మోషే నాయకత్వాన్ని కోరహు సవాలు చేసి, అతని తిరుగుబాటులో తనతో చేరమని ఇతరులను ప్రేరేపిస్తాడు. కోరహు ఒక పరిశుద్దుడు, మరియు ఇశ్రాయేలీయుల పెద్దల ప్రకారం, అతను దైవిక ప్రేరణను కూడా కలిగి ఉన్నాడు. అంటే మోషే, అహరోనులకు సవాలు విసరాలని నిర్ణయించుకున్న ఉన్నత స్థాయి వ్యక్తి. అతనితో పాటు దాతాను మరియు అబీరాము అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారి ఆధ్యాత్మిక స్థాయి చాలా తక్కువ. ప్రధానంగా వారు వట్టి వివాదాస్పద వ్యక్తులు కావడం వల్ల జతకలిశారు. మూడవ సమూహం కూడా కోరహు, దాతానూ మరియు అబీరాము లతో చేరుతుంది: "ధూపం సమర్పించేవారు" అని పిలువబడే రూబేను గోత్రానికి చెందిన 250 మంది పురుషులు.
వీళ్ళందరికీ ఏం కావాలి? ఇక్కడ, మనం వివాదం యొక్క వివిధ కోణాలను నేర్చుకుంటాము. "మోషే స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాను" అని కోరాహు లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి నేరుగా చెప్పలేడు, ఎందుకంటే అలా మాట్లాడటం అతని గౌరవానికి భంగం కలిగిస్తుంది. మరోవైపు, దాతాను, అబీరాము వంటి ప్రాముఖ్యత లేని తంత్రగొండి వ్యక్తులు ప్రజలను ప్రభావితం చేయలేరు. 250 మంది పురుషుల మూడవ సమూహం ఆధ్యాత్మిక ఆకాంక్షలు కలిగిన మంచి వ్యక్తులు, ఎందుకంటే వారు అతిపరిశుద్ధ స్థలములో ధూపం సమర్పించాలనుకుంటున్నారు. అయినప్పటికీ, వారు తమ స్థాయికి తగినదాన్ని కోరడానికి చేయడానికి మాత్రమే ధైర్యం చేసారు.
మరి వారు ఏం చేస్తారు? వారు ఈ తిరుగుబాటు శక్తులను ఏకం చేస్తారు! "కోరాహు, దాతాను, అబీరాము, రెండువందల యాభై మంది మనుషులు" – తిరుగుబాటు రేపడానికి సమకూర్చాడు. సాధారణ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రాముఖ్యత లేని తంత్రగొండి వ్యక్తులను ఉపయోగించాల్సిన అవసరం ఒక పవిత్ర వ్యక్తి ఎందుకు వచ్చింది. అయిన తిరుగుబాటు రేపడానికి ఒక చట్టబద్ధమైన కారణం అవసరం. పరిశుద్ధుడైన దేవుడు మోషేను ఎన్నుకున్నాడని సినాయ్ పర్వతం వద్ద స్పష్టంగా బహిర్గతం అయిన తరువాత, ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఆయనను ఎలా వ్యతిరేకిస్తున్నారు?
కొరాహుకు, ఆయనతో జతకట్టిన వారి మధ్య వివాదం మొత్తం, దేవుడు ఇచ్చిన రెండు రాతి పలకలను పగులగొట్టిన తరువాత మరియు రెండవమారు రాతి పలకలు ఇవ్వడానికి మధ్యలో జరిగింది. కాబట్టి వారు ఇలా వాదించారు: "పరిశుద్ధుడు స్తుతిపాత్రుడైన దేవుడు మిమ్మల్ని అనగా మోషేను మరియు అహరోను ను పంపాడు. కానీ మీరిద్దరూ - రాతి పలకలను పగులగొట్టిన మోషే మరియు బంగారు దూడను సృష్టించిన అహరోను – ఈ చర్యల ద్వారా మిమ్మల్ని మీరు 'అనర్హులుగా' చేసుకున్నారు, అందువల్ల ఒక కొత్త నాయకత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది."
పొరపాటుగా అనిపించినదాని ఆధారంగా మన నాయకులపై అనర్హత వేటు వేయడానికి తొందరపడకూడదని కోరాహు తిరుగుబాటు కథ మొత్తం మనకు బోధిస్తుంది. కొన్నిసార్లు, తప్పులుగా కనిపించే విషయాలు కూడా దైవ సంకల్పాన్ని నెరవేరుస్తాయి.