Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

పరిచయం, ఐదవ భాగం, రబ్బీ ఊరి చెర్కి గారు రచించిన "బెరిత్ షాలోమ్"

"విలువల ఐక్యతను గూర్చిన  ప్రశ్న"

మానవాళిలో నైతిక పోరాటాల గురించి చర్చించడం ప్రారంభించాము, కేంద్ర స్థానంలో ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలో పాతుకుపోయిన సంఘర్షణపై దృష్టి సారించాము. మానవుడా లేక దేవుడా? ఈ ప్రశ్నకు యూదు మతం ఒక పరిష్కారాన్ని అందిస్తుందని మనము కనుగొన్నాము. నైతిక సమస్యలు వంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. "మానవుల నైతిక ప్రశాంతతకు భంగం కలిగించే మరొక నైతిక సమస్య విలువల ఐక్యత సమస్య. పరస్పర విరుద్ధంగా కనిపించే విలువలను సర్దుబాటు చేయడానికి సరైన పరిష్కారం ఇంకా కనుగొనబడలేదు." కనికరానికి, న్యాయానికి మధ్య ఉన్న సంబంధమేమిటన్న ప్రశ్న తీవ్రంగా ఉత్పన్నమవుతోంది. పాశ్చాత్య సంస్కృతిలోని అన్ని రంగాలలో ప్రతిబింబించిన విధంగా కరుణ, కేవలం కరుణ మాత్రమే ప్రత్యేకమైన నైతిక విలువ అని క్రైస్తవ మతం ప్రపంచానికి అందించింది.

మరోవైపు, ఇస్లాం నిరంతరం కఠినమైన న్యాయానికి ప్రాధాన్యతనివ్వడం దేవుని సంకల్పంగా స్వీకరిస్తుంది. కాబట్టి,  విలువలు అంటే ఈ మతాల ప్రకారం, వీరిచ్చే సమాధానం కరుణ లేదా తీర్పు. ఇక్కడ కూడా యూద మతం మానవాళికి సహాయం చేస్తుంది. బైబిల్ మరియు తల్ముడిక్ సంప్రదాయాలు విలువల ఐక్యతను ఆచరణాత్మకంగా సర్దుబాటు చేసే మార్గాన్ని బోధిస్తాయి. ఆదికా౦డము గ్రంధం చెబుతున్నట్లు సర్వోన్నత నైతిక ఆదర్శ౦ "నీతి, న్యాయము". ఈ ఐక్యత యొక్క ఆచరణాత్మక సాక్షాత్కారం ఇశ్రాయేల్ రాజ్యం యొక్క యుద్ధాలలో (దానిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ) మరియు రాజకీయ మరియు సామాజిక నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇశ్రాయేల్ దేశంలోని శత్రు అల్పసంఖ్యాక వర్గాల పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించే దేశంలో, దయను న్యాయంతో ఏకం చేయడంలో మేము విజయం సాధించాము.

More Lessons on Brit Shalom

Chapter 3, Part 8, "Brit Shalom" by Rabbi Oury Cherki

Any involvement in promoting, advocating, or facilitating idol worship—whether through persuasion, prophecy, or construction—is strictly forbidden.

Chapter 3, Part 7, "Brit Shalom" by Rabbi Oury Cherki

What happens if a person is coerced to worship idols?

Chapter 3, Part 6, "Brit Shalom" by Rabbi Oury Cherki

One who considers that there is a god over the entire world apart from the Creator of all is called 'a denier of the fundamental principle.

Search