Search

లెక్కకు మించి: వ్యక్తిగత సామర్ధ్యం మరియు సామూహిక ఐక్యత

పరషత్ బమిద్బార్ సైన్యానికి అర్హులైన వారిపై దృష్టి సారిస్తూ ఇశ్రాయేలియులను లెక్కించాలనే ఆజ్ఞను చర్చిస్తుంది. ఈ గణన సామూహిక మరియు వ్యక్తిగత గుర్తింపుల మధ్య ఉద్రిక్తతను నొక్కి చెబుతుంది. తోరా "పేర్ల సంఖ్య" అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తుంది, ఇది సామూహిక మరియు వ్యక్తి రెండింటి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకత ద్వారా సామూహిక అర్థాన్ని పొందడంతో పాటు, నిజమైన ఐక్యత ఈ అంశాలను మిళితం చేస్తుందని తోరా బోధిస్తుంది. ఈ భావన లేఖనాల వివరణలో "సాధారణీకరణ మరియు వివరణ" సూత్రంలో ప్రతిబింబిస్తుంది, సంఖ్యలలో దాగిన  అర్థాలతో, గమాట్రియా ద్వారా అన్వేషించబడింది.

లెహ్హ్ లెహ్హా / నీవలే, నీయంతట నీవు వెళ్ళి ప్రభావితం చెయ్

ఒక వ్యక్తి అనేక జాతులకు ఎలా తండ్రి కాగలడు? క్లుప్తంగా చెప్పాలంటే తన ప్రత్యేకతను కాపాడుకోవడం ద్వారా కాగలడు. ఆశ్చర్యకరంగా, ప్రత్యేకించి సున్నతి పొందుట ద్వారా అబ్రహాము అనేక జాతులకు తండ్రి అవుతాడు అని చెప్పబడింది. సున్నతి అనేది  అతనిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మిగిలిన ప్రపంచం నుండి వేరు చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మనం నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటే, మనం కొంత ప్రత్యేకతను  మరియు నిర్ధిష్టతను  కొనసాగించాలని నేర్చుకోవచ్చు. యూదులుగా మనకున్న  ప్రత్యేకత, మన స్వంత గుర్తింపును మనం సంరక్షించునోవడం అనేదే, మనం "అనేక దేశాలకు తండ్రి"గా ఉండేలా చేస్తుంది.  ప్రపంచంలోని సంస్కృతులలో సమ్మేళనం అయ్యే విధానం ద్వారా మనం ప్రభావితం చేయవొచ్చు అనే టెంప్టేషన్‌కు ఇది వ్యతిరేకమైన విధానం. "మనలోకి మనం తిరిగి రావడం" ద్వారా మనం ప్రపంచమంతటికీ ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తామని తోరా మనకు తెలియజేస్తుంది.

Search