లేవీయకాండము అర్పణల గ్రంధము మరియు కోహెన్ యొక్క గ్రంధము (యాజకత్వపు గ్రంధము) అని కూడా పిలువబడుతుంది. ముఖ్యంగా వాయిక్రా పరాషా భాగం ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది: బలి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మొదటి చూపులో, ఇది పురాతన కాలం యొక్కఆనవాలుగా అనిపిస్తుంది, ఆ కాలంలో బలిఅర్పణలకు ఒక అర్థం ఉంది. అయితే, మన కాల౦లో దేవాలయ౦ నిర్మి౦చబడుతు౦డడ౦తో భవిష్యత్తులో బలిఅర్పణలతో కూడిన దైవసేవ పునరుద్ధరి౦చబడాలని మన౦ ఎ౦దుకు ఎదురుచూస్తాం? బలి యర్పరణలను తిరిగి ప్రారంభిస్తామా?
దీన్ని అర్థ౦ చేసుకోవడానికి మన౦ ఈ వచనాలను జాగ్రత్తగా పరిశీలి౦చాలి: " నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీలో ఎవరైనను దేవునికి బలి అర్పించునప్పుడు," ఈ వచనాన్ని నిష్పాక్షిక౦గా పరిశీలిస్తే, ఒక వ్యక్తి బలిపీఠానికి తీసుకువచ్చేది జంతువును కాదుగాని, తనను తాను అర్పి౦చుకోవాలనుకు౦టున్నాడని అర్థ౦ చేసుకోవచ్చు. “మీలో ఎవరైనను దేవునికి బలి అర్పించునప్పుడు," ఆ అర్పణ ఎవరు లేదా ఏమిటైయుంటుంది? మరి దాని ప్రతిఫలం ఏమౌతుంది? ఒక వ్యక్తి తనను తాను అర్పించుకోవాలనుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? “మీరు మీ బలులను తెచ్చునప్పుడు, జంతువుల నుండి, పశువుల నుండి లేదా మంద నుండి తీసుకుని రావలెను.” మరో మాటలో చెప్పాలంటే, బలిఅర్పణ, వ్యక్తికి ప్రత్యామ్నాయం అని మనం నేర్చుకుంటాము. మనిషి తనకు ప్రత్యామ్నాయంగా ఒక జంతువును బలి ఇస్తాడు. పాపము వలన, అతను తనను తాను త్యాగం చేయవలసి వచ్చింది, మరియు అతను అర్పణ ద్వారా విమోచించబడ్డాడు. ఇస్సాకును బంధిచిన కథ ఆధారంగా ఇశ్రాయేలియుల ధర్మశాస్త్రపు విస్తృత భావంలో దీనికి ఒక సారూప్యత ఉంది. న్యాయం అనే లక్షణానికి ప్రతిరూపంగావున్న ఇస్సాకు, తనను తాను త్యాగం చేచేసుకోవాలనుకుంటాడు. ఇస్సాకుకు తన తీవ్రమైన కోరిక, ఆధ్యాత్మిక తృష్ణ మరియు దేవునికొరకైనా తపన కారణంగా బలిపీఠంపై బలి ఇవ్వబడడానికి ఎటువంటి సమస్య లేదు.
పర్యవసానంగా, ఇస్సాకు తనను తాను అర్పించుకోవాలని కోరుకుంటాడు. అలాగైతే, ఏ వ్యక్తి అయినా ఏదో ఒక సమయంలో దేవునికి దగ్గరవ్వాలని కోరుకుంటాడు, అందువలనే "మీలో ఎవరైనా ప్రభువుకు అర్పణ తీసుకువచ్చినప్పుడు" అనే వాక్యం చెప్పబడింది. కానీ ఇస్సాకు బంధనం భాగంలోవలె, త్యాగం చేయవద్దని చెప్పబడింది; సర్వశక్తిమంతుడు మానవ బలిని కోరుకోడు; మనిషి బతకాలని కోరుకుంటాడు. అందువలన, ఆయన ఇస్సాకు స్థానంలో గొర్రెను ప్రసాదించాడు.
అదేవిధంగా, దేవునికి బలి కావాలని మనం కోరికను వ్యక్తపరిచ్చాము అంటే, అది ఖచ్చితంగా జీవించవలసిన సమయమే. ప్రాణత్యాగానికి సిద్ధపడేవాడు - జీవితం ముఖ్యమని దీని ద్వారా వ్యక్తపరుస్తాడు. కాబట్టి, "పశువుల ను౦డి, గొర్రెల మంద ను౦డి, మేకల మంద ను౦డి నీ అర్పణను తీసుకురావలెను" అని చెప్పబడింది.
బలి సంబందిత నియమాలలో చాలా వివరాలు ఉన్నాయి; అయితే వాటిలో ఒకదానిపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు దేశపు జ్ఞానులైన సన్హెడ్రిన్ తప్పుగా న్యాయనిర్దేశనం చేసినప్పుడు ఎద్దును అర్పించడం గురించి ఒక హలాఖా (యూదు చట్టం) ఉంది. అలాంటప్పుడు ఈ విధమైన బలి చేయడం ఏమిటనేది పెద్ద ప్రశ్న.
దీని నుండి ఒక కీలకమైన విషయం ఉత్పన్నమౌతుంది : జ్ఞానులు కూడా పొరపాటు పడగలరు. తప్పులు చేయని ఏ వ్యక్తినీ తోరాహ్ దేవుడని పొగడదు. మన బోధకుడైన మోషే కూడా ఒక తప్పు చేశాడు, అది తోరాలో ప్రస్తావించబడింది. మనలను ఏది బాద్యులను చేస్తుందో, ఏవి నైతికత నియమాలో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని దైవం చేయకూడదు; కేవలము ‘స్తుతిపాత్రుడు పరిశుద్ధుడైనవాడు’ మాత్రమే దోషరహితుడు, అయితే మానవుడే తప్పు చేయగలడు.