Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

చెరలోని కన్నీళ్లు, నమ్మకానికి మూలం : దేవుడు మరియు ఇశ్రాయేల్ మధ్య విడదీయరాని బంధం

స్తుష్టికర్తకు  మరియు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవున్న చారిత్రక నిబంధన సంక్లిష్టమైనది. పరషత్ బెహుకోతైలో, వీరిరువురికీ మధ్య ఒక ఒప్పందం వుంది.

 “మీరు నా విధులను అనుసరించిన యెడల” (లేవీయకాండము 26:3) – పరిస్థితులు బాగుంటాయి; “నా విధులను అనుసరించని యెడల,” – పరిస్థితులు పెద్దగా బాగుండవు లేదా చెడ్డగా వుంటాయి.  

పరషలో  ఇశ్రాయేలు  దేశంలో శాంతి మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య శాంతి వర్ణనలు ఉన్నాయి, ఒడంబడికను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాలు, బహిష్కరణ మరియు జాతీయ విపత్తుల వివరణలు ఉన్నాయి. కానీ చివరికి, చెరలోని  భయాందోళనలు మరియు కష్టాలను భరించిన తర్వాత కూడా, ఇశ్రాయేలియులు  చివరికి మన దేశానికి తిరిగి వస్తుందని ఒక వాగ్దానం ఉంది.

ఇది ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది: విముక్తి నిజంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?

తాల్ముడ్‌లో, రబ్బన్ యోహానన్ బెన్ జక్కై యొక్క అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఇద్దరు రబ్బీ ఎలియేజర్ మరియు రబ్బీ యెహోషువాల మధ్య  ఉత్సాహపూరితమైన చర్చ మనకు తారసపడుతుంది.

రబ్బీ ఎలియేజర్ ఇశ్రాయేల్ యొక్క విమోచనం వారు తోరా యొక్క మార్గానికి తిరిగి వచ్చిన తర్వాత అనిశ్చితమని నొక్కిచెప్పారు, అయితే రబ్బీ యెహోషువా త్షువాతో సంబంధం లేకుండా విముక్తి అనివార్యమని పేర్కొన్నాడు. సారాంశంలో, మానవ ఎంపిక కారణంగా సృష్టికర్త తన చారిత్రక ప్రణాళికను వాయిదా వేయడు అని రబ్బీ యెహోషువా సూచించారు. ప్రజలు చెడు చేయాలని ఎంచుకున్నప్పటికీ, ఇశ్రాయేలియులను తమ  భూమికి పునరుద్ధరిస్తానన్న తన వాగ్దానంలో విశ్వాధిపతి స్థిరంగా ఉంటాడు.

అటువంటి ముఖ్యమైన విషయంపై, తోరా మనకు బోధించేదేంటి: వారు తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, ద్రోహముతో నన్ను మోసపుచ్చినందుకు  నాయదల చులకనగా నడుచుకొనినదానికి నేనుకూడా వారియెడల చులకనగా నడుచుకొందును నేను వారి శత్రువుల దేశమునకు వారిని రప్పించెదను. ఒకవేళ అప్పుడు, వారి ఖతినమైన హృదయము లోబడునేమో అప్పుడు వారు తాము చేసిన పాపములకు ప్రతిఫలము పొందుకొందురు.  నేను యాకోవ్ తో చేసిన నిబంధనను మరియు ఇస్సాకు తో చేసిన నా నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొందును. అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును మరియు నేను ఆ దేశమును జ్ఞాపకము చేసుకొందును (లెవీ 26:40-42) 

ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వారి సున్నతి పొందని హృదయాలు వినయపూర్వకంగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. వారు తమ దోషాలను సరిదిద్దుకుంటారు, అంటే వారు పశ్చాత్తాపపడతారు మరియు సృష్టికర్త వారిని తిరిగి వాగ్దాన భూమికి తీసుకువస్తాడు. ఇది రబ్బీ ఎలియేజర్ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది.

కానీ మనం శ్రద్ధ వహిస్తే, అనువదించడం కష్టంగా ఉండే చిన్న పదాన్ని తోరా ఉపయోగిస్తుంది - " או" (లేదా) అనే పదం.

రాషి గారు  " או"ను రెండు విధాలుగావ్యాఖ్యానించారు : " או " అంటే "ఉంటే" – వారి సున్నతి పొందని హృదయాలు వినయపూర్వకంగా ఉంటే, అప్పుడు దేవుడు వాగ్ధాన భూమిని గుర్తుంచుకుంటాడు మరియు ఇశ్రాయేలియులను తిరిగి దానికి తీసుకువస్తాడు, ఇది రబ్బీ ఎలియేజర్ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. కానీ తన రెండవ వివరణలో, రాషి గారు  " או" అంటే "బహుశా" అని చెప్పారు  - బహుశా వారి సున్నతి లేని హృదయాలు వినయపూర్వకంగా ఉంటాయి. వాళ్ళు తిరిగి వాకినా రాకపోయినా. ఏది ఏమైనప్పటికీ, "యాకోవ్‌తో నా ఒడంబడికను నేను గుర్తుంచుకుంటాను" అనేది రబ్బీ యెహోషువా అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. 

తోరా ఒక సమస్యాత్మకమైన పదాన్ని ఉపయోగిస్తుందని గమనించడం ఆసక్తికరంగా ఉంది. రబ్బీ ఎలియేజర్ మరియు రబ్బీ యెహోషువా మధ్య జరిగిన చర్చను వాక్యం సూచించిన  విధంగా సృష్టికర్త తన తోరాను రూపొందించినట్లు కనిపిస్తుంది. విమోచన త్షువా నుండి విడదీయరానిది అని రబ్బీ ఎలియేజర్ యొక్క నైతిక వైఖరికి బలవంతపు వాదన ఉంది. అయితే మనుష్యులు ఎంచుకున్న దానిద్వారా ద్వారా చారిత్రక పురోగతికి ఆటంకం కలగదని రబ్బీ యెహోషువా దృక్పథానికి ఏకకాలంలో కాదనలేని కోణం  కూడా ఉంది. అందువలన, తోరా రెండు దృక్కోణాలను అందిస్తుంది మరియు వ్యాఖ్యానానికి అవకాశాన్ని ఇస్తుంది.

More Weekly Portions

తోరా ద్వారా వ్యక్తిగత మరియు సమాజ శ్రేయస్సును ఐక్యపరచుట

పరషత్ నాస్సో వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ, యాజక ఆశీర్వాదం ద్వారా సమాజ ఐక్యతను నొక్కి చెబుతుంది. ఈ ఆశీర్వాదం, మూడు స్థాయిలలో నిర్మించబడింది, భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాల మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తుంది: "హషేమ్ నిన్ను దీవించి నిన్ను కాపాడును గాక" అనేది సంపద కొరకు, తోరా ద్వారా ఆధ్యాత్మిక ప్రకాశం కొరకు "హాషెమ్ తన ముఖకాంతి నీమీద ప్రకాశింపజేయును గాక" అను దీవెన  మరియు నెఫెష్, రువా మరియు నేషామా యొక్క లోతైన బంధం కొరకు "హషేమ్ తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక" అను దీవెన ఇవ్వబడింది. వ్యక్తిగత మరియు మతపరమైన శ్రేయస్సును సామరస్యపూర్వకంగా ఏకీకృతం చేయడానికి తోరా మార్గదర్శకత్వం అందిస్తుంది.

లెక్కకు మించి: వ్యక్తిగత సామర్ధ్యం మరియు సామూహిక ఐక్యత

పరషత్ బమిద్బార్ సైన్యానికి అర్హులైన వారిపై దృష్టి సారిస్తూ ఇశ్రాయేలియులను లెక్కించాలనే ఆజ్ఞను చర్చిస్తుంది. ఈ గణన సామూహిక మరియు వ్యక్తిగత గుర్తింపుల మధ్య ఉద్రిక్తతను నొక్కి చెబుతుంది. తోరా "పేర్ల సంఖ్య" అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తుంది, ఇది సామూహిక మరియు వ్యక్తి రెండింటి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకత ద్వారా సామూహిక అర్థాన్ని పొందడంతో పాటు, నిజమైన ఐక్యత ఈ అంశాలను మిళితం చేస్తుందని తోరా బోధిస్తుంది. ఈ భావన లేఖనాల వివరణలో "సాధారణీకరణ మరియు వివరణ" సూత్రంలో ప్రతిబింబిస్తుంది, సంఖ్యలలో దాగిన  అర్థాలతో, గమాట్రియా ద్వారా అన్వేషించబడింది.

చెరలోని కన్నీళ్లు, నమ్మకానికి మూలం : దేవుడు మరియు ఇశ్రాయేల్ మధ్య విడదీయరాని బంధం

పరషత్ బెహుకోతై  హాషెమ్ మరియు ఇశ్రాయేల్ మధ్య ఒడంబడికను చర్చిస్తూ, త్సువా మరియు విముక్తి మధ్య సంబంధాన్ని నొక్కిచెప్పారు. రబ్బీ ఎలియేజర్ మరియు రబ్బీ యెహోషువా మధ్య జరిగిన తాల్ముడిక్ చర్చ, విమోచనం త్షువాపై ఆధారపడి ఉందో లేదో పరిశీలిస్తుంది. రాషి గారి  వ్యాఖ్యానం రెండు అభిప్రాయాలకు మద్దతుగా ఒక అస్పష్టమైన పదాన్ని వివరిస్తుంది. ఈ ద్వంద్వ దృక్పథం తోరా యొక్క బహిరంగ వివరణను హైలైట్ చేస్తుంది, ఇది విడుదల అనేది  మానవ త్షువా లేదా దైవ వాగ్దానంపై ఆధారపడి ఉంటుందని నిరూపిస్తుంది, ఇది చారిత్రక పురోగతిపై ఇజ్రాయెల్ యొక్క అవగాహనలో పరిస్థితుల యొక్క సంక్లిష్ట పరస్పర చర్యను ప్రతిబింబిస్తుంది

Search