షాలోం మరియు ఆశీస్సులు
బ్రిత్షాలోమ్ అనే పుస్తకంలో విగ్రహారాధన నియమాల అధ్యయనాన్ని కొనసాగిస్తూ, సాంకేతికంగా నోవాహీయులకు అనుమతించబడినప్పటికీ, విగ్రహారాధన విషయంలో తమతో తాము కఠినంగా ఉండాలనుకునే మరియు ఈ మార్గదర్శకాలను పాటించాలనుకునేవారికి ఇప్పటికీ ప్రశంసించదగిన పద్ధతులను మనము చర్చిస్తున్నాము.
ఉదాహరణకు, విగ్రహారాధనలో ఉపయోగించిన ఆహారాన్ని తినడం లేదా త్రాగకుండా ఉండటం మంచిది. ఎవరైనా ఆహారాన్ని ఒక విగ్రహానికి నైవేద్యంగా తీసుకువచ్చి, ఆ తర్వాత దానిని తీసివేసి తినడం సాంకేతికంగా అనుమతించినప్పటికీ, దానిని నివారించడం మంచిది. ఈ నిషేదంవిగ్రహారాధకులు పూజ కోసం నాటిన చెట్టు నుండి కలపకు లేదా విగ్రహాన్ని అలంకరించడానికి ఉపయోగించే బంగారం మరియు వెండి నుండి ప్రయోజనం పొందడానికి కూడా ఇది వర్తిస్తుంది. సాంకేతికంగా అనుమతించినప్పటికీ, కాలిపోయిన చెక్క విగ్రహం యొక్క బూడిద వంటి వాటిని ఉపయోగించాలనుకున్నప్పుడు, అలా చేయకుండా ఉండటం మంచిది.
పూజించడానికి తన కొరకు విగ్రహాన్ని తయారు చేసుకోకూడదు, ఇతరులు పూజించడానికి విగ్రహాన్ని తయారు చేయకూడదు. మీరు నైపుణ్యం కలిగిన కళాకారుడు అయినప్పటికీ, ఒక కళాకృతిని విగ్రహం రూపంలో సృష్టించమని అడిగినా, అలా చేయవద్దు. విగ్రహారాధనకు ఉపయోగించే ఏ వస్తువును తమ వద్ద ఉంచుకోకూడదు. సాంకేతికంగా దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి అనుమతించినప్పటికీ, అలా చేయకపోవడమే మంచిది.
అలంకరణ కోసం కూడా పూర్తి మానవ ఆకారపు విగ్రహాన్ని సృష్టించడం యూదులకు నిషిద్ధం. ఉదాహరణకు, ఒక కళా పాఠశాలలో, వారు ఒక పూర్తి మానవ ఆకృతిని చెక్కితే, ఆరాధన కోసం కాకపోయినా,కళాత్మకమైన వస్తువుగా కూడా ఒక యూదుడు దానిని సృష్టించడం ఇప్పటికీ నిషేధించబడింది. అయితే, మ్యూజియం వంటి అలంకరణ ప్రయోజనాల కోసం విగ్రహాన్ని ప్రదర్శించే ప్రదేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి నిషేధం లేదు. కేవలం కళాత్మక ప్రయోజనాల కోసం రూపొందించిన విగ్రహాన్ని ఆస్వాదించడానికి కూడా అనుమతి ఉంది.
సెక్షన్ 26 కొంత వింత నమ్మకాలకు సంబంధించిన విషయాలను చర్చిస్తుంది. యూదులు భవిష్యత్తును మంత్రమార్గాలఅనగా శకునాలు, సోదె ద్వారా అంచనా వేయడం, మంత్రాలను ఉపయోగించి ప్రకృతిని మార్చడం, చనిపోయిన వారి ఆత్మలను పిలిపించి వారితో సంభాషించడం (కర్ణపిశాచముచిల్లంగి విద్య), లేదా ఏ విధమైన మాంత్రిక విషయాలలో పాల్గొనడం నిషిద్ధం. వీటన్నిటినీ దేవునికి అసహ్యంగా తోరా వర్ణించింది. మనం శక్తి సామర్ధ్యాలను పొందాలనుకుంటే, వాటిని పరిశుద్ధుని నుండి పొందాలి. "నీవు నీ దేవుడైన అదోనైతో హృదయపూర్వకముగా ఉండవలెను" అనే వచనములో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. నోవాహీయులకుఈ ఆచారాలు వారికి స్పష్టంగా నిషేధించబడనప్పటికీ వాటికి దూరంగా ఉండటం సముచితం. నోవాహీయులుమాంత్రివిద్యలో పాల్గొనడానికి అనుమతించబడ్డారా అనే చర్చను తల్మూద్ నమోదు చేసింది. కొన్ని హలాఖిక్ తీర్పులు దీనిని అనుమతించినప్పటికీ, ఈ పద్ధతులు దేవుని ముందు అసహ్యించదగినవని స్పష్టమవుతుంది.
యూదియ ప్రజలు విగ్రహారాధన వైపు తిరగరాదని, దాని గురి౦చి ఆలోచనలు చేయవద్దని ఆజ్ఞాపి౦చబడ్డారు. దానిలో సత్య౦ ఉ౦దని వారు నమ్మకుండా ఉండేందుకు, దాన్ని చూడవద్దని కూడా ఆజ్ఞాపి౦చారు. కాబట్టి, యూదులు విగ్రహారాధన ప్రదేశాలకు తమను తాము దూరం చేసుకుంటారు, వాటిని చూడకుండా ఉంటారు మరియు వాటిని ఏ విధంగానూ ప్రశంసించకుండా ఉంటారు.మరి ప్రమాణాలు (ఒట్టు)మాటేమిటి? విగ్రహం పేరుతో ప్రమాణం చేయడం నిషిద్ధం, మరియు ఇతరులను వారి విగ్రహంపై ప్రమాణం చేయించకూడదని ఇందులో ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి కోర్టులో ఉన్నప్పుడు, న్యాయమూర్తి ఒక కక్షిదారుడిని ప్రమాణం చేయమని కోరితే,ఆ వ్యక్తి విగ్రహాలను విశ్వసిస్తే, అతను తన దేవుడిపై ప్రమాణం చేయడానికి అనుమతించబడతాడా? సమాధానం లేదు. కోర్టులో ప్రమాణం చేయాల్సి వస్తే అదోనై పేరు మీద లేదా ఎవరి చేత ప్రమాణం చేయాలో చెప్పనప్పుడు, తటస్థ విధానంలో ప్రమాణం చేయడం ఉత్తమం.సాంకేతికంగా నోవాహీయులకు అనుమతించబడిన పద్ధతులు ఉన్నప్పటికీ, విగ్రహారాధన విషయంలోతమతో తాము కఠినంగా ఉండాలని మరియు ఈ మార్గదర్శకాలను అనుసరించాలనుకునేవారుప్రశంసనీయులు.