Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

చాప్టర్ 3, పార్ట్ 4, "బ్రిట్ షాలోమ్" రబ్బీ ఊరి చెర్కీ

షాలోం మరియు ఆశీస్సులు,

మనము బ్రిత్ షాలోమ్ గురించి మన ఆకర్షణీయమైన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాము, దీనిని నోవాహీయుల కొరకు రుపొందించబడినషుల్కాన్అరూక్ అనగా హలాకా/నడవడిక గైడ్ గా వర్ణించవచ్చు. నోవాహైడ్ నియమాలు ఎలా ఉత్పన్నమయ్యాయనే సూత్రాలను నేర్చుకున్న తర్వాత, విగ్రహారాధన నిషేధానికి సంబంధించిన మూడవ అధ్యాయ౦లో ఇప్పుడు నిమగ్నమైపోయా౦.

 

విగ్రహారాధన, లేదా అన్యమతం పై,అబ్రాహాము కాలం నుండి యూదు మతం యొక్క ప్రాధమిక పోరాటంగా ఉంది మరియు ఈ రోజు వరకు అలాగే ఉంది. ఈ నిషేధం నోవాహీయులకు  కూడా వర్తిస్తుంది, మరియు మనము ఇప్పుడు ఈ నిషేధం యొక్క నిర్దిష్ట వివరాలను పరిశీలిస్తున్నాము. "దేవునిగూర్చిన జ్ఞానం" అనే శీర్షిక గల ఈ అధ్యాయం ఈ అంశాన్ని లోతుగా అన్వేషిస్తుంది.

ఇది ఇలా చెబుతుంది.

'విగ్రహాలను పూజించడం నిషిద్ధం. విగ్రహాలను పూజించడం అంటే ఏమిటి?

ఒక నిర్దిష్ట దేవతకు నిర్దిష్టమైన చర్యలకు మరియు సాధారణ అర్థంలో ఆరాధనగా పరిగణించబడే చర్యలకు మధ్య వ్యత్యాసం ఉంది.

 

నిర్దిష్ట మరియు సాధారణ ఆరాధన:

ఉదాహరణకు, ఒక నిర్దిష్ట విగ్రహం యొక్క ఆరాధనలో నృత్యం, బాణం వేయడం  లేదా ఇలాంటివి ఉంటే, ఆ విగ్రహానికి సంబంధించి  ఆ నిర్దిష్ట చర్యలను చేయడం నిషిద్ధం. అయితే సంప్రదాయంగా నృత్యంఆరాధనలో భాగం కానప్పుడు ఆ  విగ్రహానికి గౌరవ సూచకంగా ఎవరైనా నృత్యం చేస్తే వారికి శిక్ష పడదు.

 

సార్వత్రిక నిషేధాలు:

అయితే, సందర్భంతో సంబంధం లేకుండా కొన్ని చర్యలు ఎల్లప్పుడూ నిషేధించబడతాయి.

మూడవ అధ్యాయంలోని 7వ పేరాలో పాఠం ఇలా ఉంది:

సృష్టికర్తను కాకుండా, ఒక ఆరాధన రూపంగా, విగ్రహానికి నమస్కరించడం; బలిగా జంతు వధ; దహనసమర్పణలు లేదా ధూపం; విగ్రహానికి గౌరవ సూచకంగా ద్రాక్షా రసము, నూనె లేదా నీరు వంటి ద్రవమును పోయడం; మరియు 'నీవే నా దేవుడు' అని చెప్పడం వంటి విగ్రహాన్ని అంగీకరించే ఆచార ప్రకటనలు నిషేధించబడిన చర్యలు.

ఇది షెమా ఇశ్రాయేలు పఠనం ద్వారా దైవిక రాజ్యాధికారాన్ని అంగీకరించే యూదమతం యొక్క అభ్యాసానికి సారూప్యంగా ఉంటుంది—"ఓ ఇశ్రాయేలు, మన దేవుడైన, ప్రభువు ఒక్కడే." "నువ్వే నా దేవుడు" వంటి మాటలు దైవం కాని దానికి  ఇలాంటి ప్రకటనఎవరైనా చేస్తే అది నిషేధం కిందకు వస్తుంది.

అవి నిర్దిష్ట మతం లేదా ఆరాధనలో ఆచార పద్ధతులు కానప్పటికీ, నమస్కరించడం, బలులు అర్పించడం లేదా విధేయతను ప్రకటించడం వంటివి నిషేధించబడ్డాయి మరియు శిక్షించదగినవి.

 

ప్రార్థనలు మరియు ఇతర ఆచార కార్యకలాపాలు:

అదనంగా, ఒక విగ్రహాన్ని ప్రార్థించడం లేదా దాని ఆరాధనకు ప్రత్యేకమైన ఏదైనా ఆచార చర్యను చేయడం నిషిద్ధం. ఉదాహరణకు, విగ్రహారాధనలో నృత్యం లేదా ఒక నిర్దిష్ట వస్త్రాన్ని ధరించడం ఉంటే, అటువంటి పనులు చేయడం కూడా నిషేధించబడుతుంది మరియు శిక్షించబడుతుంది.

More Lessons on Brit Shalom

Chapter 5, Part 12, "Brit Shalom" by Rabbi Oury Cherki

One should not draw animals for no purpose.

Chapter 5, Part 11, "Brit Shalom" by Rabbi Oury Cherki

One who strikes his friend is called wicked.

Chapter 5, Part 10, "Brit Shalom" by Rabbi Oury Cherki

There are things similar to murder, which include any harm I cause to another person.

Search