"నేను అబ్రాహాముకు, ఇస్సాకు మరియు యాకోబులకు ప్రత్య క్షమైతిని". అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులు ఎవరు ? ఒకసారి తోరాను చదివిన వారెవరికైనా అబ్రహం, ఇస్సాకు, యాకోబు అనేవారు పితరులనే విషయం తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ, "వాఏరా" (నేను ప్రత్యక్షమైతిని) అనే పదానికి రాషి గారు ఇచ్చిన వివరణ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ మనకు తెలియదని రాషి గారు ఏం చెబుతున్నారు? అది కాదు గాని , రాషి గారు " వాఏరా" అనే పదం నుండి ఉత్పన్నమయ్యే ఇబ్బందిని వివరించాలని భావిస్తున్నారు. ఎందుకంటే, "ఏ నరుడును నన్ను (దేవుడిని) చూసి బ్రతకడు" అని వ్రాయబడింది. మరలాంటప్పుడు హషెమ్ గారు " వాఏరా" (మరియు ప్రత్యక్షమైతిని) అని ఎలా చెబుతున్నారు?
వారు పితరులు అనేదే దీనికి సమాధానం. వారు పితరులు కాబట్టి, వారికి ఒక ప్రత్యేకమైన హక్కు ఉంది, అది వారు సృష్టికర్తతో "దర్శనం” పొంది ప్రత్యక్షంగా కలుసుకోవడానికి అనుమతినిచ్చింది. ఎలా? వారికి ఉన్న హక్కు తమ పిల్లల కోసం జీవించే హక్కు. ఒక వ్యక్తి తన తరంలో నెరవేరదని, తరువాత తరంలో మాత్రమే నెరవేరుతుందని, తనకు తెలిసి కూడా తన ధ్యేయం కోసం జీవించడానికి సిద్ధంగా ఉంటాడు. అదే పితరులకు వున్న హక్కు.
పిల్లలు అనగా ఇశ్రాయేలీయులమైన మన విషయానికొస్తే వారినిమిత్తం మనకు తోరా ఇవ్వబడింది. ఇశ్రాయేలీయుల ధ్యేయం ఇశ్రాయేల్ దేశంలోకి ప్రవేశించి దానిలో స్థిరపడాలని పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం. తమ జీవితకాలంలో నెరవేరని ధ్యేయం కోసం జీవించడాన్ని జీవించడం అనరు కాబట్టి, పితరులు నిజంగా జీవించలేదు. కాబట్టి "ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు" అనే వాక్యంతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వచనం కొనసాగుతూ, "ఆయన అబ్రహామునకు ఇస్సాకునకు, యాకోబుకు ఎల్ షద్దాయ్ గా కనిపించాడు" అని చెప్పబడింది. ఎల్ షద్దాయి అనగా వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాటిని నెరవేర్చే దేవుడు కాదు అని రాషి గారు వివరించారు.
మరి నా పేరెంటి?
అయేతే నా పేరు, ఎహ్ యే – అషెర్ - ఎహ్ యే – వాగ్దానాలు నెరవేర్చు దేవుడు.
చివరిలో – నేరు వారికి తెలియబడ లేదు. నిజంగాజే వారు నన్ను ఎరుగరు ఎందుకనగా “నేను వాగ్దానము చేసితిని గాని నెరవేర్చ లేదు.”
అందుచేత, పరషత్ వాఏరా ప్రారంభపు వచనాలలోనే, ఐగుప్తు నుండి విడుదలకు అవసరమైన సరియైన కారణాన్ని కనుగొంటాము. యెందుకని, పరిశుద్దుడు స్తుతిపాత్రుడైన దేవుడు, ఇశ్రాయేలియులను బానిసత్వము నుండి బయట పడవేయాలని నిర్ణయించుకున్నాడు? ఎందుకనగా ఆయన ఇంకా నెరవేర్చని వాగ్దానం ఒకటి వున్నది గనుక. ఆయన ఇశ్రాయేలు దేశమును మనకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుచేత ఆయన “మరియు నేను వాగ్దానం చేసిన దేశమునకు మిమ్మును రప్పించెదను” అని విమోచన సంబంధమైన మాటలను పలుకుతున్నారు. ఐగుప్తును విడిచివెళ్ళడం గురించిన మోషే ఫరోకు చెప్పే మాటలన్నీ అనగా బలులు అర్పించడానికొ మతపరమైన లేదా ఆధ్యాత్మిక కారణాల కోరాకో కాదు; అతను ఇశ్రాయేలీయులకు చెప్పినది కూడా కాదు. ఇశ్రాయేలీయులకు, అతను విమోచనకు సరైన కారణాన్ని వెల్లడించాడు, ఇది ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చి దానిలో స్థిరపాడాలని పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం.