Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

విశ్వాస యాత్రను ప్రారంభించడం:

మీరు ఎప్పుడైనా ఈ అంతరిక్షం యొక్క విస్తీర్ణం చూసారా మరియు విశ్వం యొక్క మూలాల గురించి, వాస్తవికత గురించి ఆలోచించారా?  ప్రకృతి యొక్క సంక్లిష్టమైన పనితీరు, సున్నితమైన జీవన సమతుల్యత మరియు మన అవగాహనకు మించిన లోతైన రహస్యాల గురించి మీరు ఆలోచించారా? అలా అయితే, సమయం మరియు సంస్కృతి యొక్క సరిహద్దులను అధిగమించే సంభాషణ ద్వారా ఆకర్షించబడటానికి సిద్ధంగా ఉండండి - ఒక రబ్బీ మరియు ఖజార్ మధ్య సంభాషణ, ఇది జ్ఞానం, విశ్వాసం మరియు దైవికత యొక్క తీవ్రమైన లోతులను పరిశోధిస్తుంది.

ఈ ఆకర్శనీయమైన విషయం మన ఊహలను సవాలు చేస్తుంది, సృష్టిపై మన అవగాహన, సృష్టికి కారణం దాని పాత్ర మరియు విశ్వాసం యొక్క స్వభావాన్ని ప్రశ్నించడానికి మనలను ఆహ్వానిస్తుంది. విశ్వాసం మరియు జ్ఞానం మధ్య సంక్లిష్ట సంబంధాన్ని అన్వేషించుటకు మరియు నిజమైన ఆధ్యాత్మిక నెరవేర్పును సాధించే మార్గాన్ని ప్రకాశింపజేయుటకు, చిక్కులతో కూడిన తాత్విక విచారణ ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తుంది,

మీరు రబ్బీ మరియు ఖజార్‌ ల మధ్య జరిగిన ఈ పరివర్తనాత్మక మేధో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీ మనస్సును సవాలు చేయడానికి మరియు మీ ఆత్మను మేల్కొల్పడానికి సిద్ధంగా ఉండండి. వారి జ్ఞానం మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి, మీ గురించి, ఈ ప్రయాణం మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరియు ఉనికిని నిర్వచించే రహస్యాల గురించి లోతైన అవగాహనకు దారితీస్తుంది.

యేర్పాటు చేసుకున్నారా లేదా ఒకరిని ఎంచుకున్నారా?”

యూదుల అసాధారణవాదం కోసం రబ్బీస్ ఆర్గ్యుమెంట్‌ను ఆవిష్కరించడం

  1. అల్ ఖజారీ: నేను, అందరితో సమానంగా నల్లజాతి ప్రజలను కూడా చూడలేని చట్టాన్ని ద్రుడపరచివుంటే మీ సమాధానం సరైనదే. వారి పరిశోధనల ఫలితం ఏమిటంటే, ఈ ప్రపంచం ప్రారంభం లేకుండా అది పదివేల కాదు, మిలియన్లు కాదు, అసంఖ్యాక సంవత్సరాలనుండి ఉందని చెప్పే తత్వవేత్తల గురించి మీ అభిప్రాయం ఏమిటి.                                                    
  2. రబ్బీ: తత్వవేత్తలకు ఒక సాకు ఉంది. వారు ఉత్తరాన నివసించిన యాఫెత్ సంతానముమకు చెందినవారు, గ్రీకు వారు కావడం వలన సైన్స్ మరియు మతం వారికి వారసత్వంగా రాలేదు. అయితే దైవిక సహాయం ద్వారా ఆదాము నుండి వచ్చిన జ్ఞానం, నోవహు వారసులుగా ప్రాతినిధ్యం వహించి మరియు నోవాహు సారాన్ని స్థాపించిన షేమ్ సంతానంలో మాత్రమే కనుగొనబడింది. ఈ జ్ఞానం ఎల్లప్పుడూ ఈ సారంతోనే అనుసంధానించబడి ఉంటుంది మరియు ఎప్పటికీ మారదు. గ్రీకులు పర్షియన్లనుండి దానిని స్వీకరించారు. పర్షియన్లు దీనిని కల్దీయుల నుండి పొందారు. అప్పుడే ప్రసిద్ధ [గ్రీకు] తత్వవేత్తలు పుట్టుకొచ్చారు, కానీ రోమ్ రాజకీయ నాయకత్వాన్ని స్వీకరించిన తరువాత మరలా వారు పేరుకు తగిన తత్వవేత్తలు తయారు చేయలేదు.                                                                                                                       
  3. అల్ ఖజారీ: దీని అర్థం అరిస్టాటిల్ యొక్క తత్వశాస్త్రం విశ్వసనీయతకు అర్హమైనది కాదా?                                                                                                      
  4. రబ్బీ: ఖచ్చితంగా! అతనికి ఒక విశ్వసనీయ మూలం నుండి జ్ఞానాన్ని అందుకునే సాంప్రదాయ లేనందున అతడు తన స్వంత ఆలోచనను వినియోగించాడు. అతను ప్రపంచం యొక్క ప్రారంభం మరియు ముగింపు గురించి ధ్యానం చేసాడు, కానీ శాశ్వతత్వం యొక్క సిద్ధాంతం వలె ప్రారంభం (సృష్టి) సిద్ధాంతంలో చాలా కష్టాలను కనుగొన్నాడు. చివరగా, శాశ్వతత్వం కోసం తత్వవేత్త చేసిన ఈ వియుక్త ఊహాగానాలు చాలా ప్రాచుర్యం చెందడం వలన ముందు నివసించిన వారు కాలక్రమం లేదా ఉత్పన్నం గురించి వివరించినవాటిని విచారించడానికి అతనికి ఎటువంటి కారణం కనబడలేదు. అతను ఒక ప్రమాణీత కలిగి మరియు అంగీకరించబడిన సాంప్రదాయాలు కలిగిన ప్రజల మధ్య నివసించినట్లయితే, అతను సృష్టి సిద్ధాంతాన్ని స్థాపించడానికి తన ఫలితాలను మరియు వాదనలను వర్తింపజేసేవాడు, ఏది ఏమైనప్పటికీ సృష్టి సిద్దాంతానికి బదులుగా శాశ్వతత్వం అంగీకరించడం చాలా కష్టం.                                                                                                               
  5. అల్ ఖజారీ: దీనిని ద్రుడముగా రుజువుచేసే ఏదైనా నిర్ణయాత్మక రుజువు ఉందా?                                                                                                                      
  6. రబ్బీ: అసలు ఇటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్‌లో వ్యతిరేకించదగిన విషయం ఏదైనా ఉంటే స్వర్గం ఖండించుగాక! అంతేకాక అది అద్భుతకార్యాలను గూర్చి చెబుతుంది, సామాన్య విషయాల మార్పులను గూర్చి, నూతన విషయాల ఉద్భవం గూర్చి లేదా ఒకటి మరొకదానిలా మార్పు చెందడం గురించి చెబుతుంది. సృష్టికర్త తాను సంకల్పించిన విషయాన్ని తను కోరుకున్న సమయములో సాధించగలడని ఇది రుజువు చేస్తుంది. శాశ్వతత్వం మరియు సృష్టికర్తకు సంబంధించిన ప్రశ్న చాలా అస్పష్టంగా ఉన్నప్పటికీ, వాటికి సంబందిచిన వాదనలు సమానంగా సమతుల్యంగా ఉన్నాయి. సృష్టి సిద్ధాంతం ఆదాము, నోవాహు మరియు మోషే వంటి ప్రవక్తల సాంప్రదాయం మూలంగా ఎక్కువ విలువను కలిగివుంది, ఇది ఊహాగానాలవలే కాక అధిక  విశ్వసనీయతకు మరింత అర్హమైనది. ఒకవేళ, ధర్మశాస్త్రాన్ని విశ్వసించే వ్యక్తిని  శాశ్వతమైన విషయాన్ని గాని  లేక  దీనికి ముందు అనేక ప్రపంచాల ఉనికి ఉంది అని అంగీకరించమని బలవంతం చేస్తే,  అది అతని విస్వాసాన్ని క్రుంగదీయదు  ఎందుకంటే ఈ ప్రపంచం ఒక నిర్దిష్ట యుగంలో సృష్టించబడగా ఆదాము మరియు నోవాహ్ అనే వారు మొదటి మానవులు ఉన్నారు.                                      
  7. అల్ ఖజారీ: ఇప్పటివరకు ఈ వాదనలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. మనము మన సంభాషణను ఇంకా కొనసాగించ వచ్చా, ఎందుకంటే మరిన్ని నిర్ణయాత్మక రుజువులను జోడించడానికి నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు నీవు ఇంతకుమునుపు ఇచ్చిన వివరణలో విషయాన్ని, అనగా దేహాత్మలు, మనసును, జ్ఞానమును దేవదూతలను సృజించినవాడు-అతున్నతుడు పరిశుద్ధుడు మహాఘనుడై మానవ మేధస్సుకు అతీతుడుగాను, ఇంద్రియాలతో గ్రహింపశక్యము కానివాడుగానూ ఉన్న్ అతదు, ఆశ్చర్యంగా అనిపించినప్పటీకీ, అల్పమైన ఎన్నికలేని పదార్ధముతో చేయబడిన జీవులతో సంబాషణ చేసాడు అనే ధ్రుడ విశ్వాసం నీ మనసులో ఎలా స్తిరపడిందో పరిశీలిద్దాం. ఎందుకంటే అతి చిన్న పురుగుసైతం ఆయన జ్ఞానంలోని అధ్బుతాలను మానవ మేధస్సుకు అతీతమైన రీతిలో చూపిస్తుంది.                                                                                                    
  8. రబ్బీ: నీకు నేను చెప్పదలచుకున్న సమాధానాన్ని నీవు చాలా వరకూ గ్రహించావు. ఉదాహరణకు ఒక చీమను సృష్టించుటలో వినియోగించబడే జ్ఞానాన్ని, అంతరిక్షములోని గోళానికి లేదా నక్షత్రానికి లేదా మరేదైనా ఇతర వస్తువును సృష్టించుటలో వినియోగించబడే జ్ఞానంతో సరిపోల్చగలవా, ఈ విశయములో సర్వశక్తిమంతుడైన సృష్టికర్త కొంచెం తక్కువ గాని కొంచం ఎక్కువ గాని కాకుండా సృష్టికర్త ప్రతి దానికి తగిన తూకం వేసి ఇస్తాడు కదా?   
  9. అల్ ఖజారీ: ఇది ప్రకృతి యొక్క తీరు కదా.
  10. రబ్బీ: అసలు ప్రకృతి అంటే ఏమిటి?
  11. అల్ ఖజారీ: తత్వశాస్త్రం బోధించినదానిని బట్టి, ఇది ఒక నిర్దిష్ట శక్తి; నిజంగా ప్రకృతి అనేది ఏమిటో నాకు తెలియదు కాని నిస్సందేహంగా తత్వవేత్తలకు తెలుసు.
  12. రబ్బీ: మనకు ఎంత తెలుసునో తత్వవేత్తలకు కూడా అంతే తెలుసు! ఒక వస్తువు చలించడం లేదా విశ్రాంతి తీసుకోవడం అనేవి దాని సహజమైన మూలం కారణం అయిన “ప్రకృతి” అనే ప్రాథమిక కారణం ద్వారా జరుగుతున్న విషయాలు అని అరిస్టాటిల్ దానిని నిర్వచించాడు.
  13. అల్ ఖజారీ: దీని అర్థం ప్రతీ వస్తువు తనకు తానుగా అకారణంగా చలించుట లేదా విశ్రాంతి తీసుకోవడం లేదు గానీ ప్రతీ కదలికకు లేదా విశ్రాంతి తీసుకోవడానికి కారణం ఉంటుంది. దీనికి కారణం ప్రకృతి.
  14. రబ్బీ: ఈ అభిప్రాయం ప్రకృతిలో సహజంగా జరిగే సంఘటనలను శ్రద్ధగా పరిశోధించడం ద్వారా ఏర్పడింది. ఈ విషయాలు వినేవారిని చాలా ఆశ్చర్య పరుస్తాయి, కానీ ఇది ప్రకృతి నుండి ఉద్భవించిన జ్ఞానం కాదు.
  15. అల్ ఖజారీ: ప్రకృతి చాలా జ్ఞానం కలిగినది అంతేకాక ఒక జీవిని భగవంతునితో సమానంగా ఉంచేలా చేస్తుంది అనే పదజాలంతో తత్వవేత్తలు మనలను చాలా తప్పుదారి పట్టించారు అని నాకు అర్ధం అవుతుంది. తెలివితేటలు కలిగిన వారిగా వారి కోణములో మనం కూడా ఇలాంటికి ఎన్నో చెప్పవచ్చు.
  16. ది రబ్బీ: ఖచ్చితంగా; కానీ మూలకాలు, చంద్రుడు, సూర్యుడు మరియు నక్షత్రాలు మొదలైనవి వేడెక్కడం, శీతలీకరణం చెందడం, తేమ, ఎండిపోవడం మొదలైన శక్తులను కలిగి ఉంటాయి, కానీ అది దాని సహజ ధర్మము గానే పరిగణించబడుతుంది తప్ప వాటికి జ్ఞానం ఉందని కాదు. ఏది ఏమైనప్పటికీ, ఉత్పత్తి చేయడం, ఏర్పరచడం, కొలవడం వంటివి సర్వజ్ఞులు మరియు సర్వ శక్తిమంతులకు మాత్రమే ఆపాదించబడతాయి. వేడి మరియు శీతలీకరణం ద్వారా పదార్థాన్ని ఏర్పాటు చేసే శక్తిని 'ప్రకృతి' అని పిలవడంలో హాని లేదు కాని ఆ జ్ఞానాన్ని 'ప్రకృతి'కి ఆపాదించడాన్ని తిరస్కరించాలి. కాబట్టి ఒక పిండాన్ని సృష్టించగలిగే విభాగం మానవులకు లేదు, ఎందుకంటే వారు సర్వ జ్ఞాని అయిన సృష్టికర్త నుండి మాత్రమే ఒక మానవ రూపాన్ని స్వీకరించగలిగే పరిస్థితిలో ఉన్నారు. దీనినిబట్టి మనకు అర్దమవుతున్న విశయం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో, సృష్టికర్త నుండి కొన్ని విషయాలను స్వీకరించే పరిస్థితి మనకు కనబడుతున్నప్పుడు, ఉన్నతమైన దైవిక జాడలు ఈ భౌతిక ప్రపంచంలో కనిపించడం అసంభవము కాదని అర్థమవుతుంది. ఇక్కడ మనం విశ్వాసం మరియు అపనమ్మకం యొక్క మూలాలను గ్రహించవచ్చు .
  17. అల్ ఖజారీ: ఇది ఎలా సాధ్యం?
  18. రబ్బీ: ఈ దైవిక ప్రభావాన్ని పొందేందుకు మనిషికి సరిపోయే పరిస్థితులు అతనిలో ఉండవు. వాటి పరిమాణం లేదా నాణ్యతను అంచనా వేయడం అతనికి అసాధ్యం అలాగే వాటి సారాంశం తెలిసినప్పటికీ, వాటి సమయం, స్థలం మరియు అనుబంధం లేదా అనుకూలత అతను గ్రహించలేడు. దీని కోసం, ప్రేరేపిత మరియు వివరణాత్మక సూచన అవసరం. ఈ విధంగా ప్రేరేపించబడి, స్వచ్ఛమైన మనస్సుతో ప్రతి విషయంలో బోధనను పాటించేవాడు విశ్వాసి. ఎవరైతే ఊహాగానాలు ద్వారా ఈ ప్రేరణను స్వీకరించడానికి పరిస్థితులను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తారో, లేదా జ్యోతిష్కుల వ్రాతల్లో కనిపించే విధంగా, అతీంద్రియ జీవులను లేదా అతీంద్రియ శక్తులు కలిగిన వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నించే వ్యక్తి అవిశ్వాసి. అతను ఊహాగానాల పేరుతో నైవేద్యాలు తీసుకురావచ్చు మరియు ధూపం వేయవచ్చు, వాస్తవానికి అతను ఏమి చేయాలో, ఎంత చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏ మార్గంలో చేయాలో, ఏ ప్రదేశంలో చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, ఏది చేయాలో కూడా తెలియదు. ఆ పద్ధతి మరియు అనేక ఇతర వివరాలు లెక్క చాలా దూరానికి దారి తీస్తుంది. అతను ఎటువంటి వాడు అంటే ఎటువంటి వైద్యశాస్త్ర జ్ఞానం లేకుండా, తన ఔషధాల ద్వారా ఎంతోమందికి ఎన్నో జబ్బులను తగ్గించి ప్రసిద్ధి చెందిన వైద్యుడి శస్త్రచికిత్సలో ప్రవేశించి, శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించే అజ్ఞాని లాంటివాడు. వైద్యుడు ఇంట్లో లేని సమయములో ప్రజలు మందుల కోసం వస్తుంటారు. ఈ అజ్ఞాని అయిన మూర్ఖుడు ఎదో ఒక ఔషధాన్ని ఇచ్చి వారిని పంలపేస్తాడు, ఆ మూర్ఖునుకి ఆ ఔషధాల విషయాల గురించి గాని, లేదా ఎంత మోతదు ఇవ్వాలి అని గాని ఏమీ తెలియదు. అందువలన జబ్బులను నయం చేయగల ఔషధాలతోనే అతను ఎంతోమంది ప్రాణం తీస్తాడు. అనుకోకుండా ఎవరికైన అతను ఇచ్చిన మందుతో ఎవరికైనా నయం అయితే, ప్రజలు అతనిని ఆశ్రయించడం మొదలుపెడతారు మరియు అతను వారికి సహాయం చేశాడని చెబుతారు. అతడు తమను మోసం చేశాడనే విషయం తెలుసుకునే వరకూ కూడా వారు ఇతర సలహాలను కూడా అతని దగ్గర తీసుకుంటారు. అసలు జబ్బు నివారణ అయ్యింది, ఔషధాలను తయారు చేసి, వాటిని నిర్వహించాల్సిన సరైన పద్ధతిని వివరించిన నేర్చిన వైద్యుడి నైపుణ్యం ద్వారా జరిగింది, అతను రోగులకు ఆహారం మరియు పానీయం, వ్యాయామం, విశ్రాంతి, ఏ గాలి ఉత్తమము ఏది విశ్రాంతి తీసుకునే ప్రదేశం మొదలైనవాటిని కూడా బోధించిన ఆ ప్రక్యాత వైధ్యునివలన అని గమనించకుండానే ఆ మూర్ఖునిని అంటిపెట్టుకుని ఉంటారు. ఇదే విధంగా, అనేక విశయాలలో అజ్ఞానులచే మోసగించబడిన రోగుల మాదిరిగానే, కొన్ని మినహాయింపులతో మోషే కాలం ముందు కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు జ్యోతిష్య మరియు భౌతిక నియమాల ద్వారా మోసపోయారు, ఒక విస్వాసం నుండి మరొక విస్వాసం, ఒక దేవుని నుండి మరొక దేవుడి లేదా బహుళత్వాన్ని స్వీకరించారు. వారు తమ మార్గదర్శిని మరియు యజమానిని మరచిపోయారు మరియు వారి తప్పుడు దేవుళ్ళను సహాయక కారణాలుగా భావించారు, అయితే వాస్తవానికి వాటి నిర్మాణం మరియు అమరిక ప్రకారం అవి వారికి హాని కలిగించే కారణాలు. ఏ వ్యక్తికి దైవిక నడిపింపు వుంటుందో అది అతనికి లాభదాయకమైనది దైవిక నడిపింపు లేకపోవడం అతనికి  హానికరం.

పై వచనాన్ని అర్థం చేసుకోవడానికి పదును పెట్టడానికి ప్రశ్నలు:

  1. విరుద్ధమైన నమ్మకాలు: అల్ ఖజారీ మరియు గ్రీకు తత్వవేత్తలతో పోలిస్తే సృష్టి గురించిన జ్ఞానం యొక్క మూలాన్ని రబ్బీ ఎలా చూస్తాడు? (పేరా 63)
  2. బలాలు మరియు బలహీనతలు: రబ్బీ ప్రకారం, సృష్టిని అర్థం చేసుకోవడంలో కారణం మరియు సంప్రదాయం యొక్క బలాలు మరియు బలహీనతలు ఏమిటి? (పేరా 64-67)
  3. సృష్టి వెనుక ఉన్న శక్తి: సృష్టి యొక్క అద్భుతాలకు అలాగే చీమ వంటి చిన్న విషయాలకు కూడా చివరిగా ఎవరు బాధ్యత వహిస్తారని రబ్బీ విశ్వసిస్తాడు? (పేరా 68-69)
  4. ప్రకృతి వర్సెస్ దేవుడు: అల్ ఖజారీ అందించిన "ప్రకృతి" భావనపై రబ్బీ యొక్క విమర్శ ఏమిటి? (పేరా 70-77)
  5. విశ్వాసం కోసం షరతులు: రబ్బీ ప్రకారం, విశ్వాసాన్ని సాధించడానికి అవసరమైన పరిస్థితులు ఏమిటి మరియు నివారించాల్సిన కొన్ని ఆపదలు ఏమిటి? (పేరా 77-79) బోనస్:
  6. సారూప్యత: వైద్యుని శస్త్రచికిత్సలో అజ్ఞాని యొక్క సారూప్యతను వివరించండి మరియు ఇది విశ్వాసం గురించి రబ్బీ యొక్క పాయింట్‌తో ఎలా సంబంధం కలిగి ఉందో వివరించండి. (పేరా 79)
  7. చారిత్రక సందర్భం: మతం మరియు తత్వశాస్త్రం మధ్య చారిత్రక ఉద్రిక్తతను ఈ భాగం ఎలా ప్రతిబింబిస్తుంది?
  8. రబ్బీ యొక్క ఉద్దేశ్యం: అల్ ఖజారీతో ఈ సంభాషణలో రబ్బీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

           రెండు బోనస్ ప్రశ్నలు

  1. హేతువు మరియు విశ్వాసం యొక్క పాత్ర: దైవిక మరియు సహజ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో హేతువు మరియు విశ్వాసం యొక్క పాత్రలను ఈ బాగం ఎంతవరకు పునరుద్దరిస్తుంది? రబ్బీ యొక్క దృక్పథం జ్ఞానం మరియు విశ్వాసానికి తాత్విక విధానాలను ఎలా సవాలు చేస్తుంది లేదా పూర్తి చేస్తుంది?
  2. సార్వత్రిక వాదం(యూనివర్సలిజం) వర్సెస్ ప్రత్యేకవాదం(పర్టిక్యులారిజం): ఆదాము, నోవాహ్ మరియు మోషే యొక్క ప్రవవచన సంప్రదాయం విశ్వవ్యాప్త దృక్పథాన్ని సూచిస్తుందా లేదా తెలియపరుస్తుందా? విభిన్న విశ్వాస వ్యవస్థలు మరియు సత్యాన్ని అనుసరించడం మధ్య సంబంధాన్ని ఈ భాగం ఎలా ప్రస్తావిస్తుంది?

అండర్‌స్టాండింగ్‌ను అన్‌లాక్ చేయడం టెక్స్ట్‌లను మాస్టరింగ్ చేయడానికి దశల వారీ మార్గదర్శిని

1. వినండి మరియు నిమగ్నం చేయండి: మొదటి దశ మీ ప్రారంభ రీడ్-త్రూ సమయంలో వచనాన్ని చురుకుగా వినడం. అందులో చర్చించబడిన ప్రధాన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

2. వచనాన్ని గ్రహించండి: మీ ప్రారంభ పఠనం తర్వాత, రచయిత యొక్క ప్రధాన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. టెక్స్ట్ యొక్క స్ఫూర్తిని మరియు దాని అంతర్లీన ప్రయోజనాన్ని సంగ్రహించడానికి ప్రయత్నించండి.

3. ఊహ మరియు అనుసంధానం: మీకు తెలిసిన సుపరిచితమైన దృశ్యాలు లేదా దృగ్విషయాలకు సంబంధించి వచనంపై మీ అవగాహనను ఉపయోగించండి. టెక్స్ట్‌లో చర్చించిన అంశాలు నిజ జీవిత పరిస్థితులతో ఎలా సరిపోతాయి?

4. టెక్స్ట్‌ని లోతుగా పరిశోధించండి: మీరు టెక్స్ట్‌లోని ముఖ్యమైన భాగాలను గ్రహించిన తర్వాత, దాన్ని మళ్లీ సందర్శించండి. విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే సంఖ్యా డేటా, ఉదాహరణలు మరియు విశ్లేషణలు వంటి సూక్ష్మమైన వివరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

5. ఉద్దేశ్యంతో మళ్లీ చదవండి: వచనాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత, దాన్ని మళ్లీ చదవండి. ఈసారి, కేవలం వివరాలపై దృష్టి పెట్టకుండా టెక్స్ట్ ఏ పాయింట్‌లో వ్రాయబడిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. టెక్స్ట్ యొక్క ప్రధాన ఆలోచనలు మరియు కేంద్ర ప్రయోజనంపై దృష్టి పెట్టండి. అంకితభావం మరియు పట్టుదలతో, మీరు ఏదైనా టెక్స్ట్ యొక్క రహస్యాలను అన్‌లాక్ చేయవచ్చు మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మీ అవగాహనను మెరుగుపరిచే అమూల్యమైన అంతర్దృష్టులను పొందవచ్చు. మీ పఠన ప్రయత్నాలలో విజయాన్ని సాధించడానికి చురుకైన నిశ్చితార్థం కీలకం. శ్రద్ధగా వినడం, లోతుగా అర్థం చేసుకోవడం మరియు మీ అనుభవాలకు వచనాన్ని కనెక్ట్ చేయడం చాలా అవసరం. చక్కని వివరాలను లోతుగా పరిశోధించడానికి సమయాన్ని వెచ్చించండి మరియు ప్రశ్నలు అడగడానికి లేదా అవసరమైనప్పుడు సహాయం కోరడానికి బయపడకండి. జ్ఞానం యొక్క శక్తిని స్వీకరించండి మరియు పరివర్తనాత్మక అభ్యాస సాహసాన్ని ప్రారంభించండి!

కంటెంట్‌ని ఆస్వాదిస్తున్నారా? మీరు మీ స్వంతంగా చదువుతున్నారా?

"రబ్బీ: వక్త యొక్క ఆలోచనను వినేవారి ఆత్మలోకి ప్రసారం చేయడమే స్పీచ్ ఫ్యాకల్టీ. అయితే, అలాంటి ఉద్దేశ్యం మౌఖిక సంభాషణ ద్వారా మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది. ఇది రాయడం కంటే ఉత్తమం. సామెత : 'పండితుల నోటి నుండి, పుస్తకాల నోటి నుండి కాదు.'" (కుజారి)

మా "హవ్రూతా" కార్యక్రమంలో చేరడాన్ని పరిగణించండి.
అధ్యయన భాగస్వామితో ఈ వచనాన్ని నేర్చుకోండి!

చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Consider joining our "Chavruta" program. Learn these text with a study partner!

**PLEASE NOTE**

we are approaching the end of the current study cycle. If you are intersted in the program, please fill out the registration form, and we will update when a new study cycle opens.


In the meantime, you are welcome to listen to recordings of the lessons given in the 1st cycle

to access CLICK HERE

Brit Olam team

CLICK HERE TO JOIN

ITALY

Sparks Of Insight Italian version

VIEW HERE

FRANCE

Sparks Of Insight
French version

VIEW HERE

INDIA

Sparks Of Insight
Telugu version

VIEW HERE

Search