ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలని ఆజ్ఞ ఉంది, అది ఏ ప్రయోజనం కొరకు పవిత్రపరచబడింది ? "వారు నన్ను పరిశుద్ధాలయముగా చేసుకొందురు, నేను వారి మధ్య నివశించుదును." ప్రత్యక్షపు గుడారం అనేది సృష్టికి మరియు సృష్టికర్తకు మధ్య ప్రత్యక్ష కలయికకు అవకాశంకల్పిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన చారిత్రక దృగ్విషయం. చరిత్ర అంతటా, విశ్వాధిపతి ప్రకృతి వెనుక దాక్కుంటాడు, కాని ఒక ప్రదేశంలో పురోగతి ఉంది.
మనిషి యొక్క చేతన ప్రపంచమే ప్రత్యక్షపు గుడారం వున్న ప్రదేశం. "వారు నాకు ఒక ప్రత్యక్షపు గుడారంగా చేయనిమ్ము." "వారి మధ్య" "నేను నివసించుదును" అని చెప్పబడుతుంది గాని "దాని లోపల" అని చెప్పబడలేదు. పరిశుద్ధుడు ఆశీర్వదించబడినవాడగు ఆయన మనలో ఎలా నివసిస్తాడు? లేఖన౦ ఇలా కొనసాగిస్తు౦ది: "నేను మీకు చూపి౦చిన దాని ప్రకార౦, ప్రత్యక్షపు గుడారం నమూనా, దాని పాత్రల నమూనాలను ; మీరు చేయవలెను." ఆధునిక హీబ్రూ భాషలో, "నేను మీకు చూపించిన దాని ప్రకారం" అంటే నేను మిమ్మల్ని ఇతరులకు చూపిస్తాను అని అర్ధం. వాస్తవానికి, తోరా భాషలో, "నేను నిన్ను చూపిస్తాను" అనే పదం కూడా " నేను మీకు చూపిస్తాను" అని సూచిస్తుంది, కానీ అదే "నేను మిమ్మల్ని ఇతరులకు చూపిస్తాను" అనే అర్థం కూడా కలిగి ఉంది. "ప్రత్యక్షపు గుడారం (మిష్కాన్) యొక్క నమూనా మరియు దానిలోని అన్ని పాత్రల నమూనా" అనేది ఉంది. మిష్కాన్ యొక్క ఆకృతి మోషే గారి ఆత్మ యొక్క ఆకృతి వంటిది. గుడార౦ యొక్క నమూనా గురి౦చి ఆలోచి౦చేటప్పుడు, "అలా చేయవలెను" అనగా మోషేలా ఉ౦డాలి.
మరి గుడారంలో ఏముంది? మోషే ఆత్మ సారాంశం ఏమిటి? ఇది ఎలా నిర్మించబడింది? అతిపరిశుద్ధ స్థలం ఉంది, ప్రత్యక్షపు గుడారం ఉంది, ఆవరణ ఉంది. అతిపరిశుద్ధ స్థలంలో కెరూబులు ఉన్నాయి., మరియు అక్కడి నుండి, ప్రవచనం శాశ్వతంగా ఉద్భవిస్తుంది. ఒక వ్యక్తి యొక్క అంతరంగములోని అత్యంత పరిశుద్ధమైన ప్రదేశంలో, పై నుండి సందేశాలను స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. అత్యంత వాస్తవికమైన ప్రదేశమైన ప్రత్యక్షపు గుడారం లోపల, ఒక కరుణాపీఠము మరియు దీపవృక్షము ఉన్నాయి, మరియు అవి ఆర్థిక వ్యవస్థ మరియు జ్ఞానానికి ఆధారం.
అప్పుడు, వాస్తవిక నడతకు సంబందించిన స్థలమైన ఆలయ ఆవరణకు వెళతారు. ఆవరణలో ఏముంది? ఒక బలిపీఠం. బలిపీఠం మీద ఏం చేస్తారు? దానిపై జంతువులను అర్పిస్తారు , మరియు అవి పైకి ఆరోహణం అవుతాయి. మన పనులన్నీ దైవంవైపు లక్ష్య౦గా ఉ౦డాలని, "నీ పనులన్నీ పరలోక౦ కోస౦ ఉ౦డాలి" అని ఇది మనకు చెబుతో౦ది. కాబట్టి, మోషే ఆత్మలో ప్రత్యక్షమైన తిన్నని ఆత్మ నిర్మాణ౦ మనకు ఉ౦ది, ఇశ్రాయేలీయుల౦దరూ ఆయన ను౦డి నేర్చుకుని "మోషేవలె" ఉ౦డవచ్చు." అప్పుడు దైవ సన్నిధి మనలోను, ప్రతి వ్యక్తి హృదయంలోను నివసిస్తుంది.”