Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

నిశ్శబ్దానికి అతీతంగా: నిర్గమా కాండము లో పేర్లు, గుర్తింపు మరియు సంఘీభావపు ఆవిష్కరణ

నిర్గమ కాండము 2: 1-5

“లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.”

“వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను.” 

ఈవచనాలన్నింటిలో లేదా మనం తీసుకున్న ఈ వచన భాగాలన్నిటిలో ఒక దాని ఆవశ్యకత ఉంది, అదే - పేర్లు. ఆ పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు, బిడ్డ ఎవరు, ఫరో కుమార్తె ఎవరు, సోదరి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇతర మూలాల నుండి మనకు తెలుసు, కాని ఈ వాఖ్య భాగాలలో  ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పాత్రల పేర్ల తొలగించబడ్డాయి. ఇగుప్తు నేపధ్యంలో పేర్ల తొలగింపును తెలియజేయడానికి ఇది ఉద్దేశించబడింది. (ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన) ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా,' అనే పదాలతో మన భాగం మొదలవుతుండగా, కథనంలో పురోగమిస్తున్న కొద్దీ పేర్లు క్రమంగా మాయమవుతాయి. 

ఇగుప్తు  అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగత విలువను గుర్తించక, వ్యక్తులను అమానవీయంగా గుర్తిస్తుంది.   "ఆమె అతనికి మోషే అని పేరు పెట్టెను" అని అది మోషేను గూర్చి మాత్రమే వ్రాయబడి ఉంది.  మోషే అంటే అర్ధం ఏంటి? మోషే అనేది “అబ్బాయి” అని అర్ధమిచ్చే  ఈజిప్టు పదం. "నేను అతన్ని నీటి నుండి తీసుకున్నాను, అని ఆమె చెప్పెను". ఇది  ఒక ఐగుప్తు  నామానికి హీబ్రూ భాష్యం, అంటే మోషే మిద్యను కు పారిపోయి సిప్పోరాను వివాహం చేసుకున్న తరువాత మాత్రమే - ఆహ్, అకస్మాత్తుగా పేర్లు వచ్చాయి, మోషే, యిత్రో, రగూయేలు, సిపోరా మరియు వారి కుమారుడు గెర్షోము పేర్లు కూడా ఉన్నాయి, మరియు ఆయన మోషేతో చెప్పినప్పుడు పరిశుద్ధుని పేరు కూడా బహిర్గతమవుతుంది.  'నా పేరు తెలుసుకోవాలని ఉందా? ఇదిగో నా పేరు'. 

'కనుమరుగైన పరిభాషలో - తుడిచిపెట్టుకుపోయిన ఒక సంస్కృతి లోతుల్లో మన పితరులు ఈజిప్టులో 'మిళితమయ్యారని’ మనం అర్థం చేసుకున్నాం -. కాబట్టి, మోషే తాను ఏ సంస్కృతికి చెందినవాడినో నిర్ణయించుకోవలసి వచ్చింది. 'మోషే తన సహోదరుల దగ్గరకు వెళ్ళాడు' అని వ్రాయబడినప్పుడు, వారు ఎవరు అని మనం అడగాలి. రబ్బీ అబ్రహాం ఇబ్న్ ఎజ్రా ఇది ఈజిప్షియన్లను సూచిస్తుందని నమ్ముతుండగా, రంబాన్ ఇది హెబ్రీయులను సూచిస్తుందని చెబుతున్నారు. మోషే తనకు తాను స్పష్టత తెచ్చుకోవలసి వచ్చి౦ది, కాబట్టి ఆయన పరిశీలన చేయడానికి వెళ్ళాడు. ఒక ఇగుప్తీయుడుహెబ్రీయుని కొట్టడం చూసినప్పుడు, హీబ్రూ ప్రజలు తన సహోదరులని అతను అర్థం చేసుకున్నాడు మరియు భావించాడు. మోషే సంఘీభావం ఆయనను ఈ సాక్షాత్కారానికి తీసుకువచ్చింది, హీబ్రూ ప్రజల భవితవ్యంతో అతన్ని ముడిపెట్టింది, ఎందుకంటే అతను వారి బాధలతో సహానుభూతి చెందాడు."

More Weekly Portions

సత్యము మరియు సహానుభూతి: సమన్వయ పరచు నాయకత్వము

కి తిసా అను తో రా భాగంలో,  బంగారు దూడ యొక్కఎపిసోడ్, నాయకత్వం, పాపం మరియు విముక్తి అను ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విషయాలను తేటపరచి  హైలైట్ చేస్తుంది. మోషే మరియు అహరోనులు తదనంతర పరిణామాలను నావిగేట్ చేస్తారు, అహరోనుగారు విశిష్ట విద్యా విధానాన్ని ప్రదర్శిస్తారు, ఇది సానుభూతితో సత్యం-చెప్పడాన్ని ఏకీకృతం చేస్తుంది.  తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకొని దేవునితో సంబందం కలిగివుండడం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను ఈ కధనం తెలియజేస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మరియు రెండవ అవకాశానికి వున్న సామర్ధ్యాన్ని వీరి క్రియల ద్వారా కధనం మనకు తెలియజేస్తుంది

ప్రత్యక్ష గుడారంలోని పవిత్రత మరియు ఆచారాలకు ప్రయాణం

ప్రత్యక్షపు గుడారం యొక్క సారాన్ని పరిశీలిస్తూ, ఈ వ్యాసం సహకారం మరియు ఆజ్ఞల మధ్య నూతన కోణాన్ని వివరిస్తుంది, పవిత్రత మరియు యాజకత్వంలో  వారి పాత్రలను నొక్కి చెబుతుంది. ఇది ప్రత్యక్షపు గుడారంలో పరిమళ ధూపం యొక్క లోతైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం ద్వారా రెండింటి మధ్య ఉన్న సూక్ష్మభేదాలను పరిశీలిస్తుంది. అంతేకాకుండా, రోజువారీ జీవితాన్ని మరియు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తు, ప్రత్యక్షపు గుడార సేవ  ఏవిధంగా ఆచారాన్ని అధిగమిస్తుందో చర్చిస్తుంది. సమకాలీన ఆధ్యాత్మికతపై పురాతన ఆచారాల యొక్క శాశ్వత ప్రభావం గురించి అంతర్దృష్టులను అందిస్తుంది.

అంతరంగిక మందిరం : యూదత్వంలో దైవంతో లోతైన సంబంధం

గుడారంలో జంతుబలి అనే ప్రాచీన ఆచార౦తోపాటు మోషే ఆత్మ నిర్మాణ౦ గురి౦చిన లోతైన ప్రతీకాత్మకతను, నేడు దాని ఔచిత్యాన్ని కనుగొన౦డి. యూదమతం యొక్క గొప్ప సంప్రదాయాల నుండి గ్రహించి, మీ జీవితంలో ఆధ్యాత్మిక పవిత్రాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోండి. హీబ్రూ బైబిల్ లో వర్ణించబడిన విధంగా దేవుని నివాస స్థానం గురించి అంతర్దృష్టులను పొందండి, సమకాలీన మత ఆచరణలో దైవంతో అనుసంధానం గురించి లోతైన అవగాహనను పెంపొందిస్తుంది.

Search