తోల్దోత్ భాగం ఇలా ప్రారంభమవుతుంది: "ఇవి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు చరిత్రలు (వంశావళులు)." ఈ చరిత్రలు ఏమిటంటే వారపు భాగములో ప్రస్తావించబడిన ఇస్సాకు కుమారులైన యాకోబు మరియు ఏశావులను సూచిస్తున్నాయని ప్రముఖ వ్యాఖ్యాతయైన రాషి గారు వివరించారు.
దీని అర్థం ఏమిటి? యాకోబు మరియు ఏశావులు అబ్రాహాము మరియు ఇస్సాకు యొక్క ఆదర్శాలను కొంతవరకు వ్యక్తపరుస్తారని దీని అర్థం. అబ్రహాము దయ అను గుణలక్షణమును కలిగి ఉంటాడని చెప్పబడింది, అయితే ఇస్సాకు తీర్పు అనే గుణలక్షణమునకు ప్రతీకగా ఉన్నారు. అలాగే, యాకోబు మరియు ఏశావు కూడా ఈ గుణలక్షణాలు కలిగివున్నారు. యాకోబు ప్రధానంగా అబ్రహాము యొక్క దయను స్వీకరించగా ఇస్సాకు యొక్క తీర్పు గుణాన్ని ఏశావు కలిగినున్నాడు.
అయినప్పటికీ, అబ్రాహాము మరియు ఇస్సాకులు నీతిమంతులు కాబట్టి వీరి కుమారులు తమ తండ్రులను అదే విధానంలో పోలి ఉండరు. వీరికి విరుద్ధంగా, ఈ ఉదంతంలో, యాకోబు మరియు ఏశావుల విషయానికొస్తే , ఒకరు నీతిమంతులు కాగా మరొకరు చెడ్డవారు. ఇక్కడ మనము వారి ప్రవర్తన గురించి కాకుండా వారి ఐడెంటిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నామని దయచేసి గమనించండి.
“ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి” అని చెప్పబడింది. మరొకసారి రాషి గారి వివరణ పరిశీలిస్తే, వారు రెండు ప్రపంచాలను స్వాతంత్రించుకొను విషయంలో వాదన చేశారు అని తెలుస్తుంది.
ఈ రెండు ప్రపంచాలు ఏమిటి? మునుపటి వారపు పాఠంలో నేర్చుకున్న విషయాలను బట్టి అవి ఈ ప్రపంచం మరియు రాబోవు ప్రపంచం అని మనకు బాగా తెలుసు (రెండుసార్లు జీవించడం అనే వ్యాసాన్ని చూడండి). కానీ ఈ ఇద్దరికీ ఏమి కావాలి? యాకోబుకు రాబోవు ఆధ్యాత్మిక ప్రపంచము, ఏశావుకు ఈ భౌతిక ప్రపంచం కావాలని చెబితే, అసలు గోడవే వుండదు! మిగిలిన వాటాను తీసుకోవడానికి ఇద్దరూ అంగీకరిస్తారు. మరలాంటప్పుడు, వాళ్ళు దేనిగురించి గొడవపడ్డారు?
ఈ విషయాన్ని గూర్చి ఫ్రాగ్ లోని మహరల్ రబ్బీ యెహుదా లోవ్ గారు ఇలా వివరించారు – ఆ యిద్దరూ రెండు ప్రపంచాలను కోరుకుంటున్నారు. యాకోబు, నిజానికి, రాబోయే ప్రపంచం పట్ల సహజంగానే ఆశక్తి కలిగి ఉన్నాడు. యాకోబులో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనదని మనకు స్పష్టమైంది. అయినప్పటికీ, యాకోబు యొక్క మిషన్ కి వున్న సవాలు ఏంటంటే ఈ ప్రపంచాన్ని కూడా వారసత్వంగా పొందాలి అనే విషయం.
బహుశా ఇది యాకోబుకు సహజంగా రానందున, యాకోబు సంతతియైన యూదులు, చరిత్ర అంతటా, పరిమితమైన రాజకీయ విజయాన్ని మాత్రమే సాధించగలిగారని మనం చూస్తాము. అయినప్పటికీ, ఈ ప్రపంచంతో మెరుగైన సంభందాన్ని నెలకొల్పి దాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో పవిత్రతను సాధించాలనేది వారికున్న సవాలు. సియోనుకు తిరిగి వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని స్థాపించడం అనేది మనం మన కాలంలో అటువంటి కార్యాన్ని సాధించడం వంటిదే.
అయితే దీనికి వ్యతిరేకంగా, ఎదోము, యాశావుల భావితవ్యానికి ఈ ప్రపంచం భరోసా ఇచ్చింది. రోమ్ మరియు పశ్చిమ దేశాలు రూపంలో వారి విషయంలో చెప్పబడింది నెరవేరింది. ఏశావు అనే పేరుకు హీబ్రూలో శాంతి యొక్క సంఖ్యాపరమైన విలువ ఉందని యూదియ పండితులు సూచించిన మేరకు ఈ ప్రపంచం తనకుతానే సాక్ష్యమిస్తుంది. ఏశావు మరియు అతని సంతతి వారు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నందున ఇది తలెత్తుతుంది; అతను అందరికీ 'శాంతి'ని నిర్ణయిస్తాడు. మరోవైపు, అతని సమస్య రాబోయే ప్రపంచం. ఈ ప్రయోజనం కోసం, ఎదోమీయులు (రోమన్లు) మనిషిని ఒబ్లివియన్ నుండి రక్షించడానికి క్రైస్తవ సిద్దాంతాన్ని స్వీకరించారు. రాబోయే ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని వాగ్దానం చేశారు.
మన తోరా భాగమైన, తోల్దోత్, యాకోబు మరియు ఏసావులు తమను తాము పరిపూర్నూలు చేసుకోవడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తుంది. యాకోబు, చివరికి అబ్రాహాము ఆశీర్వాదాన్ని మాత్రమే కాకుండా, ఏశావు ఆశీర్వాదాన్ని కూడా పొందడం ద్వారా, చివరికి ఆధ్యాత్మికంగా కొంత బలహీనుడైన యాకోబు మాత్రమే కాక, ఇశ్రాయేలు కూడా అవుతాడు.
ఈ మార్పు ఎలా సంభవించింది? ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా, యాకోబు ఏసావు యొక్క ఆశీర్వాదంతో కలిసిపోయినప్పుడు 'ఇశ్రాయేల్' అని పిలవబడటానికి అర్హుడు అవుతాడు.