రెయే పరష భాగములో చర్చింపబడిన అనేక అంశాల నడుమ తోరా మనకు అబద్ద ప్రవక్తను గూర్చి కూడా బోధిస్తుంది.
అబద్ద ప్రవక్త అనేవాడు ప్రవచించడానికి అర్హమైనవానిగా కనిపిస్తాడు. అతడు పిచ్చివానిలా అనిపించడు, బలహీనమైన మనసుగలవానిగా అనిపించడు, లేదా చెడ్డవానిగా కూడా అనిపించడు. మనకువున్న ప్రాధమికమైన సమాచారాన్ని బట్టి ప్రవచించడానికి అర్హమైన వ్యక్తి చెప్పే విషయంగానే అనిపిస్తుంది. అయితే అతడు మాటలాడినప్పుడు, అతని ప్రవచనము, మోషే అందించిన ధర్మశాస్త్రమైన తోరాతో విభేదిస్తుంది. ఉదాహరణకు, అతడు ఇతర దేవతలను ఆరాదించమని బోధిస్తే, తోరాను వక్రీకరించమని గాని, తోరాను నిర్మూలించమని గాని బోధిస్తే, ఇంతకుముందు అన్నీ సూచనలు ఉన్నప్పటికీ, ఈ వ్యక్తి నిజంగా తప్పుడు ప్రవక్త అని తోరా మనకు బోధిస్తుంది.
ఈ వారపు భాగంలో, అటువంటి వ్యక్తికి ఏమాత్రము భయపడాల్సిన అవసరము లేదని మనము నేర్చుకుంటాము. అతని ప్రణాళికకు ఆధారంగా ఏదైనా సూచక క్రియనైనా ఆశ్చర్యకార్యాన్నైనా చేసినప్పటికీ అతని ప్రవచనం ఒక అబద్దమని తోసి పుచాల్సినదిగా సూచింపబడింది. ఆశ్చర్యమేమిటంటే, తిరస్కరిస్తున్నది అతనికి శక్తులు లేనందుకు కాదు. వాస్తవానికి ఒక వ్యక్తికి అసాధారణమైన శక్తులు ఉండడం సాధ్యమైన విషయమే. ఈ ప్రపంచానికి శుభవార్తను అందించడానికి దేవుడే స్వయంగా అతని చేతికి సహాయం అందిస్తాడు. ఆ కారణము చేత అతనికి కొన్ని అసాధారణమైన సామర్ధ్యాలను అనుగ్రహిస్తాడు.
ఈ అబద్ద ప్రవక్త సూచక క్రియలు అనబడే విషయాలు చేసినప్పటికీ ఇశ్రాయేలియులను ఒప్పించలేకపోతాడు. దీనికి కారణం దేవుడు సినాయి పర్వతం వద్ద తోరా బయల్పరిచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ నిలిచి వున్నారు. సినాయి పర్వతము వద్ద జరిగిన సంఘటన వంటిది విలువలోగానీ ప్రభావంలోగానీ పోల్చదగిన మరొక సంఘటన సంభవింపజేయగల సామర్ధ్యం గల వ్యక్తి ప్రపంచంలో ఎన్నడూ లేడు. అసలు సృష్టికర్తయైన ఆదోనాయ్ ను మనము పూర్ణాత్మతోను పూర్ణ హృదయముతోనూ ప్రేమిస్తున్నామా అన్న విషయం పరీక్షించడానికి, తోరాతో విభేదిస్తూ, సూచక క్రియలు అద్భుతాలు చేయు అటువంటి ప్రవక్త వస్తాడని పరషత్ రెయేలో తోరా చెబుతుంది. మోషే ధర్మశాస్త్రము యొక బోధనలతో విభేదించు లేదా తృణీకరించు మతపరమైన విశ్వాసమునుండి ఇతర ప్రభావమునుండి ఇశ్రాయేలియులు సంరక్షింపబడతున్నారు. ప్రపంచమంతటికొరకు దేవుని వాక్కు యొక్క ప్రామాణికతను బద్రపరచే బాధ్యతను కలిగివున్నారు. ఈ కారణము చేత ఇశ్రాయేలియులను సంరక్షకులు అని అభివర్ణించవచ్చు.