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు వెళ్ళుటకు బయలుదేరి కనానుదేశమునకు వచ్చిరి." అబ్రాహాము రెండు సార్లు వెళ్లాడని మన పెద్దలు తెలియజేశారు. మొదటిసారి, ఒక దేశాన్ని స్థాపించే దైవిక కార్యం కొరకు, తానొక్కడే ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. రెండవసారి, ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలనే బృహత్తర ప్రణాళికను కొనసాగించడానికి, ప్రతివారిని దానిలో పాలిభాగస్తులు చేయడానికి వెళ్ళడం జరిగింది. అందుచేత, మన పితరుడైన అబ్రహాము ఒకేసారి రెండు దర్శనాలను గ్రహించడం జరిగింది: వ్యక్తిని సరిదిద్దే దర్శనము మరియు సమాజమును సరిదిద్దే దర్శనము. అందుచేత, అబ్రాము, అబ్రహాముగా మారడం జరిగింది. అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి.
ఒక వ్యక్తి అనేక జాతులకు ఎలా తండ్రి కాగలడు? క్లుప్తంగా చెప్పాలంటే తన ప్రత్యేకతను కాపాడుకోవడం ద్వారా కాగలడు. ఆశ్చర్యకరంగా, ప్రత్యేకించి సున్నతి పొందుట ద్వారా అబ్రహాము అనేక జాతులకు తండ్రి అవుతాడు అని చెప్పబడింది. సున్నతి అనేది అతనిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మిగిలిన ప్రపంచం నుండి వేరు చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మనం నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటే, మనం కొంత ప్రత్యేకతను మరియు నిర్ధిష్టతను కొనసాగించాలని నేర్చుకోవచ్చు. యూదులుగా మనకున్న ప్రత్యేకత, మన స్వంత గుర్తింపును మనం సంరక్షించునోవడం అనేదే, మనం "అనేక దేశాలకు తండ్రి"గా ఉండేలా చేస్తుంది. ప్రపంచంలోని సంస్కృతులలో సమ్మేళనం అయ్యే విధానం ద్వారా మనం ప్రభావితం చేయవొచ్చు అనే టెంప్టేషన్‌కు ఇది వ్యతిరేకమైన విధానం. "మనలోకి మనం తిరిగి రావడం" ద్వారా మనం ప్రపంచమంతటికీ ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తామని తోరా మనకు తెలియజేస్తుంది.