షాలోం మరియు ఆశీస్సులు,
బ్రిత్షాలోమ్ అనే మొత్తం పుస్తకం అంతటా, మేము రెండు రకాల హలాఖాలను (యూదియ చట్టాలు) అందిస్తున్నాము. తప్పనిసరి హలాఖాలు ఉన్నాయి, అంటే పుస్తకంలో జాబితా చేయబడిన హలాఖాలకు ఒక నోవాహీయుడు కట్టుబడి ఉండాలి. ఏదేమైనా, నోవాహైడ్ ధర్మశాస్త్ర౦లో భాగ౦గా లేని అదనపు విషయాలు కూడా యూదు హలాఖాలో కనిపిస్తాయి. అయినప్పటికీ, ఈ పద్ధతులు తప్పనిసరి కానప్పటికీ, వాటిని అవలంబించడం మంచిదని సలహాలు ఇస్తున్నాము.
నేను ఈ విధంగా చెబుతున్నాను: " వారు దానికి దూరంగా ఉండేలా చూసుకోవడానికి, విగ్రహారాధనకు సంబంధించిన అనేక విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు నిషేధించబడ్డాయి, కానీ ఈ విషయాలు నోవాహీయులకు స్పష్టంగా నిషేధించబడలేదు. అయినప్పటికీ, సాధ్యమైనప్పుడు పాటించవలసిన మంచి ప్రవర్తనకు సంబంధించిన ఆచారాలు ఇవి."
ఇప్పుడు నేను కొన్ని సిఫారసు చేసిన పద్ధతుల జాబితా తెలియచేస్తాను. చెప్పినట్లుగా, ఇవి తప్పనిసరి కాదు. ఉదాహరణకు, విగ్రహారాధన గురించి పుస్తకాలు చదవడం నిషేధం. ఇశ్రాయేలీయులకు, రాంబామ్గారు (రబ్బీమోషే బెన్ మైమోనిడెస్) స్పష్టంగా చెప్పినట్లుగా, విగ్రహారాధకులు రాసిన విగ్రహారాధన ఆచారాల గురించి పుస్తకాలు చదవడం నిషిద్ధం. అయితే, కొన్నిసార్లు, ఒక వ్యక్తి మేధోపరమైన ఉత్సుకత వల్ల లేదామరీ ముఖ్యంగానోవాహీయుల మధ్య న్యాయాధిపతిగా పనిచేస్తే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో, వారు వీటి గిరించి తెలుసుకోవాలి. “ఈ నియమాలను బోధించే నోవాహీయ పండితులు ఈ జ్ఞానం కలిగిఉండడం సముచితమైనది.” విగ్రహారాధనతో సహా అన్ని విషయాలలో బాగా ప్రావీణ్యం ఉన్న ఇశ్రాయేలీయుల పండితులకు కూడా ఇది వర్తిస్తుంది.
మరొక ఉదాహరణ ఏమిటంటే, ఒక నిర్దిష్ట విగ్రహం అందంగా లేదా ఆకర్షణీయంగా ఉందని చెప్పడం వంటి మాటలతో విగ్రహారాధనను ప్రశంసించకపోవడం మంచిది. ఖచ్చితంగా, దాని గౌరవార్థం కొవ్వొత్తులను వెలిగించకూడదు లేదా అలంకరించకూడదు. ఏదేమైనా, ఈ చర్యలు విగ్రహారాధన ఆచారంలో భాగంగా ఉంటే (ఉదా. కొవ్వొత్తులు వెలిగించడం ఆరాధనను తెలిపే చర్య), అప్పుడు అది స్పష్టంగా నిషేధించబడింది.
కొవ్వొత్తి వెలిగించడం విగ్రహారాధనలో భాగమైతే, ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిషిద్ధం. ఇది కేవలం అలంకరణ లేదా పర్యాటక ప్రయోజనాల కోసం అయితే పర్యాటకులు కొవ్వొత్తులు వెలిగించే ఆచారాన్ని పాటించాలనుకుంటే ఇది సాంకేతికంగా అనుమతించబడింది కాని ఇప్పటికీ నివారించడం మంచిది.