పరషత్ దెవారిమ్
దెవారిమ్ (మాటలు) అను భాగముతో ప్రారంభమయ్యే, ద్వితీయోపదేశకాండ గ్రంధము, ఎరెట్జ్ ఇశ్రాయేల్ (ఇశ్రాయేలు భూమి) కి సంబందించిన గ్రంధము.
ఇశ్రాయేలు భూమి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉద్దేశింపబడినది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ భూమిలో యేమి చేస్తారో అది సర్వ మానవాళి అంతా అనుసరించుటకు ఒక మాదిరిగా ఉండడం కొరకు ఉద్దేశింపబడింది. మొదటి నాలుగు గ్రంధాలలో, తోరా అంతటా సూచనలు, మిట్స్వోత్ మరియు చట్టాల జాబితాను తెలియజేస్తుంది. అయితే ఇదంతా దేనిని లక్ష్యంగా చేసుకుందో మనకు అర్థమైందా?
దీనికి భిన్నంగా ద్వితీయోపదేశకాండ గ్రంధములో, ఉన్నట్టు ఉండి మిట్స్వోత్ లన్నీ ,హెబ్రీ ప్రజల కొరకు వారి దేశములో, రాజనీతి/పరిపాలనకు సంబందించిన రాజ్యాంగంగా కూర్చబడినట్లు చూస్తాం. దీనినిబట్టి, తోరాకు రాజనీతి/పాలనాపరమైన విధానాల ఉద్దేశం ఉందని , ఇది యూదియ మతమునకు మాత్రమే ప్రత్యేకమైనదని వెల్లడి అవుతుంది.
మతాలెవీ పరిపాలనా వ్యవహారాలతో నేరుగా సంబంధం కలిగి లేవు. మతము, రాజనీతి రెండు వేర్వేరు విషయాలుగాను వాటిని దగ్గరచేర్చడం విభిన్న జాతులను కలపడంగాను పరిగణించబడుతుంది. మతం ఒక వ్యక్తి యోక్క విషయాలతో మాత్రమే వ్యవహరిస్తుందని, రాజ్యం /పాలక ప్రభుత్వం సమాజానికి సంబందించిన విషయాలతో వ్యవహరిస్తుందని ప్రజలు అనుకుంటారు. క్రైస్తవ్యం ప్రపంచానికి నూరిపోసిన విధంగా "సీజర్‌కి చెందినది సీజర్‌కు మరియు దేవునికి చెందినది దేవునికి ఇవ్వాలి." అనే సిద్దాంతాన్ని అంగీకరించి దానినే విశ్వసించే విధానానికి ప్రపంచం ఇప్పటికే అలవాటు చేయబడింది. అయితే యూదత్వం ఈ ధోరణిని సమస్యాత్మకంగా పరిగణిస్తుంది.
ఇది సరియైన విధానము కాదని ద్వితీయోపదేశకాండములో, తోరా వెల్లడి చేస్తుంది. ఎదైతే చక్రవర్తికి చెందినదో అది దేవునిదే! పరిశుద్దుడైన దేవుని పట్ల భయము కలిగి వుండుటయే సమాజము యొక్క సరియైన క్రమము. దీని ప్రకారం, పైన పేర్కొన్న సిద్దాంతానికి చాలా విరుద్ధంగా బోధించాలి!
మానవాళిలోని విషయాల పురోగతికి ప్రధానమైన సాధనం రాజనీతి అనే భావన నుండి, పాలనా వ్యవహారాలను చక్కబెట్టడానికి కట్టుబడి వుండాలి అను నియమం ఉధ్బవించింది. అందుచేత రాజనీతిలో/ పరిపాలనా వ్యవహారాలలో కూడా పరిశుద్దతను కాపాడాలి అను విషయాన్ని ద్వితీయోపదేశకాండము తెలియజేస్తుంది.
ఇశ్రాయేలు ప్రజలు తమ దేశంలో చేసే విషయాలు ఇతర దేశాలు అనుసరించడానికి ఒక నమూనాగా నిర్దేశింపబడ్డాయని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి దేశము, ఆయా దేశాలకు తగినరీతిలో, ఇశ్రాయేలు ప్రజల విధానాల నుండి సమాజ మార్గదర్శకాల నమూనాను స్వీకరించాలి. ఈ కారణంచేతే ఏడు నోవహీయ ఆజ్ఞలలో ఒకటిగా ధర్మబద్దమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఇవ్వబడింది. దీనర్థం ప్రతి దేశము సముచితమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అది కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా న్యాయమైన మరియు ధర్మబద్ధమైన సామాజిక ప్రవర్తనకు మార్గదర్శకంగా ఉండాలి. ప్రజలందరికి న్యాయమును నిజాయితీని చేకూర్చేదానికి సమాజము కట్టుబడి ఉండాలన్నదే మతపరమైన ప్రాధమిక సూత్రము అని ద్వితీయోపదేశకాండము భోదిస్తుంది.