యోమ్ కిప్పూర్ సృష్టికర్తకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు, పొరుగువారి విషయంలో చేసిన అతిక్రమణలకు వారినుండి క్షమాపణ కోరడం మరింత అవసరం. సృష్టికర్తపై నమ్మకం మనల్ని భువినుండి దివికి కనెక్షన్ కలుపుతుంది, కానీ తోటివారి పట్ల మన క్రియలు/ప్రవర్తన మన సమాంతర సంబంధాలను కలుపుతుంది. తోరా యొక్క లోతైన వచనం, "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను; నేను దేవుడను." అనే కోణాలను పెనవేసుకుంది. ఒకే సృష్టికర్తను నిజంగా విశ్వసించాలంటే, మన పరస్పర చర్యలలో మనము దయ మరియు నైతికతను కలిగి ఉండాలి. ఎందుకంటే 'నేను దేవుడిని' అనే ఆజ్ఞలో దైవాన్ని మాత్రమే కాకుండా మన పక్కన ఉన్న వ్యక్తిని కూడా ప్రేమించమని ఆజ్ఞాపిస్తుంది. ఈ సమతుల్యత విశ్వాసము మరియు ప్రవర్తనకు వారధిలా వుండి నిజమైన నైతిక ప్రవర్తనకు దారి తీస్తుంది.