Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

లెక్కకు మించి: వ్యక్తిగత సామర్ధ్యం మరియు సామూహిక ఐక్యత

జనాభాను మనము ఎలా లెక్కిస్తాము ? అసలు వారిని ఎందుకు లెక్కిస్తాము? పరషత్ బమిద్బర్ లో ఇశ్రాయేలియులను లెక్కించవలసినదిగా మోషే ఆజ్ఞాపింపబడ్డాడు. లెక్కించడం అనే ప్రక్రియే దాని ఉద్దేశంలో ఒక ఐక్యపరచు విధానము. ఇది అర్హత ఉన్నవారిని సైన్యానికి సమకూర్చి, సామూహిక గుర్తింపును మరియు కారణాన్ని అందిస్తుంది. మోషే గారి దినాలలో, ఉద్దేశం యేమిటంటే ప్రత్యేక్ష గుడారమును నిలిపిన వింతనే, ఇశ్రాయేలియులు ఆ భూమిలోనికి ప్రవేశించి ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి సిద్దమౌతున్న సైనికులు వారి సైన్యపు పరిమాణం తెలుసుకోవడం కొరకు వారిని లెక్కించాల్సిన అవసరత ఉందన్న విషయం సహజంగానే గ్రహిస్తారు. అందుచేత తోరా మనలను లెక్కించవలసినదిగా నిర్దేశిస్తుంది.

ఈ లెక్కింపులో అనేక మర్మాలు బయల్పడతాయి. తోరాలో ఇవ్వబడిన సంఖ్యలు గమేత్రియా(సంఖ్యా విలువ)యందు నిగూఢమైన అర్ధాలను కలిగివుంది. అయితే జనాభా లెక్కింపు అనే విషయానికి వ్యక్తిగతీకరించే ప్రభావం వుంది. ఒకరికి ఎదుట 100 మందిగల  బృందం ఉన్నారని అనుకుందాం. ఒకరు వెళ్లిపోతే, మరొకరు అతని స్థానాన్ని బర్తీచేస్తే , ఆ సంఖ్య అలాగే ఉంటుంది. అందువల్ల, వ్యక్తికి ప్రాముఖ్యత ఉండక సామూహానికి మాత్రమే ఉంటుంది.  ఈ ధోరణి తరచుగా నిరంకుశ పాలనలతో ముడిపడి ఉంటుంది, ఇక్కడ మొత్తం జనాభా ముఖ్యమైనది కానీ వ్యక్తులు ముఖ్యమైనవిగా పరిగణించబడరు.

దీనికి విరుద్ధంగా, వ్యక్తిగత దృక్పథం కూడా ఉంది. కొన్ని నాగరికతలు వ్యక్తికి ప్రాధాన్యతనిస్తాయి, ప్రతి వ్యక్తి పేరును ముఖ్యమైనవిగా పరిగణిస్తాయి – వారు  యోస్సీ, డేవిడ్, ఎస్తేర్ లేదా సారా అని పిలువబడినప్పటికి. ప్రతి వ్యక్తికి ఒక .ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, దానిని భర్తీ చేయలేము

.ఇది చరిత్ర అంతటిలో  సామూహిక మరియు వ్యక్తివాద సమాజాల మధ్య గణనీయమైన వైరుధ్యాలను సృష్టించింది

?తోరా యొక్క స్థానం ఏమిటి  

తోరా ఇశ్రాయేలీయులను లెక్కించమని కోరినప్పుడు, అది చాలా ప్రత్యేకమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంది: ఇశ్రాయెలియుల సర్వ సమాజమంతటి సంఖ్యను తీసుకొనుము. వారి పితరుల కుటుంబముల చొప్పున వారి యొక్క పేర్ల సంఖ్య చొప్పున ప్రతి పురుషునై తలలను లెక్కించవలెను. (బమిద్బర్ 1:2)

కాబట్టి, అది ఒక సాధారణమైన సంఖ్యెకాక నిర్ధిష్టమైన పేరు కూడా అని అర్ధం చేసుకోవాలి. మరొక మాటలో, తోరా మనము బోధించేది యేమిటంటే సమూహము మరియు వ్యక్తి మధ్యలో స్పర్ధ ఉండకూడదు. ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వాటిని కలిగి ఉన్నప్పుడు బృందము  నిజంగా సమిష్టిగా ఉంటుంది. మరియు సామాజిక  జీవితంలో పాల్గొనకుండా వ్యక్తికి నిజమైన అర్ధం ఉండదు. సమాజము మరియు వ్యక్తికి మధ్య సామరస్యతతో కూడిన సమతూకమే నిజమైన ఐక్యతకు అర్ధాన్ని తీసుకువస్తుంది. 

మన పండితులు దీనిని లేఖన వ్యాఖ్యానంలో ఒక సూత్రంగా రూపొందించారు: "నిర్దిష్టీకరణ అవసరమయ్యే "సాధారణీకరణ మరియు సాధారణీకరణ అవసరమయ్యే నిర్దిష్టీకరణ.

సాధారణ నియమాన్ని నిర్వచించడానికి నిర్దిష్ట వివరాలు అవసరం మరియు నిర్దిష్ట వివరాలకు వాటిని అర్థం చేసుకోవడానికి సాధారణ నియమం అవసరం. చెట్టు మరియు దాని కొమ్మల వలె, చెట్టు (సాధారణ నియమం) శాఖలకు (నిర్దిష్ట వివరాలు) సహకరిస్తాయి, మరియు శాఖలు చెట్టు యొక్క రూపాన్ని పూర్తి చేస్తాయి. నిర్దిష్ట వివరాలు లేని సాధారణ నియమం అర్థరహితం మరియు సాధారణ నియమం లేని నిర్దిష్ట వివరాలు సందర్భానికి విరుద్దంగా ఉంటాయి. అవి రెండూ కలిసి, ఒక పూర్తి  రూపాన్ని ఇస్తాయి.

రెండింటికీ ఉన్నతమైన అర్థాన్ని మరియు ప్రయోజనాన్ని అందించడానికి మనం వ్యక్తివాద మరియు సామూహిక విధానాలను అధిగమించడం పూర్తి ఐక్యత కొరకు అవసరం.

More Weekly Portions

దైవిక మార్గదర్శకత్వం మరియు మానవ స్వరాలు: న్యాయ విధుల ఏర్పాటు

పరషత్ పీనెహాసు లో, సెలోపెహదు కుమార్తెలు యూదుల వారసత్వ చట్టాలలో ఒక కీలకమైన మార్పును ప్రేరేపించారు, ఇది కుమారులు లేనప్పుడు కుమార్తెలు వారసత్వంగా పొందడానికి అనుమతించే కొత్త ఆదేశాలకు దారితీసింది. ఈ కథనం దైవ మార్గదర్శకత్వం మరియు ప్రజల చొరవ మధ్య క్రియాశీలకమైన పరస్పర చర్యను వివరిస్తుంది. మొదట్లో అస్పష్టంగా ఉన్న మోషేకు, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే హాషెమ్ గారి నుండి నుంచి ఆదేశాలు అందాయి. ఈ కథ, ఇలాంటి వ్యాజ్యాలతో పాటు, మతపరమైన విచారణ మరియు ప్రతిస్పందన ద్వారా యూదుల చట్టం మరియు దైవ వెల్లడి యొక్క పరిణామంలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రశంస మరియు అసూయ : బాలాము ప్రవచనము లోని ద్వంద్వ స్వభావం

పరషత్ బాలక్‌లో, దేశాలలో ప్రసిద్ధి చెందిన ప్రవక్త అయిన బిలామ్ ఇశ్రాయేల్ పట్ల అభిమానం మరియు అసూయ యొక్క సంక్లిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ను  శపించాలనే ఉద్దేశ్యంతో, అతను చివరికి వారిని ఆశీర్వదిస్తాడు, దైవిక ప్రేరణ మరియు ప్రవచనం యొక్క ప్రభావాన్ని వివరిస్తాడు. ఈ విరుద్ధమైన వైఖరి యూదు వ్యతిరేకత యొక్క విస్తృత థీమ్‌లను మరియు ఇష్టపడే పిల్లల మనోవిశ్లేషణ ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. తోరా విశ్వాసాన్ని నొక్కిచెబుతుంది, ఎందుకంటే ప్రార్థనా మందిరంలో మననం చేసే ప్రవచనం,యావత్ మానవాళిపై బలమైన దైవిక ప్రభావాన్ని సూచిస్తుంది, పవిత్రాత్మ పొందుకోవడానికి సర్వమానవాలికీ వున్న అవకాశాన్ని మిడ్రాష్ తన్నా దెబే ఎలియాహు యొక్క దృక్పథం ద్వారా నొక్కిచెబుతుంది.

మరణం నుండి నిత్యత్వం వరకు: శుద్ధికరణకు ఎర్రని పెయ్య మార్గము

పర్షత్ హుకత్ లో, ఎర్ర ఆవు (పారా అదుమా) ఆచారం మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క పాపంలో పాతుకుపోయిన మరణం యొక్క మలినాల నుండి శుద్ధిని సూచిస్తుంది. ఈ ఆచారంలో బూడిదను సజీవ నీటితో కలపడం, శరీరానికి మరియు ఆత్మకు ప్రాతినిధ్యం వహించడం, పునరుత్థానం ద్వారా జీవిత పునరుద్ధరణను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ, దాని ప్రతీకాత్మక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక దైవిక రహస్యాన్ని నొక్కిచెబుతుంది - జీవితం మరియు మరణం మధ్య పరివర్తన మానవ అవగాహనకు అతీతంగా ఉంటుంది. మిద్రాష్ ఎర్ర ఆవు యొక్క రహస్యాన్ని హైలైట్ చేస్తుంది, పునరుత్థానం మరియు దైవ సంకల్పం యొక్క లోతైన మరియు అస్పష్టమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది.

Search