యోమ్ కిప్పూర్ నందు ఉపవాసం, ప్రార్థన మరియు దాతృత్వం ద్వారా ఒక వ్యక్తికి మరియు సృష్టికర్తకు మధ్య జరిగిన అతిక్రమణలను క్షమించమని సృష్టికర్త నుండి క్షమాపణ కోరవచ్చని ఓరల్ తోరా మనకు బోధిస్తుంది. మరోవైపు, ఒక వ్యక్తికి మరియు అతని స్నేహితుడికి మధ్య అతిక్రమణలు జరిగినప్పుడు యోమ్ కిప్పూర్ రోజున సృష్టికర్తను క్షమాపణ కోరితే సరిపోదు; బాధితుడి నుండి క్షమాపణ పొందాలి.
‘నా ప్రవర్తన నేను నిజంగా నమ్మేదానిని ప్రతిబింబిస్తుంది’.
సృష్టికర్తపై విశ్వాసం అనేది మనిషికి – దేవునికి మధ్య ఒక కోణానికి చెందినదిగా కనిపిస్తుంది. అయితే, ఒక వ్యక్తికి మరొకరికి మధ్య సంబంధం విషయంలో ‘నేను ఇతరులతో ఎలా వ్యవహరిస్తాను మరియు వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తిస్తాను అనేది వేరే కోణానికి చెందినది అనుకుంటే - అది తప్పుడు అవగాహన!
తోరాలోని ఫేమస్ వచనం: "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను; నేను దేవుడను." ఈ వచనం ఈ రెండు కోణాల మధ్య గల ముఖ్యమైన సంబంధాన్ని వెల్లడిస్తుంది. ఇది ఈ రెండు కోణాల మధ్య కేవలం కనెక్షన్ మాత్రమే కాదు, అంత కంటే ఎక్కువ అని చెప్పవచ్చు.
ఒక వ్యక్తి ఇతరుల పట్ల నైతికంగా ప్రవర్తించనప్పుడు, మనమందరం ఒకే సృష్టికర్త యొక్క సృష్టి అని అతను నమ్ముతాడా?
ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక మనిషిగా, ఒక సజీవ ఆత్మగా, అతను నమ్మే దానిని వెల్లడిస్తుంది. ఈ వచనం మనకు బోధించేది కూడా ఇదే: "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము" అని, ఎందుకు అలా ప్రవర్తించాలి? దీనికి కారణం "నేను దేవుడు." అని వ్రాయబడింది. ఈ ఆజ్ఞ మనలను సృష్టించి మనకు జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్త నుండి వచ్చింది. అలాగే, నా పక్కనే ఉన్న తోటివ్యక్తి కూడా వచ్చాడు.
మనం ఈ విధంగా ఆలోచించినప్పుడు, సహజంగానే, ఇతరుల పట్ల మన ప్రవర్తన నైతికంగా ఉంటుంది.
[నమ్మకం మరియు ప్రవర్తన మధ్య పవిత్రమైన పరస్పర చర్య]