మనం రోష్ హాషానాకు చేరువౌతున్నాం. హెబ్రీ కాలండర్ దీనితోనే ప్రారంభమౌతుంది. ఆశ్చర్యం యెంటంటే సంవత్సరం నడి మధ్యలో ఇది ప్రారంభమౌతుంది. తోరా ప్రకారం, తిష్రే అను ఏడవ నెలలో రోష్ హాషాన్నా వస్తుంది. అది ఏడవ నెల అయితే రోష్ హాషాన్న నిజంగానే సంవత్సరం మధ్యలో వస్తుంది కదా!? కాబట్టి దీనినుండి మనం అర్ధం చేసుకోవలసనిది యేమిటంటే, సంవత్సరం అనేది రెండు సార్లు ప్రారంభం కావచ్చు. అది వసంత ఋతువులో మొదటి నెలయైన నీసాను ప్రారంభంలోను, మరియు శరధ్ ఋతువులో తిష్రే అను ఏడవ నెల ప్రారంభంలోను రెండు సార్లు సంవత్సర ప్రరాంభమ్ జరుగుతుంది. ఈ రెండిటిలో ప్రతి ఆరంభము జాలానికి సంబంధించిన భిన్నమైన కాసెప్ట్స్ ను సూచిస్తుంది.
శరత్ ఋతువునే చూద్దాం. వాడిపోవుట క్షయమగుట అనేది ఈ సమయంలో జరుగుతుంది. ప్రపంచాన్ని ఒక నిరాశావాద దృక్పధంలో చూడడానికి ఈ సమయం కారణమౌతుంది. ప్రపంచానికి వయసు మళ్లినట్లుగానూ, కృషించిపోతున్నట్లుగాను అనిపిస్తుంది. మరోవైపు, వసంత ఋతువు ఆశలు చిగురింపచేసే సమయం. మరోసారి ప్రపంచం జీవం పొందుతున్నట్లు కనిపిస్తుంది. ప్రకృతి తనకు తాను మరోసారి నిర్మింపబడి జీవము నూతనముగా వికశిస్తుంది. దీనికి సమాంతరముగా ప్రపంచంలో రెండు విధానాలు వున్నట్లు మనం గమనించగలం. ఒకటి నిరంతర పునరుత్పత్తి కాగా, మరొకటి స్థిరంగా క్షయం కావడం.
హెబ్రీ సంవత్సరము యేమి చేస్తుంది? క్షయమగు కాలానికి మరియు పునర్ ఉత్పత్తి జరుగు కాలానికి అనగా ఆ రెండిటికీ కూడా అర్ధాన్ని అందిస్తుంది. వాస్తవానికి సంవత్సరం అనేది ఎప్పటికీ అంతము కాదు. అది వసంత రుతువులో నీసాను మాసంలో ప్రారంభమౌతుంది. అలాగే ఆరు నెలలు గడిచిన తరువాత రోష్ హషాన నాడు సంవత్సరం పునర్ ప్రారంభం జరుగుతుంది.
హెబ్రీ కేలండర్ నందు రెండు ప్రారాంభాలు ఉండడంవల్ల మనం ఎప్పుడూ సంవత్సర ప్రారంభంలో ఉంటాము తప్ప సంవత్సర అంతంలో వుండము. ఈ ప్రపంచంలో క్ష్యముజరిగే కాలము కూడా పునరుత్పత్తి జరిగించుటలో భాగము అన్నది మన విశ్వాశము.
రోష్ హషాన దినమున మనము మరియు యావత్ ప్రపంచము నిలకడగా నూతనపరచబడతాము. చరిత్రపట్ల మనము ఆశా వాధ దృక్పధాము కలిగివుండాలనే విషయాన్ని గ్రహించే విధంగా మనం నడిపింపబడతాము. ఎందుకంటే, రాలుట క్షీణించుట, క్షయమగుట అనుప్రక్రియ, నిర్మింపబడి నూతన పరచబడుట అనే మరింత విస్తృతమైన ప్రక్రియలో ఒక భాగము.
ఇశ్రాయేల్ మరియు యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన మంకీ సంవత్శరము అనుగ్రహింపబడు గాక!.