అపవిత్రత నుండి బాంధవ్యo వైపుకు: ప్రసవాన్ని గూర్చి తోరా యొక్క అనూహ్యమైన దృక్పథం ("అపవిత్రత" నుండి బాంధవ్యo వైపుకు పరివర్తన మరియు తోరా యొక్క ఆశ్చర్యకరమైన దృక్పథం)
స్త్రీ జన్మనివ్వడం ఒక అద్భుత ఘట్టం. పరషత్ తజ్రియా ఒక స్త్రీ జన్మనిచ్చే నియమాలతో ప్రారంభమవుతుంది. మగ పిల్లవాడైనా లేక ఆడపిల్లైనా ఒక కొత్త బిడ్డ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు మనము చాలా సంతోషిస్తాము. కాని ప్రసవించు స్త్రీ "అపవిత్రం" అని తోరా ఎందుకు చెబుతుంది? ప్రసవించడం అనేది సిగ్గుతోకూడిన విషయం కాబట్టి ఆమె అపవిత్రురాలు కాదు; దీనికి పూర్తి విరుద్ధంగా, గర్భధారణ సమయంలో ఆమె పరిపూర్ణమైన జీవంతో నిండి ఉంటుంది, మరియు ప్రాణం ఆమెనుండి వేరుపడి, ఒకప్పుడు జీవం ఉన్న చోటున శూన్యం మిగిలింది, అందువల్ల అపవిత్రత కలిగింది. కాబట్టి నవజాత శిశువు కొరకు శుద్ధి అవసరం. ఆడపిల్ల జన్మిస్తే అపవిత్రత రెట్టింపు అవుతుంది, ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జన్మనివ్వాలనేది నిర్ణయింపబడిన విషయం. అందువలన, ఆడపిల్ల జన్మించినప్పుడు మగపిల్లవాడు జన్మించినదానికంటే ప్రాణ నష్టం రెండు రెట్లు ఉంటుంది. ఇక్కడ, జీవితం పట్ల తోరా యొక్క ఆశావాద దృక్పథాన్ని మనం చూస్తాము.
కాబట్టి ప్రసవించు స్త్రీ పాప పరిహారార్ధ బలిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఆమె చేసిన పాపం ఏమిటి? క్రైస్తవ భావన ప్రకారం, ఆదాము యొక్క అతిక్రమణలో పాల్గొనడం వల్ల ప్రసవమే పాపం. కానీ మన పెద్దలు అందుకు పూర్తి విరుద్ధంగా చెప్పారు. ఒక స్త్రీ ప్రసవించే సమయంలో, ఆమె తన బాధలో, తన భర్త వద్దకు తిరిగి రానని ప్రతిజ్ఞ చేస్తుంది, ఇది ఆమెకున్న జీవాన్ని కొనసాగించగల సామర్ధ్యాన్ని అంతం చేయాలనుకుంటుందని సూచిస్తుంది. అందువలన, ఎటువంటి వ్యక్తిగత బాధ కంటే, ఆమె లేదా మరొక స్త్రీ బాధ కంటే జీవితం ముఖ్యం అని చెప్పడానికె పాప పరిహారార్ధబలి అవసరం. మానసికంగా, ఇది మరింత లోతుగా తీసుకువెళ్తుంది. ఒక స్త్రీ జన్మనిచ్చినప్పుడు, తనలో దాగిఉన్న పిండం ద్వారా ఆమె స్వతస్సిద్ధముగా గతంతో మరియు భవిష్యత్తుతో అనుసంధానించబడుతుంది. తల్లి జన్మనిచ్చినప్పుడు తనకుమరియు తనకు జన్మించిన కొడుకు లేదా కుమార్తె మధ్య పైకి కనిపించని అసూయ ప్రారంభమౌతుంది, మానవ జీవితం యొక్క ప్రాధమిక ధోరణిగా దీనికి ప్రాయశ్చిత్తం మరియు జీవితాన్ని స్వీకరించడం అవసరం.
ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ చూడండి https://noahideworldcenter.org/pages/life-cycle