మెట్జోరా/మొత్తబడినవాడు పవిత్ర పరచబడతాడు. పర్షత్ మెట్జోరా యొక్క సారాంశం అతని శుద్ధి రోజున మెట్జోరా యొక్క నియమాలలో ఉంది. తోరా మెట్జోరాను/ మొత్తబడినవానిని తన చర్యలు మరియు నైతిక ప్రవర్తన కారణంగా సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తిగా నిర్వచిస్తుంది. వాక్యం చెబుతున్నా ప్రకారం, “అతను ఒంటరిగా నివసించును; పాలెము వెలుపల..” ఈ ఒంటరితనం వ్యక్తి యొక్క ప్రారంభ స్థితికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది, అక్కడ వారు సమాజంలో భాగంగా ఉన్నారు. అయితే, ఈ ఒంటరి స్థితి శాశ్వతం కాదు. స్వీయ పరిశీలన మరియు శుద్ధీకరణ ద్వారా విమోచన మరియు సమాజంలో పునరేకీకరణకు తోరా ఒక మార్గాన్ని అందిస్తుంది.
ఒక వ్యక్తి శిబిరం వెలుపల కూర్చున్న తర్వాత, అతను తన ఆత్మను పరిశీలిస్తాడు. తన ఆత్మను పరీక్షించుకునేవాడు తిరిగి సమాజంలోకి ప్రవేశించడానికి అర్హుడు. తిరిగి సమాజంలోకి ప్రవేశించాలంటే రెండు పక్షులను తీసుకురావాలి. కోహెన్ ఒక పక్షిని వధిస్తాడు. రెండవ పక్షి, సజీవ పక్షిని వధించిన పక్షి రక్తంలో ముంచి బహిరంగ మైదానంలోకి పంపివేస్తాడు.
ఇంతకీ ఈ ఆచారం ఏంటి? యోమ్ కిప్పూర్/పాప ప్రాయశ్చిత్త దినంరోజున ఆలయంలో ఏమి జరుగుతుందో ఇది మనకు గుర్తు చేస్తుంది. ఒక మేకను బలిపీఠం మీదకు తీసుకువస్తారు. దీనికి భిన్నంగా మరో మేకను బహిరంగ మైదానంలోకి పంపిస్తారు. దానిని బహిరంగ మైదానంలోకి పంపినప్పుడు, అది కుప్పకూలి బండల మధ్య చనిపోతుంది. మెట్జోరా/కుష్టురోగి శుద్ధికావడానికి ఇలాంటి ఆచామే ఉంది. వధించిన పక్షి రక్తంలో ముంచిన సజీవ పక్షిని, రక్తంతో నిండిన ఈ పక్షిని ఇతర జంతువులు చీల్చివేస్తాయి.
ఇది మనకు ఏమి నేర్పుతుంది? యోమ్ కిప్పూర్ లో,ఈ మేకను కఠినత్వాన్ని సూచించే స’యిర్ పదం నుండి తీసుకోబడిందిగా పరిగణిoచి, మేము ఈ కఠినత్వానికి విలువకడతాము. మరియు ఆ కఠినమైన శక్తులు అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే స్థాయిగలవిగా విలువ కడతాము. దీనికి విరుద్ధంగా, కఠినత్వoలో కొంత భాగాన్ని బయట, బహిరంగ మైదానంలోకి, అజాజెల్ గా చనిపోవడానికి పంపాలి.
ఒక వ్యక్తి యొక్క వాక్’శక్తికి సంబంధించి మనం అదే సూత్రాన్ని కనుగొంటాము: దానిలో కొంత భాగం పవిత్రమైనది, మరియు దానిలో కొంత భాగం అపవిత్రమైనది. పవిత్రమైనది అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అర్హమైనది, మరియు అపవిత్రమైనదాన్ని బహిరంగ మైదానంలోకి "విసిరివేయాల్సిన" అవసరం వుంది.
మానవ సమాజానికి తిరిగి రావడానికి ఒక వ్యక్తి యొక్క సిద్దపాటులో భాగంగా, అతను తన ప్రవర్తనను—తన వ్యక్తిగతమైన ఇంటిని—అతిపరిశుద్ధ స్థలంగా, ఒక ప్రత్యక్షగుడారంగా భావించాలి. ఈ ప్రత్యక్షగుడారంలో, అతను తగిన విధంగా ప్రవర్తించాలి మరియు కొన్ని వ్యక్తిగత "యోమ్ కిప్పర్" లను అనుభవంలోకి తెచ్చుకోవాలి.
చివరి గమనిక: హీబ్రూ భాషలో పస్కా సెలవుదినం రెండు పదాలతో కూడి ఉ౦టు౦ది: "పెహ్-సహ్ఖ్." నోరు మాట్లాడుతుంది, తింటుంది, మనిషికి ప్రాణం పోస్తుంది. పస్కా సెలవుదినం నాడు, నోరు ప్రతికూలంగా, అన్ని రకాల దురాశలకు లోబడి ప్రవర్తిస్తుందా, లేదా అది స్వేచ్ఛగా ఉండి ప్రయోజనకరమైన విషయాలు మాట్లాడుతుందా అనేది ప్రశ్న. ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ స్వేచ్ఛ మరియు వెలుగుతో నిండిన సెలవుదినం కావాలని కోరుకుంటున్నాను.