ఇశ్రాయేలు ప్రజల ఏర్పాటు యొక్క కథను చెప్పే ఆధికాండ గ్రంధమునకు భిన్నంగా, నిర్గమ కాండ గ్రంధము ఇశ్రాయేలియులలో దైవిక ఉనికి అభివ్యక్తమవ్వడాన్ని వివరిస్తుంది. అంటే, దేశం లోపల ఉన్న దైవిక ఉనికి, అది తదనంతరం మొత్తం ప్రపంచానికి ప్రసరిస్తుంది. ఈ విధంగా, ఈ పుస్తకం (నిర్గమకాండము) పెకుడెయి యొక్క భాగంతో ముగుస్తుంది, ఇది ప్రత్యక్ష గుడారంలోని దైవిక ఉనికి యొక్క ప్రేరణను వర్ణిస్తుంది. ఏ గుడారాన్ని సూచిస్తారు? ఇశ్రాయేలీయులు ఇంకా ఎడారిలో ఉన్నారు. ఇంకా యరుషలేము చేరుకోలేదు కాబట్టి ఇది, "మిష్కాన్" అనగా ప్రయాణపు గుడారము.
ఒక ప్రశ్న తలెత్తుతుంది: మేము ఇక్కడ నుండి ముందుకు ఎలా కొనసాగాలి? ఇక్కడ, తోరా యొక్క కాలక్రమానుసారం మనకు ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది: మనకు రెండు సమకాలీన పుస్తకాలు ఉన్నాయి: లేవీయకాండము మరియు సంఖ్యాకాండము.
లేవికాండ గ్రంథం ప్రత్యక్షపు గుడారములోని పెకుదేయి భాగంలో దైవిక ఉనికిని ప్రేరేపించిన వెంటనే జరుగుతుంది. ఇశ్రాయేలీయులు కదలకుండా ఉండగా, లేవికాండ గ్రంథం మొత్తం సీనాయి పర్వతం పాదాల వద్ద సంభవిస్తుంది. ఇంతలో, సంఖ్య కాండ గ్రంధము అనేది ఎడారి గుండా ఇశ్రాయేలు ప్రజల నిరంతర ప్రయాణం చేస్తున్నప్పటి గ్రంధం. కాలక్రమానుసారంగా ఉన్నప్పటికీ, ఈ రెండు గ్రంధాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి.
దీన్ని మనం నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి? మన తోరా భాగం- పెకుదేయి భాగం చివరిలో, ప్రత్యక్షపు గుడారం గురించి ఇలా వ్రాయబడింది: "మరియు మేఘము గుడారమును కప్పివేసెను, మరియు ప్రభువు మహిమ మిష్కాన్‌ను నింపెను, మరియు మోషే లోపలికి ప్రవేశించలేకపోయెను. ఎందుకనగా ప్రత్యక్షపు గుడారము మేఘముతో ఆవరించేను మరియు ప్రభువు మహిమ మిష్కాన్ (అంటే గుడారం)ని నింపియుండెను." ఈ పరిస్థితి శాశ్వతమైనది; గుడారాన్ని నింపివుంచిన ప్రభువు మహిమ - అగ్ని. గుడారాన్ని ఆవరించిన మేఘం- నీరు.
కాబట్టి, మునుపటి పేరాలో పేర్కొన్న వచనం లేవీకాండమునకు ఉపోధ్గాతము. దైవిక సన్నిధి నివసించిన తరువాత, పవిత్రుడు, స్తుతిపాత్రుడైన దేవుడు, మోషేను గుడారంలోకి పిలిచి, అతనికి బలుల నియమాలను తెలియజేశాడు. కానీ, వెంటనే, "మిష్కాన్ మీద నుండి మేఘం పైకి లేచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణాలకు బయలుదేరారు" అని చెప్పబడింది. ఇది సంఖ్యకాండమునకు ఉపోధ్గాతం. "కానీ మేఘం పైకి లేవకపోతే, అది పైకి లేచే రోజు వరకు వారు బయలుదేరలేదు. ఎందుకంటే ప్రభువు యొక్క మేఘం పగటిపూట మిష్కాన్ మీద ఉంది, మరియు రాత్రి దానిలో అగ్ని, మొత్తం. ఇశ్రాయేలు ఇంటివారి కళ్ళ ముందు తమ ప్రయాణాలన్నింటిలోను ఉండెను." ఇశ్రాయేలీయులందరి కళ్లముందు ఉందా? ఇది తోరాలోని చివరి వచనం గురించి మనకు గుర్తు చేస్తుంది, ఆ వచనం "ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు" అనే పదాలతో ముగుస్తుంది.
కాబట్టి, అలా అయితే, తోరాను అక్కడ ముగించడం సాధ్యమయ్యేది. కానీ తోరా మరో రెండు పదాలను జతచేస్తుంది, " ఇశ్రాయేలు ఇంటి వారిఅందరి ప్రయాణాలన్నిటిలో వారి కళ్ళ ముందు," అంటే, ప్రత్యేక్ష గుడారం దాని తుది స్థానంలో కాకుండా తాత్కాలికంగా ఎడారిలో చేయబడింది. అందువల్ల, ఇది ఇంకా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. నిజమే, దైవసన్నిధి ప్రత్యేక్ష గుడారంలో పనిచేసింది, కానీ – అది ఇశ్రాయేల్ దేశానికి బదిలీ చేయబడాలి, మరియు ఈ అవసరం కారణంగా, వారు విశ్రాంతికి వచ్చి స్వాస్త్యాన్ని పొందుకోనెవరకు, తోరాలోని లెవీకాండము, సంఖ్యకాండము, ద్వితీయోపదేశకాండము అను గ్రంధాల ద్వారా మరింత కొనసాగింపు జరిగింది.