బెరిత్ షాలోమ్ 2వ అధ్యాయం కొనసాగింపు
మనము ప్రాధమిక సూత్రాలను చర్చిస్తున్నాము. ఇప్పుడు, 7వ సూత్రంలో, నిర్ధిష్ట వివరణలతో ఏం జరుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఉదాహరణకు, అంటుకట్టుట నిషేధాన్ని చర్చిస్తున్నప్పుడు - ఒక జాతికి చెందిన పండును మరొక జాతి చెట్టుకు అంటుకట్టకపోవడం – అనే ప్రశ్న తలెత్తుతుంది: రెండు జాతులను మనం ఎలా నిర్వచించాలి? యూదుల చట్టంలో, రెండు విభిన్న జాతులు ఏమిటో చాలా ఖచ్చితమైన నిర్వచనాలు ఉన్నాయి. ఉదాహరణకు, నిమ్మకాయ చెట్టు మరియు ఎత్రోగ్ (సిట్రోన్) చెట్టు, రెండూ సిట్రస్/నిమ్మజాతి కుటుంబానికి చెందినవి అయినప్పటికీ, రెండు వేర్వేరు జాతులుగా పరిగణించబడతాయి మరియు కలిసి అంటుకట్టబడవు. ఈ నిషేధం నోవాహీయులకు కూడా వర్తిస్తుందా, లేక జాతుల నిర్వచనాన్ని ఇతర దేశాల జ్ఞానులు నిర్ణయించాలా?
ఈ విషయంలో ఇశ్రాయేలు రబ్బీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. తల్ముద్ లేదా హలాఖిక్ అధికారులు స్పష్టంగా పేర్కొనని నోవాహీయ చట్టాల వివరాలను యూదు చట్టం ప్రకారం నడుచుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, దొంగతనం నియమాలలో, ఇశ్రాయేలు యొక్క మొత్తం హలాఖిక్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అవసరం. ఇంకొందరు తమ తార్కికత ఆధారంగా నిర్వచనాలను ఏర్పరచుకోవడం నోవహీయ రబ్బీల బాధ్యత అని నమ్ముతారు.
కాబట్టి, నోవాహీయులపై "ఈవిధంగా అంటుకట్టుట నిషిద్ధం", లేదా "యూదుల ధర్మశాస్త్రము ప్రకారము, ఇది దొంగతనము" వంటి వ్యాఖ్యలు చేసి వారిపై భారం మోపకూడదు. బదులుగా, యూదుల చట్టానికి సరిపోలని మానవ తార్కికత మరియు శాసనాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండో అభిప్రాయమే ప్రధానమైనది. ఈ చివరి అభిప్రాయం హలఖాలో ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది.