Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

బెరిత్ షాలోమ్ గ్రంధము 2వ అధ్యాయం 7వ భాగం, రచన రబ్బీ ఊరి చేర్కి గారు.

షాలోం,                                                            

నోవహీయ హలఖ యొక్క ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించిన బెరిత్ షాలోమ్ గ్రంధము యొక్క రెండవ అధ్యాయాన్ని మనము ముగిస్తున్నాము. ఈ సూత్రాలు కీలకమైనవి ఎందుకంటే అవి తరువాతి అన్ని నోవహీయ ఆజ్ఞల నడవడికకు  ఆధారాన్ని ఏర్పరుస్తాయి.

సందేహానికి సంబంధించిన హలాకా:

యూదియ హలఖలలో, సందేహం ఉన్న సందర్భాల్లో అనుసరించాల్సిన సూత్రం ఏమిటంటే:

  • తోరా చట్టాలు (దినీ తోరా) విషయంలో, మనము కఠినంగా ఉండి నిషేధిస్తాము (లెఖుమ్రా)
  • రబ్బినిక్ నియమాలకు (దినీ సోఫ్రిమ్), మనము అంత కఠినంగా ఉండము (లెకులా).

నోవహీయుల సందేహాస్పద వ్యాజ్యాల  సంగతేంటి? ఉదాహరణకు, ఏదైనా నిషిద్ధమైనదా లేదా అనుమతించబడిన పరిధిలోకి వస్తుందా అనే దానిపై అనిశ్చితి ఉంటే.

ఈ ఉదాహరణకు:

నాకు ఆహారం ఉంటే, అది ఒక సజీవ జంతువు నుండి వచ్చిందో మరెలా వచ్చిందో నాకు తెలియదు, మాంసం ఆ జంతువు జీవించి ఉన్నప్పుడు తీసుకోబడిందో లేక అది మరణించిన తర్వాత తీసుకోబడిందో  నాకు తెలియదు. అటువంటి సందర్భంలో, నోవహీయులపట్ల హలఖ సున్నితంగా (లెకులా) సున్నితంగా వ్యహరిస్తుంది.  అంటే అది అనుమతించబడుతుంది.

ఇది 15వ పేరాలో వివరించబడింది:

"నోవహీయ చట్టం విషయంలో సందేహం తలెత్తితే, తీర్పు మృదువుగా సౌమ్యంగా ఉండాలి."

అనుకోని ఉల్లంఘనలు:

సౌమ్యంగా తీర్పు ఇవ్వాల్సిన మరొక సందర్భం ఉద్దేశపూర్వక ఉల్లంఘనలకు సంబంధించినది. ఒక వ్యక్తి అనుకోకుండా ఒక ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఒకరి మరణానికి దారితీసే ప్రమాదానికి కారణమైతే, వారు మరణశిక్షకు బాధ్యత వహిస్తారా?

దీనికి సమాధానం, బాధ్యత వహించరు. అనాలోచితంగా ఒక ఆజ్ఞను ఉల్లంఘించే నోవహీయులకు మినహాయింపు ఉంటుంది.

నోవహీయుల పండుగలకు సంబంధించి:

నోవహీయులు యూదుల నియామక కాలాలు పండుగల నుండి ప్రేరణ పొందినప్పటికీ, బెరిత్ ఓలామ్ అనే సంస్థ ద్వారా అంతర్జాతీయ నోవహీయ ఉత్సవం ప్రారంభించబడింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం హెష్వాన్ నెల 27 వ తేదీన జరుపుకుంటారు.

జలప్రళయం తర్వాత ఓడ నుండి బయటకు వచ్చిన నోవహు, 7 ఆజ్ఞలను అందుకున్న రోజును ఈ తేదీ సూచిస్తుంది. పర్యవసానంగా, అనేక నోవహీయ సమాజాలు ఈ రోజును సర్వ మానవాళి పండుగగా స్వీకరించాయి.

హెష్వాన్ 27 వ తేదీన, జరుపుకోవడానికి బెరిత్ ఓలం ప్రార్థనా పుస్తకంలోని సూచనలను ఉపయోగించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ప్రతి సమాజం వారి ప్రత్యేకమైన ఆచారాలకు అనుగుణంగా ఏడు నోవహీయ చట్టాల ఆమోదాన్ని గుర్తించడానికి ఈ సర్వ మానవాళి పండుగ  ప్రోత్సహించబడుతుంది.

More Lessons on Brit Shalom

Chapter 3, Part 5, "Brit Shalom" by Rabbi Oury Cherki

Who or what falls under this category "other gods"?

Chapter 3, Part 4, "Brit Shalom" by Rabbi Oury Cherki

We are now immersed in the third chapter, which deals with the prohibition of idolatry

Chapter 3, Part 3, "Brit Shalom" by Rabbi Oury Cherki

Anyone who seeks to be a true servant of God must not associate any other entity besides the Creator of the world in the worship of God.

Search