పరషత్ నాస్సో వివిధ వ్యక్తిగత సమస్యలు మరియు కుటుంబ సమస్యలతో నిండి ఉంది, ఉదాహరణకు సోతా (వ్యభిచారి అని అనుమానించబడిన వ్యక్తి), నజీర్ (నాజిరైట్), చనిపోయిన వారిని ముట్టడం వలన అపవిత్రుడైన వ్యక్తి మరియు దొంగ గురించినవి. ప్రతి నిర్దిష్ట సమస్యను ఎలా పరిష్కరించాలో తోరా మనకు మార్గదర్శకత్వం అందిస్తుంది. కట్టుబాటును వీడి చేసిన ప్రతి విధమైన అతిక్రమణకు మనకు ప్రత్యేకమైన పరిష్కారం చూపబడింది.
ఈ సమస్యలపై దృష్టిసారించడం చాలా ముఖ్యమైనది, కానీ వ్యక్తులు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం నిమగ్నమై ఉన్నప్పుడు, వారు పెద్ద సామూహానికి చెందినవారని మర్చిపోవచ్చు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సమస్యను మాత్రమే చూస్తాడు. అందువల్ల, ఈ లోపాన్ని పరిష్కరించడానికి, తోరా మనకు వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి పరిష్కారాలు మరియు సూచనల జాబితాను అందించిన తర్వాత, అది వెంటనే బిర్కత్ కోహనిమ్ (యాజక దీవెన)కి తిరిగి వస్తుంది. యాజక దీవెన ఇశ్రాయేలియులందరికి ఒక సాధారణ ఆశీర్వాదం. యాజకులు ఎల్లప్పుడూ మొత్తం సమాజం యొక్క పూర్తి పరిస్తితిని మరియు పరిధిని చూస్తారు. సమాజమంతటికి సంబందించిన ఈ సమగ్ర ఆశీర్వాదం ద్వారా, "మీరు ఇశ్రాయేలు సంతతి వారిని ఈ విధంగా దీవించవలెను." ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది.
యాజక దీవెన మూడు స్థాయిలుగా విభజించబడింది:
హషెమ్ నిన్ను ఆశీర్వదించి, నిన్ను కాపాడును గాక. హషెమ్ తన సన్నది కాంతి నీమీద ప్రకాశింపజేసి నీకు మేలు చేయును గాక. హషెమ్ తన సన్నిధి కాంతి నీమీద ప్రకాశింపజెసి నీకు సమాధానము కలుగజేయును గాక.
“హషెమ్ …. నిన్ను కాపాడును గాక” అనేది మొదటి దీవెన. ఈ దీవెన సంపదను కలుగజేయు దీవెన. రాషి గారు ఇలా చెప్పారు, "ఆయన నిన్ను దీవించును గాక" – అనగా మీ సంపద వృద్ది చెందుతుంది; "నిన్ను కాపాడును గాక" – అనగా దొంగల నుండి కాపుదల. ఇది సాధారణమైన, ప్రాథమిక భౌతిక ఆశీర్వాదం మరియు ఇది హాషెమ్ యొక్క "సన్నిధి" గురించి ప్రస్తావించలేదు; అది "హషేమ్ మిమ్మను దీవించును గాక” అని మాత్రమే చెబుతోంది.
దీనికి విరుద్ధంగా, ఆధ్యాత్మిక ఆశీర్వాదం, "హాషేమ్ తన ముఖ కాంతి నీకు ప్రకాశింపజేసి నీకు మేలు చేయును గాక" అనేది రెండవ ఆశీర్వాదం, ఇది తోరాను అధ్యయనం చేయడం ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ప్రకాశం వలన కలిగే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో, హాషేమ్ యొక్క ముఖాన్ని గూర్చి ప్రస్తావించబడింది.
ఈ రెండు ఆశీర్వాదాల తర్వాత, ఇశ్రాయేలియులలోని ప్రతి సభ్యునిలోని అంతర్గత సద్గుణం వెల్లడి అయ్యే స్థితికి మనము అధిరోహిస్తాము: "హాషెమ్ నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి, నీకు సమాధానము కలుగజేయును గాక." ఇది ఆత్మ యొక్క మూడు స్థాయిలపై నిర్మించబడిన పరిపూర్ణమైన ఆశీర్వాదం, ఇది అంతర్గత మూలాలలో "నెఫెష్, రువాహ్ మరియు నేషామా"గా సూచించబడింది. నెఫెష్ (శ్వాస) అనేది "హషేమ్ నిన్ను ఆశీర్వదించును గాక" అనేదానికి సంబందించినది. రువాహ్ (స్పిరిట్) అనేది "హాషేమ్ తన ముఖకాంతి నీకు ప్రకాశింపజేయును గాక" అనేదానికి సంబందించినది. మరియు నేషామా (సోల్) "హాషేమ్ తన సన్నిధికాంతి నీకు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక" అనుదానికి సంబందించినది.