నిట్సావీమ్ – వయెలెహ్ అను రెండు తోరా భాగాలకు సరిగ్గా మధ్యభాగంలో అతిముఖ్యమైన తోరా సందేశం ఉంది.
తోరా ఇలా చెబుతుంది- “జీవమును మరణమును నీఎదుట ఉంచియున్నాను, కాగా జీవమును కోరుకొనుము”. ఈ వచనమును మొదటిసారి చూసినప్పుడు చాలా సాధారణముగా కనిపిస్తుంది. అయితే ఈ వచనము ఏమి చెబుతుందంటే, మనం జీవము, మరణము అను రెండు విషయాలలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే జీవాన్నే ఎంచుకోవాలని తెలియజేస్తుంది. సహజంగా ఎవరైనా జీవాన్నే కోరుకుంటారు కానీ మరణాన్ని కాదు. అయితే తోరా ఇక్కడ ఏదో ఒక ముఖ్యమైన విషయం గూర్చి హింట్ ఇస్తుంది. ఒక మనిషి యొక్క వాస్తవమైన తత్వం ప్రకారం అతను మరణాన్ని ఉంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆధ్యాత్మికవేత్తలు, ఆత్మకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత నిచ్చేవారంతా, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి దేవునితో మమేకం కావడం ఉన్నతమైన విషయం అని సూచిస్తారు. పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మారడానికి మరణం అనేది మోక్షమార్గమనే ఒక విధమైన అనారోగ్యకరమైన ధోరణి మరణం పట్ల వ్యక్తమౌతుంది. మరికొంతమంది తమ భౌతిక దేహాలనుకూడా విడిచిపెట్టడానికి సిద్దమౌతారు – స్పిరిట్యువల్ డెత్.
అయితే తోరా మనకు దీనికి చాలా భిన్నమైన విషయాన్ని బోధిస్తుంది. “నేను నీ ఎదుట జీవమును, మరణమును వుంచియున్నాను.” అని చెబుతుంది. చావుని ఎంచుకోమని అది ఉన్నతమైన విషయమనే సిద్దాంతాలు ఉండగా, జీవముద్వారా దేవునిని చేరుకోవాలి అనే ఒక నూతనమైన విషయాన్ని తోరా ఆవిష్కరిస్తుంది. “నీవు జీవమును కోరుకొనుము”. ఎందుకు? ఎందుకంటే ఈ ఛాయిస్ ద్వారా మనము జీవిస్తాము, మన సంతతి కూడా భూమిపై జీవించివుంటారు. నిజముగా ఈ ప్రపంచములో జీవించడం ద్వారా సృష్టికర్తను చేరుకోవచ్చు అనేదే దీని అర్ధము.
ఈ మాటలలోని మరొక ప్రాధమికమైన ఉద్దేశం ఎదనగా, ఒక వ్యక్తి తనకు ఉన్న స్వేచ్చతో ఎంచుకోవచ్చు. నువ్వు మంచి చెడుల మధ్య మరియు జీవము మరణముల మధ్య ఒకదానిని ఎంచుకోవచ్చు. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నిర్ణయించేది నీవే తప్ప మరే ఇతర భాయ శక్తి కాదు. ఇలా ఎంపిక చేసుకునే స్వేచ్చ అనేది బాధ్యతను ఇస్తుంది. నేను ఒక విషయాన్ని ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలను నేను గాలిబిలి చేయొచ్చు లేదా ఒక క్రమపద్దతిలో నైనా నిర్మించవచ్చు. ఒక వ్యక్తి స్వేచ్చతో జీవాన్ని ఎంచుకోవడం ద్వారా జీవితానికి ఒక అర్ధం లబిస్తుంది. మన జీవితానికి నైతిక ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
లఘు సారాంశము (35 పధాలలో)
నిట్సావీమ్ – వయెలెహ్ భాగంలో తోరా జీవమును మరణమును మనముందు ఉంచుతుంది. సరిగ్గా ఎంచుకోవలసినది జీవము కాగా, కొంచం లోతుగా ధ్యానించినప్పుడు మరణము అనే విషయంపై కొన్ని ఆధ్యాత్మిక ఉద్దేశాలు బయటపడతాయి. దేవుని చేరుకోవడానికి మరియు నైతిక ప్రాధ్యాన్యతను హత్తుకోయడానికి , జీవమును ఎంచుకోమని తోరా ప్రోత్సహిస్తుంది.
సారాంశం విఫులంగా (80 పధాలలో)
రెండు భాగాలతో కూడిన నిత్సవీమ్ – వయెలెహ్ పరాష జీవము మరణము అను రెండు విషయాలో కీలకంగా ఒకదానిని ఎంచుకోవడాన్ని మనముందు ఉంచుతుంది. మనం సహజంగా జీవాన్నే ఎంచుకోవడానికి మొగ్గు చూపుతాం. అయితే, తోరా ఇక్కడ ఆధ్యాత్మిక కోణాలను అందిస్తుంది. మరణాన్ని ఎంచుకొనే విధానం ద్వారా దేవునితో మమేకం కావడాన్ని తోరా గుర్తించినప్పటికీ, దానికి భిన్నమైన మార్గాన్ని ప్రభోదిస్తుంది. జీవమును ఎంచుకోవడం ద్వారా ఒకడు కేవలం బ్రతకడం వరకే కాదు గాని దాని ద్వారా దేవుని చెరగలుగుతాడు. ఈ ఛాయిస్ లో స్వేచ్చ మరియు భాద్యత రెండూ ఇమిడివున్నాయి. జీవిత ప్రయాణంలో నైతికతను ప్రవేశపెట్టాలని నిర్వచిస్తుంది.