ప్రధమ సంతానపు మిట్స్వాలో లోతుగా ప్రతిధ్వనిస్తున్న కయీన్ హెబెల్ ల పరంపర – వెల్లడైన బంధం
పరషత్ ‘కి - తావో’ (ద్వితీయోపదేశకాండము 26) లోని మొదటి మిట్స్వా, ప్రధమ సంతానపు మిట్స్వా. కయీన్ మరియు హెబెల్ ల సంక్లిష్ట సంబంధానికి ఈ మిట్స్వా కొనసాగింపుగా వుంది.
ప్రధమ సంతానమైన కయీన్ మరియు ద్వితీయ సంతానమైన హెబెల్ యొక్క ప్రాధాన్యతను ఆదికాండము 4వ అధ్యాయములో తోరా మనకు ముందే తెలియజేసింది. ఈ వ్యత్యాసము, అనగా వారిరువురికి ఉన్న వ్యతిరేక ధోరణులు, వారు ఇతరులతో వ్యవహరించు విధానమును ప్రభావితం చేసింది. ప్రధమ సంతానముగా కయీన్ తనకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు వున్నట్లు గ్రహించి, ఇతరులను పక్కనపెట్టి తనకుతాను ప్రధానునిగా ఎంచుకున్నాడు. తత్ఫలితంగా మిగిలిన ధాన్యం నుండి అర్పణ తీసుకువచ్చాడు. మరోప్రక్క ద్వితీయ కుమారునిగా తన స్థానమును గుర్తెరిగిన హెబెల్, ఇతరులతో భాగం పంచుకొవడమే తాను చేయవలసిన కార్యమని గ్రహించాడు.
ఈ దృక్పధమును బట్టి, ఏ దినమైతే ప్రధమ సంతానము (బిక్కురీమ్) జన్మించిందో అదే రోజున దేవుడు తోరాను ఎందుకు అనుగ్రహించాడో (షావువోత్ పండుగ) స్పష్టమౌతుంది. అనగా ప్రధమ సంతానమును అర్పణాగా ఇవ్వగలిగే వారికే తోరా అనుగ్రహింపబడుతుందని తెలుస్తుంది. తమది ద్వితీయ స్థానమని గ్రహించి ఇతరులతో పాలుపంచుకోవలసిన భాద్యతను గుర్తెరిగిన వారికి అది ప్రసాదించబడుతుంది. ఈ విధానమును అనుసరించి, సూచనప్రాయంగా పరిశుద్దుడైన దేవుడు ప్రధమ ఫలమైన తోరాను తీసుకొని హెబ్రీ జాతి ద్వారా సర్వమానవాళికి బహూకరించాడు.
ప్రధమఫలమును యాజకుని మందిరమునకు తీసుకొని రావాలని తోరా మనకు సూచిస్తున్నప్పుడు దానికి మరింత లోతైన ప్రాధాన్యత ఉంటుంది. ఇశ్రాయేలియులలో ప్రతిద్వనించే చారిత్రక ఘట్టమైన ఐగుప్తు నిర్గమ కధను ఈ చర్య తెలియజేస్తుంది.
ఒక వ్యక్తి ప్రధమ ఫలమును అర్పించునప్పుడు యాజకునితో ఈ విధముగా చెప్పవలసి వుంటుంది, “నేను ఈ దేశమునకు వచియున్నాను, అని నీ దేవుడైన అదొనాయ్ ఎదుట ఈ దినమున ప్రకటన చేయుచున్నాను.” చూడడానికి ఈ ప్రకటన అస్పష్టంగా ఉన్నట్లుంది. ఒక వ్యక్తి తరతరాలుగా ఇశ్రాయేలు దేశములోనే నివశిస్తూ వున్నప్పటికీ వారి రాక ఇప్పుడే సంభవించినట్లు దానిని ప్రకటన చేయవలెనని వారికి ఆజ్ఞాపించబడింది. వింతగా అనిపించే ఈ ఆజ్ఞ మానసికమైన ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఒకడు తన దేశములో నూతనముగా ప్రవేశించినట్లు, ఒక క్రొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్నట్లు ఎల్లపుడూ భావించాలి.
ఒకరు ఎల్లప్పుడు తమ మూలాలగురించి నిరంతరం అవగాహన కలిగి ఉండి, నిరంతరం పునరుత్తేజం అవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి, వారి మార్గాన్ని ముందుకు నడిపిస్తుంది.