Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

అధ్యాయం 2, భాగం 7

షాలోం మరియు ఆశీస్సులు

నేడు, మన౦ నోవహీయ న్యాయ విధాన౦లోని ఆచరణాత్మక కోణాల్లోకి ప్రవేశిస్తున్నా౦. విగ్రహారాధనపై నిషేధం - అన్యమతం మరియు అబద్ధ దేవతల ఆరాధనపై దృష్టి సారించే బ్రిత్ షాలోమ్ పుస్తకం యొక్క మూడవ అధ్యాయాన్ని మనము ప్రారంభిస్తున్నాము.

ఇక్కడ అర్థం చేసుకో వాల్సింది చాలా ఉంది, ముఖ్యంగా విగ్రహారాధనచేయకూడదు అనేది   నిషేదార్ధక వాక్యంగా చెప్పబడినట్లు చూస్తాం, అనగా చేయకూడనివి అని చెప్పబడింది. అయితే, విగ్రహారాధన నిషేధం అనేది దేవుని విశ్వసించుట అనే ఒక సానుకూల విశ్వాసంలో మూలం కలిగివుందని గుర్తించడం చాలా అవసరం.

నోవహీయులకు, దేవుని విశ్వసించాలి అనే బాధ్యత, తమ ఆజ్ఞల్లో స్పష్టంగా పేర్కొని  లేనప్పటికీ, విగ్రహాలను ఆరాధించకూడదనే అధికారిక నిషేధం ఉంది.

నోవహీయులు దేవుణ్ణి నమ్మమని స్పష్టమైన ఆజ్ఞ ఎ౦దుకు లేదు?

సమాధానం సూటిగా ఉంది: దేవునిపై విశ్వాసాన్ని నిర్వచించడం ఒక సంక్లిష్టమైన విషయం, మరియు చాలా మంది ప్రజలు దానిని వ్యక్తీకరించడానికి ప్రయత్నించినప్పుడు దేవుని గురించి వారి అవగాహనలో తప్పు చేస్తారు. అయితే, విగ్రహారాధనలో పాల్గొనవద్దని ప్రజలకు అవగాహన కల్పించవచ్చు, ఇది విశ్వవ్యాప్తంగా అర్థం చేసుకోదగిన భావన.

విగ్రహారాధన నిషేధం వెనుక సానుకూల పునాదులు:

ఏమి చేయకూడదనే దానిపై దృష్టి సారించినప్పటికీ, ఈ అధ్యాయంలో అనేక సానుకూల సూత్రాలు హైలైట్ చేయబడ్డాయి.

భగవంతుని ఉనికిపై విశ్వాసం:

దేవుడు ఉన్నాడని, ఆయన ఏకత్వంలో ఉన్నాడని నమ్మడం యూదు ప్రజల ప్రత్యేక వారసత్వం. 

యూదుల బాధ్యత:

దేవుని ఏకత్వాన్ని చరిత్ర ద్వారా యూదు ప్రజలకు బహిర్గతం చేశారు, మరియు ఇతర దేవుళ్లను ఆరాధించకూడదని యావత్ ప్రపంచానికి ప్రకటించడానికి ఈ విశ్వాసమే యూదు ప్రజలను ప్రేరేపిస్తుంది .ఈ వ్యత్యాసం దేవుని జ్ఞానాన్ని మానవాళికి అందించడంలో ఇశ్రాయేలియుల ప్రాధమిక భాద్యత నొక్కిచెబుతుంది, అయితే నోవహీయ చట్టాలు విగ్రహారాధన చేయకుండా ప్రజలందరినీ నడిపించడంపై దృష్టి పెడతాయి, సార్వత్రిక నైతికత యొక్క ప్రాథమిక చట్రాన్ని నిర్ధారిస్తాయి.

More Lessons on Brit Shalom

Chapter 5, Part 17, "Brit Shalom" by Rabbi Oury Cherki

According to morality, included in the prohibition of murder is any conduct that diminishes the life of another.

Chapter 5, Part 16, "Brit Shalom" by Rabbi Oury Cherki

Injuring oneself for no reason is forbidden.

Chapter 5, Part 15, "Brit Shalom" by Rabbi Oury Cherki

If someone unintentionally caused the death of another, they need to reflect deeply on their actions.

Search