మనము అధ్యయనము చేస్తున్న " బ్రిత్ షాలోమ్" పుస్తకంలోని మొదటి అధ్యాయంలోని మూడవ భాగం, "బెనెయ్ నొవాహ్ " (నోవహీయులు)గా ఎవరు పిలవబడతారు అనే నిర్వచనంతో వ్యవహరిస్తుంది.
ముగ్గురు రబ్బీల న్యాయస్థానం ఎదుట నోవహీయ ఆజ్ఞలను అంగీకరించే వ్యక్తి అదనపు హోదాను పొందుతారని మనము ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యక్తిని "గెర్ తోషవ్" (నివసించు పరదేశి) అని పిలుస్తారు. ఈ విషయం 7వ పేరాలో పేర్కొనబడింది: "అతను ముగ్గురు రబ్బీల న్యాయస్థానం ఎదుట ఆజ్ఞలను అంగీకరించినట్లయితే, అతన్ని గెర్ తోషావ్ అని పిలుస్తారు మరియు ఇశ్రాయేల్ దేశంలో నివసించడానికి అతనికి అనుమతి వుంటుంది."
మరో మాటలో చెప్పాలంటే, నోవహీయ ఏడు ఆజ్ఞల కనీస రాజ్యాంగాన్ని తమపై తాము అంగీకరించని విగ్రహారాధికులు, సూత్రప్రాయంగా, ఇజ్రాయెల్ దేశంలో మన మధ్య స్థిరపడటానికి అనుమతించబడరు. దీనికి భిన్నంగా, ఏడు ఆజ్ఞలను అంగీకరించే వ్యక్తి మన మధ్య పౌరుడిగా నివసిస్థాడు మరియు ఒక పౌరుడిగా పూర్తి పౌర హక్కులను పొందుతాడు.
ఒక వ్యక్తి ఏడు ఆజ్ఞలను ఏ ప్రాతిపదికన అంగీకరిస్తాడు? వారు మోషే ధర్మశాస్త్రాన్ని విశ్వసించినందుకా? లేదా వారి హేతుబద్దత మరియు నైతికత వారిని అలా చేయమని వత్తిడి చేసినందుకా?
ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. 8వ పేరాలో, ఇలా చెప్పబడింది: “ఇశ్రాయేలియులు తెలియజేసినట్లుగా, మోషే తోరా యొక్క సత్యాన్ని గుర్తించినందున ఒక వ్యక్తి ఆజ్ఞలను అంగీకరించినట్లయితే, అలాటివానిని "హసీద్ ఉమోత్ హఓలం" (దేశాలలో నీతిమంతులు) అని కూడా పిలుస్తారు. ఇశ్రాయేలియులతో కలిసి రాబోయే ప్రపంచంలో అతడు పాలిభాగస్తుడౌతాడు. మరో మాటలో చెప్పాలంటే, వారు ఇశ్రాయేలు ప్రజల వలె రాబోయే ప్రపంచంలోని అదే "డిపార్ట్‌మెంట్"లో కూర్చుంటారు.
అయితే, 9వ పేరాలో, "ఆజ్ఞలను తోరాపై విశ్వాసంతో కాకుండా, హేతుబద్ధమైన అవసరంగా, కారణం లేదా నైతికతతో బలవంతం చేయబడిన వ్యక్తిని "హాహామ్ ఉమోత్ హఓలం" అని పిలుస్తారు. (దేశాల మధ్య జ్ఞాని )."
ఇదే హసీద్ (నీతిమంతునికి) మరియు హాహ్హామ్ (జ్ఞానికి) మధ్య వ్యత్యాసం. మన ఋషులు కొందరు హసీద్ కి ప్రాధాన్యతనిస్తే, మరికొందరు హాహ్హామ్ కు ప్రాధాన్యత ఇచ్చారు.