Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

ఒక భాగస్వామిగా ఉంటూ మెస్సీయను ప్రపంచంలోకి తీసుకువచ్చే కార్యక్రమంలో పాల్గొనడం:

విగ్రహారాధనను తిరస్కరించిన పస్కా: 

పరషత్ బహలోత్ఖాలో ప్రస్తావించబడిన పస్కా షెనీ (రెండవ పస్కా) అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఐగుప్తు ను౦డి విడుదల జరిగిన రెండవ స౦వత్సర౦లో, ప్రత్యక్ష గుడార౦ అప్పటికే నిర్మి౦చబడిన తర్వాత, ఇశ్రాయేలీయులు పస్కా బలిని ఆచరి౦చమని ఒక నిర్దిష్టమైన ఆజ్ఞను అందుకున్నారు. అంటే ఇగుప్తులో నుండి నిర్గమము  సందర్భంగా నిర్వహించిన పస్కా బలి కాకుండా మరో పస్కా బలిని ఎందుకు  జోడించడం అనే ప్రశ్న తలెత్తుతుంది 

చారిత్రక సందర్భాన్ని పరిశీలిస్తే ఈ విశిష్టమైన ఆజ్ఞ యొక్క ఆవశ్యకత స్పష్టమవుతుంది. బైబిల్‌లో కనిపించే పస్కా,  విగ్రహారాధనతో ప్రజలు విఫలమైన సందర్భాలను తరచుగా గుర్తిస్తుంది. ఉదాహరణకు, పరషత్ బో లో, మొదటి పస్కాలో, " మీ కుటుంబముల చొప్పున మందలోనుండి గొర్రె పిల్లను తీసికొని లేదా కొనుగోలు చేసి పస్కా పశువును వధించుడి" అనే ఆదేశం ఉంది. ఇశ్రాయేల్ పెద్దలు  "ముందుకువచ్చి" అనే పదం  విగ్రహారాధన నుండి వైదొలగడానికి పిలుపు అని  అర్థం చేసుకున్నారు. ఈ వివరణ పరషత్ బహాలోత్ఖాలో రెండవ పస్కా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

మన తోరా భాగము, పర్షత్ బహలోత్ఖా, బంగారు దూడ సంఘటన తరువాతి సందర్భంలోని  ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంది- ఇది విగ్రహారాధన. ఈ అపరాధం నుండి తమను తాము పరిశుద్ద పరచుకోవడం ప్రజలకు అత్యవసరం. అందువల్ల, మన పరషలో పేర్కొన్న పస్కా, శుద్దీకరణ మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. 

పస్కా యొక్క మరుగైయున్న  ప్రణాళిక:

మన పరషలో, మృత దేహాన్ని ముట్టుట వలన అపవిత్రులని ఎంచబడిన అనేకమంది యొక్క గందరగోళ పరిస్థితిని  ఈ  వాక్య సందర్బంలో చూస్తాము (దీనిని "ఆత్మకు అపవిత్రం" అని పిలుస్తారు). మానవ శవాన్ని తాకిన వ్యక్తి పస్కా బలి సమర్పణలో పాల్గొనలేడని మనకు తెలుసు. అందువల్ల, ఈ అపవిత్ర వ్యక్తుల సమూహం మోషే వద్దకు వచ్చి, తమను తాము శుద్ధి చేసుకున్న తర్వాత పస్కాను నిర్వహించడానికి తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తుంది. “మినహాయింపు పొందిన వారికి మినహాయింపు ఉంది!” అని మోషే వారికి జవాబిచ్చి ఉంటాడని మనం అనుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే: మీరు పస్కా బలి  చేయలేకపోయారని ఎందుకు ఆందోళన చెందాలి? మీకు మినహాయింపు ఉంది! రెండవ పస్కా బలి  చేయాలనే అపవిత్ర సమూహం యొక్క కోరికను మోషే అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే పస్కా బలి  ఈజిప్టును మళ్లీ విడిచిపెట్టినట్లుగా పరిగణించబడుతుంది మరియు ఈజిప్టును విడిచిపెట్టడం అంటే ఇశ్రాయేలియులంతా ఒక జాతిగా నెరవేర్చాల్సిన విధిలో పాలిభాగస్తులు కావడం (అందువల్ల మనం పస్కా బలి  ద్వారా ఇజ్రాయెల్ యొక్క జాతీయ విధిలో చేరాలనుకునే అపవిత్రుల కోరికను అర్థం చేసుకోవాలి).

ఇశ్రాయేలు ప్రజల ఎన్నిక అనేది తోరా ఇవ్వడానికి ఆధారం:

రెండవ పస్కా  తరువాత షవువోత్ /వారముల పండుగ వస్తుంది, ఈ సమయంలో తోరా మరోసారి అందుకుంటాము. అపవిత్రుడు మరియు మొదటి పస్కాను ఆచరించని వ్యక్తి చాలా సమస్యాత్మకమైన సైద్ధాంతికస్థితిలో షవువోత్ పండుగకు సమీపించినవానిగా వుంటాడు. వారు జాతీయ విముక్తి లేకుండా తోరాను స్వీకరిస్తే, ఈ కార్యక్రమం  జాతీయంగా కాకుండా  పూర్తిగా మతపరమైనదిగా చేసినట్లౌతుంది. అటువంటి వైఖరి క్రైస్తవ మతం యొక్క విధానం. క్రైస్తవ మతం బైబిల్ సత్యాన్ని వ్యవస్థాపక గుర్తింపు పుస్తకంగా స్వీకరిస్తుంది. కానీ అది ఇశ్రాయేలు ప్రజలతో చేరడాన్ని అంగీకరించలేదు. 

అపవిత్రత  ఉన్నప్పటికీ వారికి, రెండవసారి  పస్కాను చేసే హక్కు మాకుందని చెప్పే  వ్యక్తుల సమూహం మన కథనంలో కీలక పాత్ర పోషించింది. వారు నీతిమంతులైయుండి తోరాను (షవువోత్) స్వీకరించడానికి ముందే  ఈజిప్ట్ (రెండవ పస్కా) వదిలి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. వారి ఆశక్తిని గుర్తించి, పరిశుద్ధుడు స్తుతిపాత్రుడైన ఎలోహీం,  షవువోత్ రాకముందే ఇయ్యర్ నెలలో రెండవ పస్కాను ఆచరించుటకు వారికి సూచించమని మోషేకు ఆజ్ఞాపించారు. ఈ చర్య కేవలం లాంఛనప్రాయమే కాదు, వ్యక్తిగత నిబద్ధత మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, తమను తాము పవిత్రపరచుకోవడానికి మరియు ఇశ్రాయేలు ప్రజలతో చేరడానికి వారికి ఒక ముఖ్యమైన అవకాశం. 

మనిషి తన క్రియలతో సృష్టికర్తతో భాగస్వామి కాగలడు:

ఇయ్యర్ మాసం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. నీసాన్ మాసం పై నుండి క్రిందికి విమోచనను సూచిస్తుంది – పరిశుద్ధుడైన ఎలోహీం, ఈజిప్టు నుండి మనలను విమోచించినట్లుగా, అతను ఇశ్రాయెల్ కోసం చేసిన అద్భుతాలు – ఇయ్యర్ మాసము ద్వారా క్రింద నుండి పై వరకు విమోచన యొక్క మేల్కొలుపును సూచిస్తుంది. ఇశ్రాయేలీయులు  (ఇశ్రాయెల్ ప్రజల నుండి ఒక  మేల్కొలుపుగా) రెండవ పస్కా యొక్క సెలవు దినాన్ని పునరుద్ధరించారు.

అందువల్ల, మన ఆధునిక యుగంలో, ఇష్రాయేలియుల విమోచన దినాలలో, విముక్తి యొక్క ముఖ్యమైన దినాలు - స్వాతంత్ర్య దినోత్సవం మరియు జెరూసలేం దినోత్సవం - ఖచ్చితంగా రెండవ నెల (ఇయ్యర్)తో సరిపోలడం యాదృచ్ఛికం కాదు. ఇది ఇశ్రాయేలు ప్రజల మేల్కొలుపు, ఇశ్రాయేల్ రక్షణ దళాల (IDF) ద్వారా మరియు ఇశ్రాయేల్ దేశానికి మన  ప్రజలను సమీకరించడం ద్వారా ఉత్ప్రేరకంగా కొనసాగుతున్న విమోచనను నొక్కి చెబుతుంది.

ఇది ప్రధానంగా రెండవ విమోచనాని తెలియజేస్తుంది, ఇది ఇజ్రాయెల్ ప్రజల నుండి మేల్కొలుపును తెలియజేయు 'ఇటారుటా డి-లెటాటా' అనే భావనను తెలియజేస్తుంది.  ప్రపంచాన్ని మెరుగైన స్థితికి తీసుకురావడంలో సృష్టికర్తతో భాగస్వాములు కావడానికి మన సరైన క్రియల యొక్క లోతైన ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search