"బ్రిత్ షాలోమ్" రెండవ అధ్యాయం అధ్యయనం చేస్తూ, ఇప్పుడు హలాఖా సూత్రాలలో 8 వ పేరాకు చేరుకున్నాం.
ఇక్కడ, ఆజ్ఞలలో "షివూరిమ్" (పరిమాణాత్మక కొలతలు) అవసరాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన భావన మనకు తారసపడుతుంది. దాని ఉద్దేశం యొక్క వివరణ ఇక్కడ చూద్దాం.
ఉదాహరణకు, తోరా ఇలా చెబుతో౦ది: "నీవు తిని, తృప్తిచెంది, నీ దేవుడైన అదోనైను ఆశీర్వది౦చవలెను." ఒక వ్యక్తి తిని తృప్తి చెందితే, పరిశుద్ధునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి "బిర్కత్ హమాజోన్" (భోజనానంతరం స్తుతి) అనే ఆజ్ఞ ఉంది. కానీ తృప్తిని ఎలా నిర్వచించగలం —ఏ దశలో ఒక వ్యక్తి "తృప్తి" పొందుతాడు మరియు ఆశీర్వాదాన్ని పఠించవలసిన బాధ్యత కలిగి ఉంటాడు? యూదుల చట్టం ప్రకారం ఒక వ్యక్తి గుడ్డు పరిమాణానికి సమానమైన ఆహారాన్ని తీసుకోవాలి; గుడ్డు పరిమానానికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకున్నప్పుడు సంతృప్తిచెందుతాడు. ఈ మొత్తం కంటే తక్కువ మొత్తం "సంతృప్తి"ని కలిగించదు.
మరి నోవహీయుల విషయం ఏంటి? యూదుల చట్టంలోని ఈ నిర్దిష్ట కొలతలకు సంబందించిన విషయాలకు వారు కట్టుబడి ఉన్నారా? ఇలాంటి కొలతలు చాలానే ఉన్నాయి. దీనికి సమాధానం ఏమిటంటే, నోవహీయులు ఈ చర్యలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా, ఒక వ్యక్తి ఆజ్ఞలకు బాధ్యత వహించే వయస్సును నిర్ణయించడంలో, యూదుల చట్టం 13 సంవత్సరాల వయస్సును నిర్దేశిస్తుంది. అయితే, ఇతర దేశాల ప్రజలకు, ఇది పిల్లల మానసిక మరియు శారీరక పరిపక్వత ద్వారా నిర్ణయించబడుతుంది.
అందువలన, ఇక్కడ చట్టం స్పష్టమౌతు౦ది: యూదుల ఆజ్ఞల్లో ఉపయోగి౦చబడే పరిమాణాత్మక కొలతలు, ఆలివ్ లేదా గుడ్డు పరిమాణ౦ వంటివి నోవహీయులకు వర్తించవు. ఇది యూదియ ప్రజలకు ప్రత్యేకమైనది మరియు నోవహీయులకు తప్పనిసరి కాదు. దీని ఆధారంగా, ఒక యవ్వనస్థుడైన నోవహీయ పిల్లవాడు ఈ ఆజ్ఞల నుండి మినహాయించబడతాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, నోవహీయ ఆజ్ఞలను పాటించనందుకు ఒక చిన్న పిల్లవాడు బాధ్యత వహించలేడు. కానీ ఏ వయసు వరకు? ఆ వయసును ఆ పిల్లవాడు పెరుగుతున్న సమాజం నిర్ణయిస్తుంది.