ప్రత్యక్ష గుడారం లో ఆజ్ఞలకు, విశ్రా౦తి దిన౦లో ఆజ్ఞలకు మధ్య గల ఆవశ్యకమైన స౦బ౦ధ౦.
పరషత్ "వాయఖేల్" ప్రారంభంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే పనిని మోషే ప్రకటించినప్పుడు, తోరాహ్ విశ్రాంతి దిన ఆజ్ఞలకు అనేక వచనాలను జోడించింది.
విశ్రా౦తి దిన౦లోని ఆజ్ఞల గురి౦చి ప్రస్తావి౦చడ౦ అయోమయ౦గా అనిపిస్తు౦ది, ఎ౦దుక౦టే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మి౦చాలో ఆ భాగ౦ మొత్తం చర్చిస్తు౦ది. అలాంటప్పుడు, పరాష ప్రారంభoలో సబ్బాత్ గురించి ఎందుకు ప్రస్తావిస్తారు? విశ్రా౦తి దిన ఆజ్ఞలకు, పరిశుద్ధాలయ ఆజ్ఞలకు మధ్య ఒక ముఖ్యమైన స౦బ౦ధ౦ ఉ౦ది. పరిశుద్ద స్థల నిర్మాణం విశ్రాంతి దినాన జరగకూడదని పాఠం చెబుతోందని మా జ్ఞానులు మాకు బోధించారు.
కాబట్టి, విశ్రా౦తి దిన౦లో గుడారాన్ని నిర్మి౦చుట నిషిద్దము, అనగా విశ్రా౦తి దిన౦లో గుడార నిర్మాణపు పనులు చేయడ౦ నిషేధము అనేది, విశ్రా౦తి దిన౦లోని నిషిద్ధమైన పనులు అనగా గుడారపు పనులు అని మనకు బోధిస్తో౦ది! గుడారాన్ని నిర్మి౦చడానికి అవసరమైన ముప్పై తొమ్మిది పనులు విశ్రా౦తి దినాన నిషేధి౦చబడిన పనులే.
సబ్బాత్ ఆచరించడం ద్వారా సమయములోని పరిశుద్ధతను వెల్లడి చేయడం జరుగుతుంది, మరియు స్థల సంబందిత పవిత్రత అనేది దేవాలయం ద్వారా వెల్లడి అవుతుంది.
విశ్రాంతి దినం అనేది సమయంలోని 'పరిశుద్ద స్థలo'. సబ్బాత్ రోజే మరొక ‘పరిశుద్ద స్థలo' నిర్మించాల్సిన అవసరం లేదు. సబ్బాత్ రోజున ‘పరిశుద్ద స్థలo' ఎలా వ్యక్తీకరించబడుతుంది? ఇది 'కాల పవిత్రత' ద్వారా, విశ్రాంతి దిన భోజనం ద్వారా, విశ్రాంతి దినం యొక్క ప్రార్థనల ద్వారా మరియు విశ్రాంతి దినం యొక్క మిగిలిన భాగాల ద్వారా జరుగుతుంది. వారానికి ఒకసారి, సబ్బాత్ రోజున, మనము సంపూర్ణమైన ప్రపంచంలో ఉంటాము.
అదేవిధంగా, పరిశుద్ద స్థలము(ఈ భాగంలో నిర్మించమని మోషేకు ఆజ్ఞాపించబడిన పరిశుద్ద స్థలం) విశ్రాంతి దినపు పవిత్రతను ప్రదేశానికి మరియు స్థలానికి బదిలీ చేస్తుంది. దీని సారాంశాన్ని బట్టి, మానవ ప్రపంచంలో పరిపూర్ణ ప్రపంచాన్ని వెల్లడించడానికి సమయం లేదా ప్రదేశం అనే రెండు మార్గాలు ఉన్నాయి.
నిర్ధిష్టంగా ముప్పై తొమ్మిది పనులు అనే సంఖ్యను ఎలా చేరుకున్నాం?
ఇది చాలా సింపుల్. తోరా రహస్యాల ప్రాచీన గ్రంధాలలో ఒకటైన "సెఫర్ యెట్జీరా" లో, ప్రపంచం ఇరవై రెండు అక్షరాలతో (హీబ్రూ అక్షరమాల) మరియు పది సంఖ్యలతో (ఒకటి నుండి పది వరకు) సృష్టించబడిందని మనము తెలుసుకున్నాము. ప్రపంచం యొక్క నిర్మాణం ఆ ముప్పై రెండు మార్గాలు మరియు ఇరవై రెండు అక్షరాలతో కూడిన మార్గాలపై నిర్మించబడిందని, నాణ్యత ప్రపంచాన్ని వ్యక్తీకరిస్తుంది, అదనంగా పది సంఖ్యలు పరిమాణ ప్రపంచాన్ని వ్యక్తపరుస్తాయి.
ఇప్పటివరకు, మనము ముప్పై తొమ్మిది పనులని వివరించాము (22+10) . కానీ ఆగండి, మరో ఏడు ఎలా వచ్చాయి? ఏడు అక్షరాలు వాటి ఉచ్చారణ విధానంలో రెండువిధాలుగా ప్రవర్తిస్తాయని తెలుసుకోవడం అవసరం. ఒకసారి, వాటిని మృదువుగా ఉచ్ఛరించవచ్చు, కానీ ఆ ఏడు అక్షరాలను ఒత్తి పలికినప్పుడు, వాటి ఉచ్చరణ విధానం మార్పుచెందుతుంది. వాటి వ్యక్తీకరణ బలోపేతమవుతుంది.
ఉదాహరణకు, (ఆంగ్ల అక్షరం 'ఎఫ్' కు సరిసమానమైన) 'ఫే' అనే అక్షరాన్ని కొంచం నొక్కి పలికినప్పుడు [అక్షరాన్ని బలోపేతం చేయడంవల్ల], ('పి' అక్షరానికి సరిసమానంగా) అది బలంగా ఉచ్ఛరించబడుతుంది. హీబ్రూ భాషలో ఇలాంటి అక్షరాలు ఏడు ఉన్నాయి! మొదట్లో చెప్పిన ఆ ముప్పైరెండు అక్షరాలతో పాటు మరో ఏడు అక్షరాలను కలిపితే, అది ముప్పై తొమ్మిది [32+7=39]గా మారుతుంది, ఇది ప్రత్యక్షగుడారంలో దానిని నిర్మించడానికి మరియు నిలబెట్టడాకి చేసిన ముప్పై తొమ్మిది పనులకు సమానమైనది.
సబ్బాత్ పనుల వివరాలను లోతుగా పరిశీలించి, అవి ఏ అక్షరం లేదా సంఖ్యకు అనుగుణంగా ఉన్నాయో చూడవచ్చు. ఈ తక్కువ సమయంలో ఈ భాగం యొక్క పూర్తి వివరణను వివరించలేము; ఆసక్తి ఉన్నవారి ఉత్సుకతకు దీనిని వదిలేస్తున్నాం.
ప్రతి నోవాహీయుడు సబ్బాత్ రోజున ఎలా ప్రవర్తించాలి? ఒక నోవాహీయుడు విశ్రా౦తి దినాన్ని పూర్తిగా ఆచరి౦చడానికి అనుమతి౦చబడ్డాడా? ఇశ్రాయేలీయుల వలె ఆయన విశ్రా౦తి దినాన్ని ఆచరి౦చడ౦ సముచితమేనా? 'బ్రిత్ ఓలామ్ - డైలీ లాస్ ఫర్ నోవాహైడ్స్' అనే పుస్తకంలో మీరు దీన్ని ఇంకా మరెన్నో చూడవచ్చు.
యెరూషలేము నుండి ఆశీర్వాదాలు.
>