ప్రపంచ వ్యాప్తంగా వున్న మా స్నేహితులందరికీ షలోమ్.
ఈ రోజు, మనము ఒక ప్రాముఖ్యమైన శీర్షికను ప్రారంభిస్తున్నాము. మనము నేను వ్రాసిన ఒక పుస్తకాన్ని అధ్యయనము చేయబోతున్నాము, అయితే ఈ శీర్షికలో కేవలం నేను పొందుపరిచిన విషయాలు మాత్రమే కాక, తరతరాలుగా వస్తున్న ఇశ్రాయేలు పండితుల బోధనలలోని విషయాలు కూడా ఇమిడి వుంటాయి.
ఈ పుస్తకాన్ని హిబ్రీ భాషలో “బ్రిత్ షాలోమ్” అని పేరు. మీ అందరికీ తెలిసినట్లుగా, ఈ పుస్తకం ఇప్పటికే 18 భాషలలోకి తర్జుమా చేయబడింది. ఈ పుస్తకు ప్రపంచ ప్రజలందరికీ ఉద్దేశింపబడిన యూదియా చట్టంగా వ్యవహరిస్తుంది. ఈ పుస్తకము “నోవహు సంతతి యొక్క షుల్హాన్ ఆరుఖ్” అని గుర్తింపబడుతుంది.
ఈ పుస్తకము చాలా చిన్నదైనప్పటికీ, ఇది అనేక అంశాలను కలిగి వుంది. ఈరోజు, మనము చట్టపరిధిలోకి రాని అంశంపై దృష్టి సారిద్దాం. నేను రాసిన ఉపోధ్గాతాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి, నేను ఇక్కడ యేమి చెప్పానో పరిశీలిద్దాం.
నేడు ప్రపంచ జనాభా షుమారు ఏడు బిలియన్లు. నేను దీనిని వ్రాసినప్పటినుండి, ఇప్పటికే ఎనిమిది బిలియన్లకు చేరువై యుంటాము. మానవాళి ఎన్నడూ ఇంత సంఖ్యకు చేరుకున్నది మునుపెన్నడూ లేదు. ఇంత గొప్ప జనాభాలో దాగి ఉన్న నిర్మాణాత్మక శక్తులు అపారమైనవి. అయితే, అదే సమయంలో, విధ్వంసక శక్తులు కూడా అంతే గొప్పవిగా వున్నాయి. నేడు, ప్రపంచం సానుకూల దిశలో అభివృద్ధి చెందగల పరిస్తితి లేదా చాలా తక్కువ సమయంలో నాశనం చేయగల పరిస్థితిలో మనం ఉన్నాము. అందువల్ల, ప్రమాదం మరియు గొప్ప సంభావ్యత రెండూ ఉన్న అతి ముఖ్యమైన చారిత్రక గాట్టంలో మనం ఉన్నాము. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది; ప్రజలు తమ శక్తులను నిజమైన ఆనందాన్ని నిర్మించే దిశగా నడిపిస్తారా లేదా తప్పుడు ఆనందాన్ని వెంబడించడం వల్ల కలిగే విధ్వంసం వైపా అనేది పూర్తిగా మానవ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
ఎటువంటి విలువలపై ఆధారపడి మనం జీవించాలి అన్న ప్రశ్నపై నేడు విపరీతమైన పోరాటం జరుగుతోంది. మరో మాటలో చెప్పాలంటే, సమకాలీన పోరాటాలు గతానికి భిన్నంగా ఉంటాయి. నేడు, యుద్ధం అధికారం గురించో ఎవరు నియంత్రీంచాలో, లేదా ఎవరు దోచుకోవాలో అణచివేయాలో అన్నదాని గూర్చి కాదు. మనం ఏ విలువలను అనుసరించాలి అనే దాని గురించి , పోరాటాలు జరుగుతున్నాయి. అవి ఉదారవాద పాశ్చాత్య ప్రజాస్వామ్యం యొక్క విలువలా, ఇస్లాం విలువలా లేదా తూర్పు ఆధ్యాత్మికత విలువలా? చాలా మంది పోటీదారులు తమ విలువలను అందిస్తున్నారు. ఈ పోరాటాన్ని సాధారణంగా నాగరికతల ఘర్షణగా సూచిస్తారు. పాశ్చాత్య ప్రపంచం మరియు ఇస్లామిక్ ప్రపంచం యొక్క వివిధ కోణాల మధ్య నెలకొన్న ప్రాథమిక యుద్ధం.
ప్రపంచంలో మరోవైపు నుండి ఫార్ ఈస్టర్న్ సంస్కృతి మరియు నూతన యుగ సంస్కృతి యొక్క స్థితి పెరుగుదల వంటి ఇతర ప్రక్రియలలో ఈ పోరాటం యొక్క మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి. గత కొన్ని శతాబ్దాలుగా మానవాళికి వచ్చిన ముఖ్యమైన మార్పులు, వాటిలో కొన్ని ప్రపంచాన్ని గుర్తించలేనంతగా అభివృద్ధి చేశాయి, గందరగోళం మరియు శూన్యతను కూడా సృష్టించాయి. రక్తసిక్తమైన ప్రపంచ యుద్ధాలు మానవాళికి అర్థవంతమైన భవిష్యత్తును కనుగొనలేమనే నిరాశను పెంచేశాయి.
ఇది నిరాశావాదంగా అనిపించినప్పటికీ, తదుపరిసారి, మనకు ఏ పరిష్కారం అందుబాటులో ఉంటుందో అన్వేషించడం కొనసాగిద్దాము.