Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

యూదియ నాయకత్వపు మూలాలపై యాకోబు ప్రభావం: ఒక పరిశీలన

యాకోబు మరణానికి ముందు అతని కుమారులలో ప్రతివొక్కనికి  నిర్దిష్టమైన ఆశీర్వాదాలను  ప్రవచనాలను అందించడమే  ఈ అధ్యాయంలో తన పిల్లలను ఒకచోటికి రప్పించడంలో యాకోబు ఉద్దేశ్యం. ఈ ఆశీర్వాదాలు, యాకోబు  తన ప్రేమను వ్యక్తీకరించడానికి మరియు అతని పిల్లలు వారి జీవితంలో వారి మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు మార్గనిర్దేశం చేసేందుకు అనుమతించాయి. 'ప్రతిఒక్కరిని తన ఆశీర్వాదం ప్రకారం వారిని ఆశీర్వదించెను' అని వ్రాయబడింది. రూబెన్, షిమోన్ మరియు లేవీలతో పలికిన మాటలు పెద్దగా అనుకూలమైనవిగా అనిపించినప్పటికీ, తన కుమారులలో ఎవరు రాజ్యాధికారానికి అర్హులో రాజకీయంగా నాయకత్వం వహించగల సమర్థుడో వారికి వివరించడమే యాకోబు ఉద్దేశమని రబ్బీ ఐజాక్ అబర్బనేల్ వివరించారు. ఈ వివరణ ప్రధానంగా ఆశీర్వాదాల సారాంశాన్ని వివరిస్తుంది.

రూబేను, 'నీకు నీటివలె  చంచలత్వము కలదు.' ఓపిక లేని వ్యక్తి రాజకీయాలను నడిపించలేడు. రాజకీయాలకు సహనం అవసరం.

షిమోన్ మరియు లేవిల సంగతేంటి ? వారు మతోన్మాదులు, మత ఛాందసవాదులు. చరిత్రలో అసాధారణ సమయాల్లో ఉత్సాహం కొన్నిసార్లు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దేశాన్ని నడిపించడానికి అన్ని వేళలా అత్యుత్సాహంతో నడుచుకోవడం సరికారు.

జెబులూన్ విషయమేంటి? జెబులూన్ 'సముద్రాల తీరంలో నివసిస్తాడు,' అంటే అతను విస్తృత, సార్వత్రిక సంస్కృతిని కలిగి ఉంటాడు మరియు తప్పనిసరిగా తన దేశానికి జరిగే మేలుకంటే ఈ ప్రాంతాన్ని ఆదరించడానికి మొగ్గు చూపుతాడు.  

మరి ఇస్సాకార్ గురించి ఏమిటి? 'ఒక దృఢమైన ఎముకగల గాడిద,' అతను తోరాను అధ్యయనం చేస్తాడు, ఇది రాజకీయ స్వాతంత్ర్యానికి ఎక్కువ విలువను ఇవ్వని దిశ.

అందుచేత అతనిగూర్చి ఈ విధంగా వ్రాయబడింది- “అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును.” 

ఇక దాన్ గురించి ఏమిటి? దాన్‌కి ఎలా పోరాడాలో తెలుసు, కానీ అతనికి తెలిసింది వీరుడైన సంసోనులా  గెరిల్లా యుద్ధాలు ఎలా చేయాలన్నది. ఇది  స్వాతంత్ర్య సాధనే లక్ష్యం అయినప్పుడు మంచిదే కానీ దేశం మొత్తానికి నాయకత్వం వహించడానికి తగినది కాదు...

మరోవైపు, 'గాదు, అతని నుండి ఒక దళం బయలుదేరడం' మనం చూస్తాము, అతను మొత్తం సైన్యాన్ని నడిపించగలడని అనిపిస్తుంది, కానీ వాక్యపు  కొనసాగింపు కూడా చదివినప్పుడు, 'అది తాను వెళ్ళిన మార్గంలో వెనకకు మరులుతుంది' అని పేర్కొంది. అతను జయించినప్పుడు, అతను జయించిన దిశలోనే తిరిగి రావాలనుకుంటాడు. ఆ భూమితో తనకు నిజమైన సంబంధం లేదనుకుంటాడు.

నఫ్తాలీ మరియు ఆషేరు విషయంలో కూడా అంతేనా? నఫ్తాలీ 'అందమైన పదాలు ఉచ్చరించే (ఇంపైనమాటలు పలుకును) వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు, అంటే అతను విద్యా మంత్రి కావచ్చు, సాంస్కృతిక మంత్రి కావచ్చు, ఆషేరు ఆర్థిక మంత్రి కావచ్చు మరియు “రాజులకు తగిన మధుర పదార్ధములను అందించవచ్చు”.

అయితే, నఫ్తాలీ కానీ, ఆషేరు కానీ సంపూర్ణమైన అవగాహన కలిగిలేరు. అందువల్ల వీరిద్దరూ దేశాన్ని నడిపించే అభ్యర్థులు కాదు.

 

యోసేపు సంగతేంటి?, పైన చెప్పిన వాటికి విరుద్దంగా పరాక్రమశాలియైన యాకోబు దేవుని హస్తములచే అతని చేతుల ఆయుధములు దృఢపరచబడెను  అతని విల్లు బలమైనదగును' అని వ్రాయబడి౦ది, కానీ ఆయన దేవుని ఆరాధనకు ఆకర్షి౦చబడలేదు, 'వారు ఆయనపై కక్షలు పెంచుకొని  గొడవపడ్డారు; అతన్ని అసహ్యించుకున్నారు." విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించారు. కాబట్టి, యోసేపు కొన్నిసార్లు మాత్రమే తన వ్యక్తిత్వం కారణంగా దేశాన్ని నడిపించగలడు.

బెన్యామీను సంగతేంటి? అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును." అతను సౌలు రాజు  వలె రాచరికం ప్రారంభంలో మరియు ఎస్తేర్ మరియు మోర్డెకై వలే రాచరికం చివరి అంఖంలో పాలించగలడు, కాని అతను చారిత్రక క్రమాన్ని కొనసాగించలేడు.

మరి యూదా సంగతేంటి? 'సింహం పిల్ల'. యూదా ప్రాథమికంగా ఒక పిల్ల, తరువాత సింహం, తరువాత సివంగి. 'కిమాహ్ కిమా' (קמעה קמעה) అంటే రాజకీయాల్లో సహనం వహించాలనే రహస్యం ఆయనకు తెలుసు, అందువలన అతను ఆరాధనను పొందుతాడు. " నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు" ఆయన పాలించడానికి అర్హుడు.

[ఆదికాండము 49 నుండి]

More Weekly Portions

సత్యము మరియు సహానుభూతి: సమన్వయ పరచు నాయకత్వము

కి తిసా అను తో రా భాగంలో,  బంగారు దూడ యొక్కఎపిసోడ్, నాయకత్వం, పాపం మరియు విముక్తి అను ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విషయాలను తేటపరచి  హైలైట్ చేస్తుంది. మోషే మరియు అహరోనులు తదనంతర పరిణామాలను నావిగేట్ చేస్తారు, అహరోనుగారు విశిష్ట విద్యా విధానాన్ని ప్రదర్శిస్తారు, ఇది సానుభూతితో సత్యం-చెప్పడాన్ని ఏకీకృతం చేస్తుంది.  తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకొని దేవునితో సంబందం కలిగివుండడం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను ఈ కధనం తెలియజేస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మరియు రెండవ అవకాశానికి వున్న సామర్ధ్యాన్ని వీరి క్రియల ద్వారా కధనం మనకు తెలియజేస్తుంది

ప్రత్యక్ష గుడారంలోని పవిత్రత మరియు ఆచారాలకు ప్రయాణం

ప్రత్యక్షపు గుడారం యొక్క సారాన్ని పరిశీలిస్తూ, ఈ వ్యాసం సహకారం మరియు ఆజ్ఞల మధ్య నూతన కోణాన్ని వివరిస్తుంది, పవిత్రత మరియు యాజకత్వంలో  వారి పాత్రలను నొక్కి చెబుతుంది. ఇది ప్రత్యక్షపు గుడారంలో పరిమళ ధూపం యొక్క లోతైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం ద్వారా రెండింటి మధ్య ఉన్న సూక్ష్మభేదాలను పరిశీలిస్తుంది. అంతేకాకుండా, రోజువారీ జీవితాన్ని మరియు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తు, ప్రత్యక్షపు గుడార సేవ  ఏవిధంగా ఆచారాన్ని అధిగమిస్తుందో చర్చిస్తుంది. సమకాలీన ఆధ్యాత్మికతపై పురాతన ఆచారాల యొక్క శాశ్వత ప్రభావం గురించి అంతర్దృష్టులను అందిస్తుంది.

అంతరంగిక మందిరం : యూదత్వంలో దైవంతో లోతైన సంబంధం

గుడారంలో జంతుబలి అనే ప్రాచీన ఆచార౦తోపాటు మోషే ఆత్మ నిర్మాణ౦ గురి౦చిన లోతైన ప్రతీకాత్మకతను, నేడు దాని ఔచిత్యాన్ని కనుగొన౦డి. యూదమతం యొక్క గొప్ప సంప్రదాయాల నుండి గ్రహించి, మీ జీవితంలో ఆధ్యాత్మిక పవిత్రాలయాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోండి. హీబ్రూ బైబిల్ లో వర్ణించబడిన విధంగా దేవుని నివాస స్థానం గురించి అంతర్దృష్టులను పొందండి, సమకాలీన మత ఆచరణలో దైవంతో అనుసంధానం గురించి లోతైన అవగాహనను పెంపొందిస్తుంది.

Search