"కి తిసా" అను తోరా భాగము సంక్షోభాన్ని తెలియజేయు పరష. ఇది వెల్లడిచేయు ప్రక్రియలో సంక్షోభం గల పరష.ప్రారంభంలో, దేవుడు నిబంధన పలకలను ఇచ్చినప్పుడు, ప్రతిదీ సక్రమంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికి, ఇశ్రాయేల్ ప్రజలు, బంగారు దూడను తయారు చేయడం దానిని పూజించి అర్పణలు అర్పించడం ద్వారా నిరూపితమైన విధంగా, వారు ఆశించిన స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉందని మనము గ్రహిస్తాము. ఆజ్ఞలుగల పలకలు పగిలిపోవడానికి ఇది దారితీస్తుంది. కానీ దీనికి ఒక నివారణ ఉంది;ఈ చర్యలన్నిటి తరువాత, క్షమాపణ మరియు ప్రాయశ్చిత్తం కొరకు వేడుకోవడాన్ని బట్టి రెండవ సారి ఆజ్ఞలుగల పలకలు అనుగ్రహింపబడం అనేది, తప్పులను సరిదిద్దుకోవచ్చనే విషయాన్ని నేర్పిస్తుంది. తప్పులున్నప్పటికీ వాటిని సరిదిద్దుకోవచ్చనేదే ని మన పరష యొక్క సారాంశం.
అసలు ఈ బంగారు దూడను చేయడం అనే తప్పిదము ఎలా జరిగింది? ఇది చాలా సింపుల్: మోషే మరియు అహరోనులు ఇద్దరు కలిసి పనిచేయడానికి బాగా అలవాటుపడ్డారు - మోషే గారు ప్రత్యక్షమైన మార్గానికి ప్రతీకగా వుండగా పాపం చేసిన వారికి దిద్దుబాటును తెలియపరచు మార్గానికి అహరోనుగారు నిదర్శనంగా ఉన్నారు.కానీ మోషే గారు పర్వత శిఖరం పైన వుండి అహరోనుగారు క్రింద వున్నప్పుడు అసలు ఏం జరిగింది? మోషే మరియు అహరోనులమధ్య సంబంధంలో చిన్న దూరం యేర్పడడం, ప్రజలు పాపము చేయడానికి తనను అడగడమనే పరిస్థితిలోకి అహరోను వెళ్ళడం జరిగింది. తన శిష్యుడు తడబడుతున్నప్పుడు ఒక గురువు యేమి చేయాలి?ఒక అవహాశం యేమిటంటే, “ నేను ఈ తప్పిదంతో ఏకీభవించను”;“నేను సత్యాన్ని స్తాపించాను, అంతే”అని చెప్పడం. ఇది ఒక అవకాశం. యాజకుడైన ఆహారోను యొక్క బొధనా ప్రణాళిక భిన్నమైనది. మనము పాపాత్మునితో కలిసి వారి పాపములో పాలుపంచుకొని ఆతరువాత వారిని ఉన్నతస్థాయికి తీసుకురావాలి అని అతను చెబుతాడు. ఈ బోధనా విధానంలో ప్రమాదం ఉంది, అయితే ఇది, జీవులను ప్రేమించి, వాటిని తోరాకు దగ్గరగా తీసుకువచ్చిన యాజకుడైన అహరోను అని కూడా ఆయన గురించి చెప్పబడింది.
మోషే గారి ద్వారా ఇవ్వబడినతోరా యొక్క ప్రాధమిక సూత్రాల విషయంలో అహరోనుగారు ఏమాత్రం రాజీ పడలేదు. అయినప్పటికీ పాపులను ఏవిధంగా సమీపించాలో అతనికి తెలుసు. దీనిద్వారా, మనం తరతరాలకు నేర్చుకుంటాం. సాధారణంగా దైవ సందేశాన్ని మరియు బోధనా సందేశాన్ని అందించేటప్పుడు,రెండు మార్గాలను అవలంబించాల్సిన అవసరం ఎల్లాప్పుడు వుంది. మోషే గారు పర్వతమునుండి క్రిందికి దిగివచ్చి దూడను దహించినట్లు, కచ్చితమైన సత్యాన్ని బోధించే విధానం ఒకటి. దీనికి పూర్తి భిన్నంగా,రెండవ మార్గంలో వ్యక్తి యొక్క చర్యలలో కొంత వరకు ఎలా పాల్గొనాలో తెలుసుకోవడం మరియు వాటిని పెంచడం మరియు సరిదిద్దడం వంటివి ఉంటాయి.మోషే మరియు అహరోను మధ్య పరష సమయంలో ఏర్పడిన అనుబంధం, ఈ కాంబినేషన్ చివరికి గెలిచి, ప్రపంచానికి దిద్దుబాటును తీసుకురావడం జరిగింది.మీ సూత్రాలకు కట్టుబడి ఉంటూ సౌకర్యవంతమైన మార్గంలో లేని వ్యక్తులతో మీరు ఎలా సన్నిహితంగా ఉండగలరు?