షాలోం,
బ్రిత్ షాలోమ్ యొక్క మూడవ అధ్యాయం గురించి మనము అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాము.
మరోసారి విగ్రహారాధన (అవోదా జరా) నియమాల గురించి చర్చిస్తున్నాం. ఇక్కడ, మనం ఆరాధన మరియు విశ్వాసం మధ్య తేడాను గుర్తించాలి.
ఉదాహరణకి:
ఒక వ్యక్తి ఉద్దేశాపుర్వకంగా సూర్యుడిని ఆరాధిస్తే, అది విగ్రహారాధన అవుతుంది.
అయితే, ఎవరైనా సూర్యుడు ఒక దేవత అని నమ్మి, దానిని ఉద్దేశాపుర్వకంగా పూజించకపోతే, ఇది నిషేధం కిందకు రాదు.
సూర్యుడు వెచ్చదనాన్ని లేదా కాంతిని ప్రసాదిస్తాడని ఎవరైనా విశ్వసించడానికి అనుమతించబడినట్లే, ఈ నిషేధం వాస్తవ భౌతిక ఆరాధనకు మాత్రమే వర్తిస్తుంది.
13వ పేరాలో ఈ విషయం స్పష్టం చేయబడింది.
సృష్టికర్త కంటే తక్కువ హోదాలో ఉండి, భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగాఒక వ్యక్తి లేదా జాతి ఏదో ఒక శక్తి చేత పరిపాలించబడుతుందనే నమ్మకంఅది పూజించబడనంత వరకు నిషేధించబడదు.
అంటే వ్యక్తులను లేదా దేశాలను ప్రభావితం చేసే దేవదూత లేదా మరేదైనా అస్తిత్వం వంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఉనికిని విశ్వసించవచ్చు. అయితే, ఆ వ్యక్తిని ఆరాధించకూడదనే నిషేధం ఉంది. అంతిమంగా, ఆరాధన, గౌరవం మరియు భయభక్తులు లోక సృష్టికర్తకు మాత్రమే కేటాయించబడ్డాయి.
ఎనోష్ యొక్క పొరపాటు
రబ్బీల సంప్రదాయంలో వివరించినట్లుగా షేతు కుమారుడు, ఆదాము మనుమడు అయిన ఎనోష్ చేసిన పొరపాటు ఏమిటంటే, మానవాళి తనను(దేవునిని) గౌరవించినట్లే, శక్తి మరియు మహిమ కలిగిన తన సృష్టిని గౌరవించాలని దేవుడు కోరుకుంటున్నాడని అతని నమ్మకం. ఇది ఆయన చేసిన పొరపాటు. లోక సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయాలని యూదు ధర్మశాస్త్రం స్పష్టం చేస్తుంది.
ద్వంద్వవాదంపై విశ్వాసం
ద్వంద్వ విశ్వాసాలు (ద్వంద్వవాదం) గురించి ఏమిటి? దీనికి సంబంధించి ఇలా రాశారు.
"సమస్త సృష్టికర్త కాక లోకమంతటికీ ఒక దేవుడు ఉన్నాడని భావించే వ్యక్తిని 'మౌలిక సూత్రాన్ని ధిక్కరించినవాడు' అంటారు."
దీని అర్థం తక్కువ శక్తులు ఉన్నాయని మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మడం అనుమతించబడుతుంది, కాని ప్రపంచ సృష్టికర్తకు సమానమైన దేవునితో సమానమైన శక్తిని విశ్వసించడం నిషిద్ధం. అటువంటి నమ్మకాన్ని ద్వంద్వవాదంగా మారువేషంలో నాస్తికత్వం యొక్క ఒక రూపంగా పరిగణిస్తారు.
సమస్త సృష్టికర్త కాకుండా సమస్త లోకానికి ఒక దేవుడు ఉన్నాడని భావించే వ్యక్తిని 'మౌలిక సూత్రాన్ని ధిక్కరించినవాడు' అంటారు.